స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలి.



మచిలీపట్నం జూన్ 19 (ప్రజా అమరావతి);


స్పందన అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాల


ని జిల్లా కలెక్టర్ పి రాజబాబు జిల్లా అధికారులను ఆదేశించారు.


సోమవారం నగరంలోని కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, ఆర్డిఓ ఐ కిషోర్ లతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి పలు ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.


ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించారు.   సంబంధిత అధికారులను పిలిపించి అర్జీల పరిష్కారంపై సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు.


జిల్లా అధికార యంత్రాంగం స్వీకరించిన అర్జీలలో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి



మచిలీపట్నం మండలం మేకవానిపాలెం గ్రామానికి చెందిన పండ్రాజు శ్రీలక్ష్మి తాను చాలా నిరుపేదనని సొంత ఇల్లు, పొలం లేదని వేరే ఆధారం లేదని ఇళ్లస్థలం మంజూరు చేయాలని కోరుతూ అర్జీ  చేశారు.



 ఉయ్యూరుకు  చెందిన సామాజిక కార్యకర్త జంపన శ్రీనివాస్ గౌడ్  పమిడిముక్కల మండలం గురజాడ గ్రామం నివాసి వీరంకి వాణి కుటుంబానికి ఇంటి నివేశన  స్థలము మంజూరు చేయాలని కోరుతూ విజ్ఞాపన పత్రం అందజేశారు.


 ఘంటసాల మండలం ఎండకుదురు గ్రామస్తులు తాము బస్ షెల్టర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని తమకు జీలగల గండి ఆంజనేయస్వామి  గుడి దగ్గర బస్ షెల్టర్ నిర్మించి ఇవ్వాలని కోరుతూ అర్జీ అందజేశారు


ఈ సందర్భంగా  కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ స్పందన అర్జీల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో పరిష్కరించాలన్నారు.


అనంతరం  జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని చేపట్టిందని అందులో మెరుగైన పరిష్కార పద్ధతులను అవలంబిస్తూ జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకుందన్నారు.


గతంలో రెండు మూడు శాఖలకు సంబంధించిన సమస్య ఉంటే ఎవరికి వారు పరిష్కరించడంలో కొంత ఆలస్యం జరుగుతుండేదని  ఆ పరిస్థితులను అధిగమిస్తూ నేడు జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో సంబంధిత అధికారులు అందరూ కూడా కలిసి ఒకేసారి  క్షేత్రస్థాయిలో పర్యటించి  సంబంధిత అర్జీదారునితో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు.

ఆ ప్రకారం జిల్లాలో కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న చాలావరకు సమస్యలు ఇటీవల  పరిష్కరించడం జరిగిందన్నారు.


జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఈనెల 23వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవోలు తహసీల్దారులు మున్సిపల్ కమిషనర్లతో  కొన్ని టాస్క్ ఫోర్స్ కమిటీలు వేసామన్నారు.

ప్రతి ఇంటిలో ఉన్న సమస్యలను ముందే వాలంటీర్ల ద్వారా తెలుసుకొని టోకెన్లు ఇస్తామన్నారు.

నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సచివాలయాల పరిధిలో అధికారులు అందుబాటులో ఉంటారని అక్కడే ప్రజలకు కావలసిన వివిధ రకాల కులము, ఆదాయము, విద్య, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు.

ప్రస్తుతం ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం  పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే సంవత్సరంలో రెండుసార్లు అనగా జూన్, డిసెంబర్ మాసాలలో మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.



ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి పీఎస్ఆర్ ప్రసాద్, డ్వామా పిడి జివి సూర్యనారాయణ, జెడ్పీ సీఈవో జ్యోతిబసు, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, డిపిఓ నాగేశ్వర్ నాయక్, డీఎస్ఓ పార్వతి, ముడా విసి రాజ్యాలక్ష్మి, సిపిఓ వై శ్రీలత, డిఎంహెచ్వో డాక్టర్ గీతా బాయి, డిఈఓ తేహెరా సుల్తానా, భూ సర్వే రికార్డుల ఏడి గోపాలకృష్ణ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు


Comments