కేజీహెచ్ లో సోలార్ పవర్ ప్లాంట్.



  కేజీహెచ్ లో సోలార్ పవర్ 

      ప్లాంట్.



  సి.ఎస్.ఆర్ లో భాగంగా 

      రూ.50 లక్షలతో 

      నిర్మించనున్న ఆర్సెలార్     

      మిట్టల్ నిప్పన్ స్టీల్ 

     ఇండియా లిమిటెడ్.


 జిల్లా ఇంఛార్జి మంత్రి 

    విడదల రజని చేతుల 

    మీదుగా ఎం.ఓ.యు.


విశాఖపట్నం, జూన్ 27 (ప్రజా అమరావతి):  సి.ఎస్.ఆర్ కింద కింగ్ జార్జ్ హాస్పిటల్‌ ( కేజీహెచ్ ) లో 50 లక్షల విలువైన సోలార్ పవర్ ఏర్పాటు నిమిత్తం ఎంవోయూ కార్యక్రమం జిల్లా ఇన్చార్జి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని ఆధ్వర్యంలో జరిగింది . మంగళవారం ఉదయం గాజువాక మండలం, కణితి యుపిహెచ్సి ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఎంవోయూ కార్యక్రమం జరిగింది. కింగ్ జార్జ్ హాస్పిటల్‌ , ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ తో కెజిహెచ్‌లోని సిఎస్‌ఆర్ బ్లాక్ రూఫ్ టాప్‌లో సౌర విద్యుత్‌ను ఇన్‌స్టాలేషన్ చేయడానికి ఎంఒయుపై సంతకం జరిగింది. ఎంఓయూపై AMNS వైజాగ్ అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. రవీంద్రనాథ్ మరియు KGH సూపరింటెండెంట్ పి. శివానంద మంత్రి విడదల రజిని సమక్షంలో సంతకాలు చేశారు.


కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ  ( సి ఎస్ ఆర్  ) కింద వైజాగ్ అసెట్‌కు చెందిన ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ 

ఇండియా లిమిటెడ్ చేపట్టిన ఈ సోలార్ పవర్ ఇన్‌స్టాలేషన్ ద్వారా కేజీహెచ్ లో విద్యుత్ ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుందని మంత్రి అన్నారు.


ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి,   జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున,  గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి,  D.S.వర్మ, AMNS ఇండియా లిమిటెడ్ హెడ్-HR&అడ్మిన్, వైజాగ్ అసెట్ తదితరులు పాల్గొన్నారు.




Comments