మరిన్ని విదేశీ పెట్టుబడులే లక్ష్యం : ఆర్థిక, నైపుణ్య, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.
*మరిన్ని విదేశీ పెట్టుబడులే లక్ష్యం : ఆర్థిక, నైపుణ్య, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*దక్షిణ కొరియా, వియత్నం దేశాల్లో 10 రోజుల పర్యటన*


*టెక్స్ టైల్స్, పరిశ్రమలు,పర్యాటక, ఆక్వారంగాలపై ప్రత్యేక దృష్టి*


*సాంకేతిక, వృత్తి విద్య నైపుణ్యాభివృద్ధి అంశాలపై అధ్యయనానికి ప్రాధాన్యత*


*పర్యటనలో ప్రముఖ సంస్థలను సందర్శించనున్న మంత్రి నేతృత్వంలోని బృందం*


అమరావతి,జూలై, 15 (ప్రజా అమరావతి); ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలోని అధికారుల బృందం పది రోజుల విదేశీ పర్యటనకు సమాయత్తమైంది. ఏపీకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దక్షిణ కొరియా, వియత్నం దేశాల్లో పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని బయలుదేరింది. సాంకేతిక, వృత్తి విద్య నైపుణ్యాభివృద్ధి అంశాలపై అధ్యయనం చేయనున్నట్లు ఆర్థిక, నైపుణ్య, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. టెక్స్ టైల్, పరిశ్రమలు, పర్యాటక, ఆక్వా రంగాలలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఇప్పటికే మంత్రి బుగ్గన సహా అధికారుల బృందం ఢిల్లీకి చేరింది. ఇప్పటికే ఈ నెల 10వ తేదీన  ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ముందస్తు ఏర్పాట్ల సమీక్షలో పెట్టుబడులకు అవకాశాలున్న రంగాలపై సంబంధిత శాఖల కార్యదర్శులు, దేశ రాయబారులతో మంత్రి బుగ్గన అధ్యక్షతన ప్రత్యేక సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి నేతృత్వంలోని అధికారుల బృందం హైదరాబాద్, విజయవాడ నుంచి శనివారం ఢిల్లీకి చేరింది. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి ఆదివారం ఉదయానికి కొరియా చేరుకుంటారు.


*దక్షిణ కొరియా, వియత్నాంలోని  కీలక సంస్థల సందర్శన*


దక్షిణ కొరియాలోని కియా పరిశ్రమను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నేతృత్వంలోని అధికారుల బృందం సందర్శించనుంది. ఏపీలోని కియా యూనిట్ ను మరింతగా విస్తరించేందుకు గల అవకాశాలను వివరించనున్నారు. కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మారిటైం అండ్ ఫిషరీస్ టెక్నాలజీలను సందర్శించనున్నారు. శామ్ సంగ్, దేసాంగ్ కార్పొరేషన్ లను కూడా సందర్శించనున్నారు.వియత్నాంలోని సౌత్ ఎకనామిక్ జోన్ కూడా విజిట్ చేయనున్నారు.తద్వారా ఆక్వా, టెక్స్ టైల్స్,ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, స్కిల్ డెవలప్ మెంట్ రంగాలపై ప్రధానంగా శ్రద్ధపెట్టినట్లు మంత్రి బుగ్గన వివరించారు. ఈ ఏడాది మార్చిలో విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో వియత్నాం ప్రతినిధులతో సమావేశమై పెట్టుబడులపై చర్చలు జరిగాయి. దీనికి కొనసాగింపుగా  తాజా పర్యటనలో పారిశ్రామికవేత్తలతో సమావేశమవనున్నారు.


*సందర్శించినున్న మరిన్ని పరిశ్రమలు, సంస్థలు,పార్కులు*


1.శామ్సంగ్ 

2.నోంగ్‌షిమ్ కో లిమిటెడ్ 

3.కియా ప్లాంట్ (హ్వాసంగ్)

4.కొరియా టెక్స్‌టైల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (KTDI)

5.ఓషన్ అండ్ ఫిషరీస్ HRD ఇన్స్టిట్యూట్

6. కొరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ అండ్ ఫిషరీస్ టెక్నాలజీ బుసాన్ 

7.కార్మిక, వికలాంగులు , సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ

8.వియత్నాం జర్మన్ TVET ప్రోగ్రామ్ కేంద్రాలు 

9.వియత్నాం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ

 10.హా నోయి ఇండస్ట్రియల్ టెక్స్‌టైల్ JSC 

11.ఆక్వాకల్చర్ పార్క్

12.సైగాన్ ఇండస్ట్రియల్ పార్క్

13.తంతువాన్ ఇండస్ట్రియల్ పార్క్


మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బృందంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, నైపుణ్య, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ వినోద్ కుమార్ తో పాటు మరో ఇద్దరు ఈ పర్యటనలో భాగస్వామ్యమవనున్నారు.Comments