సాంప్రదాయాలను చాటిచెప్పే బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం.. తలసాని శ్రీనివాస్ యాదవ్.


 *సాంప్రదాయాలను చాటిచెప్పే బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం.. తలసాని శ్రీనివాస్ యాదవ్*

హైదరాబాద్:జులై 16 (ప్రజా అమరావతి);

తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గోల్కొండలో బోనాలు ప్రారంభమయ్యాయని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుతున్నాయని అన్నారు. లాల్‌దర్వాజా అమ్మవారికి మంత్రి తలసాని పట్టువస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బోనాల సందర్బంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, రాజకీయాలకు అతీతంగా బోనాల జాతర జరుగుతోందని చెప్పారు.


ఏ ప్రభుత్వాలు దేవాలయాలకు నిధులు ఇవ్వడం లేదని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం బోనాలకు ప్రత్యేక నిధులు కేటాయించిందని మంత్రి తలసాని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. ఢిల్లీలో కూడా బోనాలు చేసి మన సంప్రదాయంను చాటి చెప్పారన్నారు. కుల మతాలకు అతీతంగా ఐక్యతతో బోనాల ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ప్రశాంతంగా బోనాల ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నానని మంత్రి తలసాని అన్నారు...

Comments