పుట్టపర్తిలో బాలల హక్కుల పరిరక్షణ బృందం.

 పుట్టపర్తిలో బాలల హక్కుల పరిరక్షణ బృందం*


 పుట్టపర్తి. జూలై 20 (ప్రజా అమరావతి): జిల్లాలో

రెండ్రోజుల పర్యటనలో భాగంగా  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బృందం పుట్టపర్తికి గురువారం చేరుకుంది. బృందంలో సభ్యులు గొండు సీతారాం, త్రిపర్ణ ఆదిలక్ష్మి, బత్తుల పద్మావతి ఉన్నారు. గురువారం  స్థానిక  కలెక్టరేట్లోని  కలెక్టర్ ఛాంబర్ నందు కలెక్టర్  పి. అరుణ్ బాబు కమిటీ బృందం మర్యాదపూర్వకంగా కలిశారు.జిల్లా వ్యాప్తంగా బాలల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన చర్యలు గురించి చర్చించారు.  ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ మేడా రామలక్ష్మి, ఐసీడీఎస్ సత్యసాయి జిల్లా పీడీ లక్ష్మీకుమారి  తదితరులు పాల్గొన్నారు


Comments