రాష్ట్ర స్థాయిలో క్రీడలకు సంబంధించి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్సు ఏర్పాటుకు చర్యలు

 రాష్ట్ర స్థాయిలో క్రీడలకు సంబంధించి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్సు ఏర్పాటుకు చర్యలు


రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం

విశాఖ,విజయవాడ,మంగళగిరిల్లో క్రీడా ఎకాడమీల ఏర్పాటుకు కృషి

వివిధ జిల్లాల్లో 16 స్పోర్ట్సు స్కూళ్ళు ఏర్పాటుకు ప్రణాళిక

ప్రతిభ గల క్రీడాకారులను పూర్తి స్థాయిలో ప్రోత్సహించాలి

గ్రామ,మండల,నియోజకవర్గ స్థాయిలో క్రీడాపరమైన మౌలిక సదుపాయాలు పెంచాలి

ఆడుదాం ఆంద్ర క్రీడా పోటీల విజయవంతానికి కార్యాచరణ సిద్ధం చేయండి

              రాష్ట్ర నూతన క్రీడా విధానంపై సమీక్షలో సిఎస్ జవహర్ రెడ్డి

అమరావతి,4 జూలై (ప్రజా అమరావతి);:రాష్ట్రంలో క్రీడలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్సు ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో 2023-28 రాష్ట్ర క్రీడా విధానంపై క్రీడల శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు.ఈసందర్బంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్ళాయని అది మంజూరైతే రాష్ట్రానికి క్రీడా పరంగా దేశంలోనే మరింత గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. విశాఖపట్నం,విజయవాడ,మంగళగిరిల్లో మూడు క్రీడా ఎకాడమీలను ఏర్పాటు చేసేందుకు నూతన క్రీడా విధానంలో పొందుపర్చాలని చెప్పారు.అలాగే వివిధ జిల్లాల్లో 16 క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.ప్రతి క్రీడా పాఠశాలలో 100 మంది బాలురు,100 మంది బాలికలకు 16 విభాగలకు సంబంధించిన వివిధ క్రీడల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారిలో క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్.జవహర్ రెడ్డి అధికారులకు సూచించారు.వీటి ఏర్పాటుకు సంబంధించి ఎంత వరకు భూమి,నిధులు ఇతర అవసరాలు కావాలనేదానిపై పూర్తి స్థాయిలో అంచనా వేసి నివేదిక సిద్ధం చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

రాష్ట్ర్లంలో ప్రతిభ గల క్రీడా కారులను గుర్తించి వారిని అన్నివిధాలా ప్రోత్సహించేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశించారు.అదే విధంగా గ్రామ,మండల,అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో క్రీడాపరమైన మౌలిక సదుపాయాలను మెరుగు పర్చేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆడుదాం ఆంధ్ర పేరిట గ్రామ స్థాయి నుండి నిర్వహించనున్నక్రీడా పోటీలకు సంబంధించి ప్రజల భాగస్వామ్యంతో విజయంవతం చేసేందుకు పూర్తి స్థాయి కార్యాచరణతో సిద్ధం కావాలని ఆదేశించారు.స్కూల్ గేమ్స్ నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్య,రెసిడెన్సియల్ విద్యాలయాలకు చెందిన అధికారులతో త్వరలో సమావేశం నిర్వహించి చర్చించడం జరుగుతుందని అన్నారు.

అంతకు ముందు రాష్ట్ర యువజన సర్వీసులు,క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి వాణి మోహన్ 2023-28 రాష్ట్ర క్రీడా విధానానికి సంబంధించి ముఖ్య అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ప్రతిభ గల క్రీడాకారులను ముందుగానే గుర్తించి వారికి తగిన శిక్షణను ఇవ్వడం వారికి సంబంధించిన డేటాబేస్ ను నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.అదే విధంగా ప్రతి క్రీడాకారుని లోని ప్రతిభను గుర్తించి వారు రాష్ట్ర, జాతీయ,అంతర్జాతీ స్థాయిలో రాణించేందుకు అవసరమైన తోడ్పాటును అందించడం జరుగుతుందన్నారు.పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయం స్థాయి వరకూ ప్రత్యేకంగా పిఇటి.పిడి లను ఏర్పాటు చేసి వివిధ అంశాల్లో విద్యార్ధులకు క్రీడాపరమైన శిక్షణను ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.స్పోర్ట్సు క్లబ్ లు,యోగా అసోసియేషన్ల సహకారంతో అన్ని విశ్వ విద్యాలయాల్లో యోగా పధం శిక్షణను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ రకాల క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించిన కేలండర్ ను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.ఇంకా ఈక్రీడా విధానానికి సంబంధించి తీసుకోనున్న వివిధ వినూత్న కార్యక్రమాలు తదితర అంశాల గురించి ముఖ్య కార్యదర్శి వాణి మోహన్ వివరించారు.

ఈసమావేశంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాప్)ఎండి హర్షవర్ధన్,ఎఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Comments