స్పందనలో వచ్చిన అర్జీలను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలి.. ..... కలెక్టర్ కె. మాధవీలత.



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);


** ఈ రోజు స్పందనలో వచ్చిన అర్జీలు సంఖ్య 151


** జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సంబందిత పిర్యాధులు 123 ,  పోలీసు సంబంధించిన అర్జీలు 28


స్పందనలో వచ్చిన అర్జీలను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలి..


.....  కలెక్టర్ కె. మాధవీలత

.... ఎస్పీ సిహెచ్ . సుధీరకుమార్ రెడ్డి



  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన, జగనన్నకు చెబుదాం వంటి కార్యక్రమంపై  నమ్మకాన్ని కలిగేలా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు పరిష్కారంలో పెండింగ్ లేకుండా  ఏప్పటికప్పుడు నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించాలని  జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత ,  జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిహెచ్. సుదీర్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు.


సోమవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి స్పందన  కార్యక్రమంలో కలెక్టరు డా. కె . మాధవీలత, జిల్లా ఎస్పీ సిహెచ్.సుధీర్ కుమార్ రెడ్డి, జేసీ ఎన్. తేజ్ భరత్ ల తో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.



ఈ సందర్భంగా డా. కె . మాధవీలత, జిల్లా ఎస్పీ సిహెచ్ . సుధీర్ కుమార్ రెడ్డి  మాట్లాడుతూ,  జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యలు పరిష్కారం కొరకు స్పందన లో వచ్చిన అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా  నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించే విధంగా సంబంధిత శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షించాలని అన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం రాకపోయినా, నిర్దేశించిన గడువులోగా ఇవ్వకపోయినా సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.  అర్జీదారునికి ఇచ్చే  సమాధానం నాణ్యతతో పూర్తి వివరాలుతో ఉండాలన్నారు. 


  జిల్లా అధికారులందరూ  ప్రజల నుంచి వచ్చే అర్జీలు పట్ల అత్యంత శ్రద్ధ వహించి పూర్తిగా చదివి తదుపరి వాటిని పరిష్కారం చూపాలన్నారు. జగనన్నకు చెబుదాం వెబ్సైట్ ద్వారా, 1902 నంబర్ కు ప్రజలు సమస్యలను తెలియజేస్తున్నారని,  ఎప్పటి కప్పుడు లాగిన్ ఓపెన్ చేసి పరిష్కరించాలన్నారు.  ఈ రోజు స్పందనలో ఆన్ లైన్ ద్వారా 119, మాన్యువల్ గా 32 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించామన్నారు.


ఇందులో రెవెన్యూ ఇతర శాఖలకు చెందిన 123   పోలీసు శాఖ కు సంబందించి 28 అర్జీలు రావడం జరిగిందని  వారు  పేర్కొన్నారు.



స్పందన లో కొన్ని అర్జీలు...


సీతానగరం  మండలం రామచంద్రపురం గ్రామానికిన్ నివాసి పీర్ల అనంతలక్ష్మి  అర్జీలో తనకు వారసత్వపు హక్కుగా తన తల్లినుంచి సీజినా కొండేపూడి గ్రామంలో 144 చ.గ. స్థలం రాగ అందులో రేకులశేడబివేసుకొని నివాసం ఉంటున్నాను. అయితే దారం సుబ్బారావు ఆనువ్యక్తి నా స్థలంలో తనకు కూడాన్వాత వుండంటూ పాక వేసాడు. కావున అధికారులు పరీశీలించి న్యాయం చేయాలని అర్జీలో కోరారు.


రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం నివాసి కొప్పిశెట్టి రోజా తమ అర్జీలో తనకు వివాహం జరిగి మూడేళ్లు అయ్యిందని ఆధార్ కార్డు ను పరిశీలించి పేరును రేషన్ కార్డు లో చేర్పించాలని కోరగా కలెక్టరు స్పందిస్తూ జగనన్న సురక్ష కార్యక్రమం క్రింద పేను నమోదు చేయాలని తాహశీల్థారను ఆదేశించారు. 


రంగంపేట మండలం ఎస్. సింగంపల్లి గ్రామానికి చెందిన ఎస్. నరేష్ కుమార్ తమ అర్జీలో గ్రామంలో తమ పొలం సమీపంలో షామిల్లు ఏర్పాటు వలన పంటను పాడుచేయు పురుగులు, విపరీతమైన శబ్దము వచ్చుచున్నదని, కావున షామిల్లు నిర్మాణము నిలుపుదల చేయవలసిందిగా వారు కోరగా, ఈఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారిని పరిశీలించి తగు నివేదిక అందించాలని కలెక్టరు ఆదేశించారు. 


బిక్కవోలు మండలం పందలపర్రు గ్రామానికి చెందిన పైనా వెంకట్రావు అర్జీలో  తాను తన బ్యాంకు అకౌంట్ నుంచి మూడు విడతులుగా తాను ఎటువంటి లాదేవీలు చేయకుండానే సొమ్ము డిబిట్ అవుతుందని,అధికారులు దయచేసి డిబిట్ అయిన సొమ్ము తిరిగి అకౌంట్ లో పడేవిధంగా చేయాలని వారు అర్జీలో కోరారు. దీనిపై జిల్లా ఎస్ పీ సుదీర్ కుమార్ రెడ్డి స్పందిస్తూ సైబర్ నేరంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి తగు చర్యలు చేపట్టాలని బిక్కవోలు ఎస్ఐ ని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మాధవీలత స్పందిస్తూ రికార్డులు పరిశీలించి  తగు చర్యలు తీసుకోవాలని తాసీల్దారను ను ఆదేశించారు.


  ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్,  డీఆర్వో  జి.నరశింహులు, పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి.స్వామినాయుడు,  డియంహెచ్ఓ డా. కె.వేంకటేశ్వరరావు, డిసిహెచ్ఒ డా. ఎమ్. సనత్ కుమారి,  సీపీఓ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవరావు, డిహెచ్ఓ వి.రాథాకృష్ణ, పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్ జీ టి సత్యగోవిందం, డ్వామా పీ డి జిఎస్ రామగోపాల్,  స్త్రీ శిశు సంక్షేమ శాఖ కె. విజయ కుమారి,డి ఈఓ ఎస్. అబ్రహం, డి ఎల్ డిఓ పి. వీణాదేవి, సివిల్ సప్లై జిల్లామేనేజరు వి.నాగార్జున రెడ్డి, ఎస్ ఈ పి ఆర్ ఎ బి వి ప్రసాద్, ఎస్ ఈ ఆర్ డబ్ల్యు ఎస్ డి. బాల శంకర రావు, డి ఎల్ డివో వి. శాంత మణి, డిఆర్డీఏ పిడి ఎస్. సుభాషిణి,   పలువురు జిల్లా శాఖా అధికారులు  తదితరులు పాల్గొన్నారు.


Comments