*అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు దిగ్గజాలు "ఆస్టర్,రమేష్" హాస్పిటల్స్ కలయికతో ఆరోగ్య సంరక్షణలో ఒక వినూత్న శకం ఆరంభం
*
అమరావతి (ప్రజా అమరావతి);
భారతదేశం మరియు గల్ఫ్ దేశాల నందు 32 కు పైగా హాస్పిటల్స్,127 క్లినిక్ లు,521 ఫార్మసీలు,205ల్యాబ్ లు 30 వేలకు పైగా ఉద్యోగులతో ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ సర్వీసులు అందిస్తున్న ప్రముఖ బహుళ జాతి ఆరోగ్య సంరక్షణ సంస్థ ఆస్టర్ డి.ఎం హెల్త్ కేర్ మరియు ఆంధ్రప్రదేశ్ లో నాణ్యమైన హెల్త్ కేర్ సర్వీసులను అందిస్తున్న రమేష్ హాస్పిటల్స్ ప్రజలకు సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ అందించే క్రమంలో భాగంగా 2016 వ సంవత్సరం నుంచి కలిసి పనిచేయడం ప్రారంభించాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత ఉన్నత స్థాయి వైద్య సంరక్షణ, అధునాతన వైద్య సదుపాయాలు,సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో భాగంగా విజయవాడ గుంటూరు మరియు ఒంగోలులో ఉన్న నాలుగు హాస్పిటల్స్ ఇప్పుడు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ గా రూపాంతరం చెందాయి.
ఆస్టర్ డి.ఎం హెల్త్ కేర్ తో అనుబంధం గురించి డాక్టర్.పోతినేని రమేష్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో వారి యొక్క భాగస్వామ్య సహకారంతో ఆరోగ్య సంరక్షణలో నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఒక బహుళ జాతి సంస్థగా తమ సంస్థ రూపాంతరం చెందిందని అదేవిధంగా భారతదేశంలో వైద్య సేవలు అందిస్తున్న ఆస్టర్ నెట్ వర్క్ హాస్పిటల్స్ లో అత్యంత నైపుణ్యం కలిగిన వైద్య బృందం సహకారంతో రోబోటిక్ సర్జరీలు,గుండె,లివర్ అవయవ మార్పిడి మరియు క్యాన్సర్ వైద్య చికిత్సను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలియజేశారు. 15 సంవత్సరాలుగా టెలి మెడిసిన్ రంగంలో ఉన్న అనుభవంతో వైద్యంలో శాస్త్రీయ పద్ధతులను, ఎప్పటికప్పుడు మారుతున్న వైద్య విధానాలను అందిపుచ్చుకునే క్రమంలో భాగంగా డాక్టర్ ఆజాద్ మూపెన్ సారథ్యంలో నడుస్తున్న వయనాడ్ మెడికల్ కాలేజ్ వైద్యులు మరియు ఆస్టర్ నెట్ వర్క్ లోని సూపర్ స్పెషాలిటీ వైద్యుల అనుసంధానంతో వైద్య విద్యా సంబంధమైన మరియు జన్యుపరమైన అధ్యయన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మార్పిడి చేసుకుంటున్నామని డాక్టర్ రమేష్ బాబు తెలియచేశారు.
ఆస్టర్ సంస్థతో భాగస్వామ్యం ద్వారా వారి యొక్క విలువైన సహకారంతో జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ నాణ్యత ప్రమాణ సంస్థల గుర్తింపు పొందడం మరియు మెడికల్ టూరిజం ద్వారా విదేశీ రోగులకు కూడా వైద్యాన్ని అందిస్తున్నామని ఆరోగ్య సంరక్షణ రంగంలో ఈ ప్రాంత ప్రజల ఆదరణ చూరగొన్న ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ నాణ్యమైన,అధునాతన వైద్య సేవలు అందించడానికి మరింత వీలు కలుగుతుందని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ లో విస్తరణ మరియు ఆస్టర్ రమేష్ పునర్నిర్మాణం పై ఆస్టర్ హెల్త్ కేర్ వ్యవస్థాపక చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆజాద్ మూపెన్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో రమేష్ హాస్పిటల్స్ కీలకమైన కృషి చేసిందని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సేవలందించే క్రమంలో భాగంగా ఈ పునర్నిర్మాణం ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. ఇతర రాష్ట్రాలకు,దేశాలకు వెళ్లే అవసరం లేకుండా ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు మరియు ఆంకాలజీ వైద్య విభాగంలో టెర్షరీ మరియు క్వార్టర్నరీ శ్రేణి వైద్య సంరక్షణ సదుపాయాలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నామని ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ లో ఎంతో కీలకమైన ఆస్టర్ మెడికల్ అడ్వైజరీ బోర్డులో క్లినికల్ మరియు అకడమిక్ అనుభవం కలిగిన డాక్టర్ రమేష్ బాబు చేరడం ద్వారా అధునాతన వైద్య విధానాలను అందిపుచ్చు కోవడంలో ఆస్టర్ నెట్ వర్క్ లో ఉన్న వైద్యులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని డాక్టర్ ఆజాద్ మూపెన్ తెలియజేశారు.
ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ పునర్నిర్మాణం మరియు భవిష్యత్ ప్రణాళికల గురించి ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నితీష్ శెట్టి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన బహుళ జాతి ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఆస్టర్ రమేష్ ఆస్పత్రులు ముందంజలో ఉండే విధంగా లక్ష్యం పెట్టుకున్నామని ఎప్పటికప్పుడు అధునాతన వైద్య నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం ద్వారా సమగ్రమైన మరియు సంతృప్తికరమైన ఆరోగ్య ఫలితాలను రోగులకు అందించడానికి మరింత అంకితభావంతో కృషి చేస్తామని తెలియజేశారు.
ఈ పత్రికా సమావేశంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చైర్మన్ ఎం.ఎస్.రామ్మోహనరావు,
ఆస్టర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సునీల్ కుమార్,రీజినల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవానంద్,డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత మరియు మెడికల్ డైరెక్టర్ డాక్టర్.పావులూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు
addComments
Post a Comment