ఏపీలో ‘ముందస్తు’ ఎన్నికలు లేవు: సజ్జల

 ఏపీలో ‘ముందస్తు’ ఎన్నికలు లేవు: సజ్జల- ఇదంతా చంద్రబాబు, పవన్‌ల గేమ్‌ ప్లాన్‌ మాత్రమే...


- జగనన్న సురక్ష'కి అపూర్వమైన స్పందన.. ప్రజలు ఇచ్చిన ఆవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటాం...

అమరావతి (ప్రజా అమరావతి);

       ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదు అని క్లియర్‌ కట్‌గా చెప్పారు. ముందుస్తు ఎన్నికల పేరుతో కొన్ని మీడియా ఛానెళ్లు హడావుడి చేస్తున్నాయని అన్నారు. 


కాగా, సజ్జల గురువారం మీడియాతో మాట్లాడుతూ.. "జగనన్న సురక్ష కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటాం. మళ్లీ సీఎం జగన్‌ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతీ ఎమ్మెల్యేకు ప్రజలు ఇదే చెబుతున్నారు. సీఎం జగన్‌ పూర్తిగా పాజిటివ్‌ ఓటునే నమ్ముకున్నారు. ముందస్తు ఎన్నికలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ముకాసే మీడియా ఛానెల్స్‌ హడావుడి ఇది. ప్రజలను గందరగోళానికి గురిచేయవద్దు" అని సజ్జల పేర్కొన్నారు.

Comments