సాధ్యమైనంత వరకూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నం.

 ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన 341 డిమాండ్లు పరిష్కారం

సాధ్యమైనంత వరకూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నం


త్వరలో కరోనా కంపాసినేట్ ఉద్యోగాలు భర్తీకి చర్యలు

12వ పిఆర్సి కమిటీని ప్రభుత్వం ఇప్పటికే నియంచింది

కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తాం

ఉద్యోగుల ఆరోగ్య పధకంపై త్వరలో స్టీరింగ్ కమిటీ సమావేశం

ఎపి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సిఎస్ డా.జవహర్ రెడ్డి

అమరావతి,13జూలై (ప్రజా అమరావతి):రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుమారు 461 డిమాండ్లు, అంశాలు పరిష్కరించాల్సి ఉండగా ఇప్పటికే 341 డిమాండ్లను పరిష్కరించడం జరిగిందని మిగతావి పరిశీలనలో ఉన్నాయని వాటిని కూడా సాధ్యమైనంత తొందరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి చెప్పారు. గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్ల సత్వర పరిష్కారానికి సంబంధిత శాఖల స్థాయిలో ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి పరిష్కరించాలని గత నెలలో మూడు తేదీలు ఇవ్వగా ఆప్రకారం చాలా వరకూ అధికారులు పరిష్కరించడం జరిగిందని చెప్పారు.ఉద్యోగులకు సంబంధించి సుమారు 461 డిమాండ్లు,అంశాలు పెండింగ్లో ఉండగా వాటిలో 341ని ఇప్పటికే పరిష్కరించగా మిగతావి పరిశీలనలో ఉన్నాయని సాధ్యమైనంత వరకూ వాటిని కూడా పరిష్కరించడం జరుగుతుందని సిఎస్ జవహర్ రెడ్డి పునరుద్ఘాటించారు.గత ఆరేడు మాసాలుగా ఉద్యోగ సంఘాలతో తరచూ మంత్రివర్గ ఉప సంఘం,అధికారులు సమావేశమై ఆయా అంశాలను చర్చించడం జరుగుతోందన చెప్పారు.వీలైనంత వరకూ ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.

కరోనాతో చనిపోయిన ఉద్యోగుల స్థానే వారి కుటుంబాలకు చెందిన వారికి కారుణ్య విధానంలో 1042 ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని ఆప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి డా.జవహర్ రెడ్డి ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు.అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమ బద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని ఆప్రక్రియను త్వరిత గతిన పూర్తి చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి మాజీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో 12వ పిఆర్సి కమిటీని కూడా ఇప్పటికే వేయడం జరిగిందని సిఎస్ డా.జవహర్ రెడ్డి చెప్పారు.

అనంతరం సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు,ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు వారి వారి శాఖలల్లో ఉద్యోగలు డిమాండ్లు పరిష్కారానికి తీసుకున్నచర్యలను వివరించారు.

ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.ప్రవీణ్ కుమార్,అజయ్ జైన్, బి.రాజశేఖర్,యంటి.కృష్ణ బాబు గోపాలకృష్ణ ద్వివేది,ముఖ్య కార్యదర్శులు చిరంజీవి చౌదరి, జయలక్ష్మి,శశి భూషణ్ కుమార్,ప్రవీణ్ ప్రకాశ్,శ్యామల రావు,ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు, ప్రభుత్వ సలహాదారు ఉద్యోగుల సంక్షేమం చంద్రశేఖర్ రెడ్డి,పలువురు కార్యదర్శులు, శాఖాధిపతులు తదితరులు పాల్గొన్నారు.

అలాగే ఉద్యోగ సంఘాల నుండి రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి,ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు,ఎపి రెవెన్యూ సర్వీసెస్ సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు,ఎపి ఎస్టియు అధ్యక్షులు సాయి శ్రీనివాస్, పిఆర్టియు అధ్యక్షులు యం.కృష్ణయ్య,యుటిఎఫ్ అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షులు ఎస్.శ్రీనివాసరావు,ఎపిటిఎఫ్ అధ్యక్షులు జి.హృదయరాజు,ఎపిజిఇఏ జనరల్ సెక్రటరీ జె.ఆస్కార్ రావు,ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్ల అధ్యక్షులు సి.గోపాలకృష్ణ,ఎస్.మల్లేశ్వరరావు,ఎపి ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు సిహెచ్.శ్రావణ్ కుమార్,రొటేషన్ ప్రాతిపదికన గల హాజరైన ఎపి వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం  అధ్యక్షులు వేణుమాధవ రావు,ఎపి ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సంఘం అధ్యక్షులు రజనీస్ బాబు,ఎపి జూనియర్ వెటర్నరీ అధికారులు మరియు వెటర్నరీ లైవ్ స్టాకు అధికారులు సంఘం అధ్యక్షులు సేవా నాయక్ ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


Comments