నిర్దేశించిన లక్ష్యం మేరకు క్షేత్రస్థాయిలో పనుల్లో వేగం పెంచాలి.


నెల్లూరు, జూలై 17 (ప్రజా అమరావతి): 


జిల్లాలోని జగనన్న కాలనీల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో దశలవారీగా పురోగతితో పాటు నిధుల వినియోగం ఎక్కువగా జరిగేలా, నిర్దేశించిన లక్ష్యం మేరకు క్షేత్రస్థాయిలో పనుల్లో వేగం పెంచాలని


జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ పేర్కొన్నారు.


సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుండి ఎంపిడిఓలు, హౌసింగ్ డిఇలు,ఎఇలు, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ల తో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, అధికారులు ఇంటి నిర్మాణాలు పూర్తి చేయించేందుకు ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. లేఅవుట్లలో నీటి సమస్య పరిష్కారానికి బోర్లు, మోటర్లు ఏర్పాటుకు రూ 14 కోట్లు కేటాయించామని చెప్పారు. బోర్లు ఏర్పాటు చేసి, విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి పని జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. సిమెంటు, స్టీలు తీసుకుని పని మొదలు పెట్టని లబ్ధిదారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని, వారు ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టేలా చూడాలన్నారు. అలాగే పొదుపు సంఘాల ద్వారా రుణాల పొంది, సొంతమునకు వాడుకున్న వారిని పిలిపించి ఇంటి నిర్మాణాలు పూర్తిచేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి సారించి ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారుల ద్వారా పనులు జరిగేలా పర్యవేక్షించాలన్నారు. 


జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంలో నెల్లూరు కార్పొరేషన్ పనితీరు బాగుందని, మిగిలిన మండలాల్లో కూడా గృహ నిర్మాణాలలో దశలవారీగా పురోగతి వచ్చేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సొంత స్థలాల్లో ఇల్లు మంజూరైన లబ్ధిదారుల్లో ఇంకా నిర్మాణాలు మొదలుపెట్టని వారందరూ ఇంటి నిర్మాణాలు మొదలు పెట్టేలా చర్యలు చేపట్టాలన్నారు. లేఅవుట్లలో ఎక్స్పెండిచర్ బాగా పెంచాలని సూచించారు. 


ఈ సమావేశంలో  గృహ నిర్మాణ ఇంచార్జి పిడి నాగరాజు, డిఆర్డిఏ పిడి సాంబశివరెడ్డి, మెప్మా, డ్వామ పిడిలు రవీంద్ర, వెంకట్రావు, జడ్పీ సీఈవో చిరంజీవి తదితరులు పాల్గొన్నారు


Comments