దిల్లీలో ‘ఏపీ స్టాల్’ను సందర్శించిన కేంద్రవిద్యాశాఖామంత్రివర్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్.అమరావతి (ప్రజా అమరావతి);

దిల్లీలో ‘ఏపీ స్టాల్’ను సందర్శించిన కేంద్రవిద్యాశాఖామంత్రివర్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్.


 బైలింగువల్ పుస్తకాలను ఆసక్తిగా తిలకించి, మెచ్చుకున్న కేంద్ర మంత్రి.

దిల్లీలో ప్రగతి మైదాన్ లో జరిగిన ‘అఖిల భారతీయ శిక్షా సమాగం’లో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా ఏర్పాటు చేసిన స్టాలును ఆదివారం కేంద్ర విద్యాశాఖామంత్రివర్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్  సందర్శించారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి మాతృ భాషాధారిత బహుభాష (సవర, కొండ, కువి, ఆదివాసీ ఒడియా, కోయ, సుగాలి), బైలింగువల్ పాఠ్య పుస్తకాలను ఆసక్తిగా పరిశీలించి, ప్రశంసించారు.

జాతీయ విద్యా విధానం -2020 మూడో  వార్షికోత్సవంలో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన ‘అఖిల భారతీయ శిక్షా సమాగం’ శనివారం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ  ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి. శ్రీనివాసరావు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానం అమలు తీరు, డిజిటల్ విద్యా బోధన, విద్యార్థులకు ట్యాబులు పంపిణీ, బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ గురించి, తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానెల్ ద్వారా బోధన, విద్యాకానుక, మన బడి: నాడు నేడు,  వంటి విద్యా సంస్కరణల గురించి కేంద్ర విద్యాశాఖామంత్రివర్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ కి వివరించారు. విద్యాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న విశేష కృషిని అభినందించారు.    Comments