జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష కార్యక్రమాల కింద వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సానుకూలంగా పరిష్కరించాలి.



మచిలీపట్నం జూలై 18 (ప్రజా అమరావతి);


జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష కార్యక్రమాల కింద వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సానుకూలంగా పరిష్కరించాల


ని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు.


మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ విసీ హాల్ నుండి క్షేత్రాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష,ఆడుదాం ఆంధ్ర  తదితర కార్యక్రమాలపై సమీక్షించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 14 మండలాల్లో జగనన్నకు చెబుదాం కింద వచ్చిన అర్జీలను సరిగా పరిశీలించకనే  పరిష్కరించినట్లు చూపుతున్నారన్నారు. ఇది సరైన పద్ధతి కాదని స్పష్టం చేస్తూ ఇకపై వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సరైన పరిష్కారం చూపాలన్నారు.


పరిష్కరించినప్పటికీ మళ్లీ వచ్చిన అర్జీలను మండల ఆడిట్ బృందాలు జాగ్రత్తగా పరిశీలించి వచ్చిన సమస్యను ఏ విధంగా పరిష్కరించారో, సమాధానం సరిగా ఉందా లేదా చూడాలన్నారు. సంబంధిత  అర్జీదారులతో మాట్లాడి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తిస్థాయిలో పరిష్కరించాలన్నారు. వచ్చేవారం మరల సమీక్షించడం జరుగుతుందని ఆలోగా అన్ని అర్జీలు పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలన్నారు.

అర్జీదారుడు ఏమి కావాలని కోరుతున్నారో అంతమేరకే సమాధానం చెప్పాలని అనవసరమైన విషయాలు ప్రస్తావించరాదని స్పష్టం చేశారు.


కింది స్థాయి అధికారులతో పాటు  గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి ప్రజల సమస్యలకు సరైన పరిష్కారం ఏ విధంగా చూపాలో అనే అంశాల పైన సరైన శిక్షణ ఇవ్వాలన్నారు


సంబంధం లేని దరఖాస్తు ఏదైనా ప్రభుత్వ శాఖకు వచ్చినప్పుడు వారికి సంబంధించినది కాదని ముందుగానే చెప్పాలన్నారు.

ఎటువంటి ఆలస్యం చేయరాదన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి మూడు అంశాల పైన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అసంతృప్తి వ్యక్తం అవుతుందని తెలిపారన్నారు.

అందులో అర్జీ వచ్చిన వెంటనే దానిపై దృష్టి సారించకుండా ఆలస్యంగా పరిశీలించి తొందరపడి సరిగా చూసుకోకుండా పరిష్కరించామని అర్జీలను ముగిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తుందన్నారు. వచ్చిన అర్జీలను చాలా శ్రద్ధగా పరిశీలించి ప్రణాళిక ప్రకారం క్రమం తప్పకుండా గడువు మీరకుండా సకాలంలోనే పరిష్కరించుకుంటూ పోవాలన్నారు.


కొందరు  కోరింది ఒకటైతే ఇంకొక సమాధానం తో తప్పుగా  సమాధానాలు పంపించి అర్జీలను ముగిస్తున్నారన్నారు. ఆ విధంగా చేయడం చాలా  తప్పని స్పష్టం చేశారు.


 అర్జీలకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయని చెప్పి అర్ధాంతరంగా అర్జీలను ముగించడం సరైనది కాదని కోర్టు కేసులను పరిశీలించి సరైన విధానంలో పరిష్కారం చూపాలన్నారు.


మండల ఆడిట్ బృందాలు కూడా సరైన విధానంలో ఆడిట్ చేయకపోవడం  సమంజసం కాదన్నారు.


ఇలాంటి పరిస్థితి మరల పునరావృతం కారాదని హెచ్చరించారు.


జగనన్నకు చెబుదాం ఈ కేవైసీ చాలా తక్కువగా ఉందని వెంటనే నూటికి నూరు శాతం పూర్తి చేయాలన్నారు.


జగనన్న సురక్ష కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వ అత్యధిక ప్రాధాన్యత కార్యక్రమమన్నారు.


జగనన్న సురక్ష శిబిరాలు అనుకున్న విధంగా ఉదయం 9:30కే ప్రారంభం కావడం లేదని ఇకపై సకాలంలో శిబిరాలు ప్రారంభించాలని దీనిపై  సంపూర్ణ పర్యవేక్షణ ఉండాలన్నారు.


వివిధ అవసరాల కోసం ధ్రువీకరణ పత్రాలు కావాలని వచ్చే ప్రజల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు.


జిల్లాలో 75 శాతం పైగా విద్యార్థులు రక్తహీనతతో బాధపడుతున్నారని మండల విద్యాధికారులు పూర్తి బాధ్యత వహించి క్రమంతప్పకుండా తనిఖీలు చేసి వారు మందు బిల్లలు వేసుకునేలా చూడాలన్నారు.


యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించేందు కోసం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపడుతుందని ఇందులో క్రికెట్, వాలీబాల్, కోకో, బ్యాడ్మింటన్, కబడ్డీ వంటి 5 పోటీలను గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు నిర్వహించాల్సి ఉంటుందని ఇందుకోసం ప్రభుత్వమే క్రీడా సామాగ్రిని సమకూరుస్తుందని క్షేత్రస్థాయిలో అధికారులందరూ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.


ఈ వీడియో కాన్ఫరెన్స్ లో

డిఆర్ఓ ఎం.వెంకటేశ్వర్లు, కెఆర్ఆర్ సి ఎస్ డి సి శివ నారాయణ రెడ్డి, డి ఎల్ డి ఓ సుబ్బారావు, డిపిఓ నాగేశ్వర్  నాయక్, డిఆర్డిఏ పిడి పిఎస్ఆర్ ప్రసాదు, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, ఉద్యాన అధికారి జ్యోతి, డి ఎం హెచ్ ఓ డాక్టర్ గీతాబాయి పలువురు ఎంపీడీవోలు తహసిల్దార్లు మున్సిపల్ కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు


Comments