డోమెస్టిక్(గృహ) సిలిండర్లను వాణిజ్య ప్రయోజనం కొరకు వినియోగిచే విధంగా అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);


రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి వారి కార్యాలయము, రాజమహేంద్రవరం


డోమెస్టిక్(గృహ) సిలిండర్లను వాణిజ్య ప్రయోజనం కొరకు వినియోగిచే విధంగా అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంద


ని జిల్లా ఇంచార్జ్ రీజనల్ విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారి కె కుమార్ అన్నారు. 


సోమవారం ఇంచార్జ్ రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి  కె కుమార్ ఆద్వర్యంలో తూర్పు గోదావరి జిల్లాలోని పలు హోటల్స్ లో డోమెస్టిక్(గృహ) సిలిండర్లును వాణిజ్య ప్రయోజనం కొరకు ఉపయోగిస్తున్నారన్న సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు తనిఖీలు  నిర్వహించారు.  

ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని తోర్రెడు గ్రామములో గల SS Foods నందు డోమెస్టిక్(గృహ) సిలిండర్లును వాణిజ్య ప్రయోజనం కొరకు ఉపయోగించుచున్నారు అన్న సమాచారం మేరకు తనిఖీ చేయగా సదరు హోటల్ (D.no.8-184) నందు 15 డోమెస్టిక్(గృహ) సిలిండర్లు గుర్తించటమైనదన్నారు.  సదరు డోమెస్టిక్(గృహ) సిలిండర్లును వాణిజ్య ప్రయోజనం కొరకు ఉపయోగించుట కారణముగా MSO రాజమహేంద్రవరం రూరల్ వారు సదరు 15 డోమెస్టిక్(గృహ) సిలిండర్లును స్వాధినపర్చుకొని, సదరు హోటల్ ఓనర్ అయ్యిన శ్రీ పాతూరి సుబ్రహ్మణ్యం, తండ్రి వెంకటరాజు పై u/s 6A ఆఫ్ E.C. చట్టం 1955 & LPG (సరఫరా & పంపిణీ నియంత్రణ) ఆర్డర్ 2000 క్రింద  కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.  


తూర్పు గోదావరి జిల్లాలోని కడియం మండలంలోని పొట్టిల్లంక గ్రామములో గల గ్రంధి వి.వి.ఎస్ శ్రీనివాసు టిఫిన్స & కిరాణా నందు డోమెస్టిక్(గృహ) సిలిండర్లును వాణిజ్య ప్రయోజనం కొరకు ఉపయోగిస్తున్నారన్న సమాచారం మేరకు తనిఖీ చేయగా సదరు హోటల్ (D.no.1-113) నందు 05 డోమెస్టిక్(గృహ) సిలిండర్లు గుర్తించడం జరిగిందన్నారు.  సదరు డోమెస్టిక్(గృహ) సిలిండర్లును వాణిజ్య ప్రయోజనం కొరకు ఉపయోగించుట కారణముగా MSO కడియం వారు సదరు 05 డోమెస్టిక్(గృహ) సిలిండర్లును స్వాధినపర్చుకొని, సదరు హోటల్ ఓనర్ అయ్యిన శ్రీ గ్రంధి వి.వి.ఎస్ శ్రీనివాసు, తండ్రి సుబ్రహ్మణ్యం పై u/s 6A ఆఫ్ E.C. చట్టం 1955 & LPG (సరఫరా & పంపిణీ నియంత్రణ) ఆర్డర్ 2000 క్రింద  కేసు నమోదు చేసామన్నారు.  


గృహ అవసరాల (డోమెస్టిక్) సిలిండర్ల వినియోగములో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించియున్నారు.


ఈ తనిఖిలలో కార్యాలయ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరెడ్డి, రమేష్, జియాలిజిస్ట్ లక్ష్మినారాయణ, తహశీల్దార్ 

విజయ్ కుమార్,  హెడ్  కానిస్టేబుల్ జీవానందం, కానిస్టేబుల్ వీరబాబు, ఈశ్వర్, లోవకుమార్  మరియు రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు  పాల్గొన్నారు  


Comments