శ్రీ చైతన్య దిగ్గజం డాక్టర్ బిఎస్ రావు మృతి పట్ల వెనిగండ్ల దిగ్భ్రాంతి.

 *- శ్రీ చైతన్య దిగ్గజం డాక్టర్ బిఎస్ రావు మృతి పట్ల వెనిగండ్ల దిగ్భ్రాంతి*



గుడివాడ, జూలై 13 (ప్రజా అమరావతి): శ్రీ చైతన్య దిగ్గజం డాక్టర్ బిఎస్ రావు మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం కృష్ణాజిల్లా గుడివాడలోని వెనిగండ్ల కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 1986 లో శ్రీ చైతన్య విద్యాసంస్థలను ప్రారంభించిన డాక్టర్ బిఎస్ రావు కొద్దికాలంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారని వెనిగండ్ల తెలిపారు. విజయవాడలో బాలికల జూనియర్ కళాశాలతో డాక్టర్ బిఎస్ రావు తన ప్రస్థానాన్ని ప్రారంభించారన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్,  ఎంసెట్ కు కేరాఫ్ అడ్రస్ గా శ్రీ చైతన్య విద్యాసంస్థలను ఉన్నత స్థానానికి చేర్చారన్నారు. ప్రైవేట్ విద్యా రంగంలో ఢీ అంటే ఢీ అనే రీతిలో ర్యాంకుల వర్షం సృష్టించారన్నారు. డాక్టర్ బిఎస్ రావు మృతి విద్యా రంగానికి తీరని లోటని అభిప్రాయపడ్డారు. డాక్టర్ బిఎస్ రావు కుటుంబ సభ్యులకు వెనిగండ్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Comments