ఆగస్ట్ 25 వరకు ఇంటింటి ఓటరు గుర్తింపు సర్వే .



కొవ్వూరు, (ప్రజా అమరావతి);



ఆగస్ట్ 25 వరకు ఇంటింటి ఓటరు గుర్తింపు సర్వే 



** కొవ్వూరు నియోజకవర్గము లో 

సర్వేలో కానీ, ఓటర్ల జాబితాలో తేడాలు ఏవైనా ఉంటే  మాకు తెలి యజేస్తే వాటిని సరిచేయుటకు తగు చర్యలు తీసుకొంటాం.


** కొవ్వూరు ఆర్డీఓ, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎస్. మల్లిబాబు


కొవ్వూరు నియోజకవర్గము లో  ఇంటింటి ఓటరు గుర్తింపు 

సర్వేలో కానీ, ఓటర్ల జాబితాలో తేడాలు ఏవైనా ఉంటే  మాకు తెలి యజేస్తే వాటిని సరిచేయుటకు తగు చర్యలు తీసుకొంటామని కొవ్వూరు ఆర్డీఓ, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధి కారి, ఎస్. మల్లిబాబు అ న్నారు. 



 మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం లోని గుర్తింపు పొందిన  రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  


ఈ సందర్బంగా మల్లిబాబు మాట్లాడుతూ ఫారం-6, 7, 8 లు నమోదు ప్రగతిని మరియు సదరు దరఖాస్తుల పరిష్కారాల ప్రగతిని రాజకీయ పార్టీల నాయకులతో సమీక్షించడం జరిగిందన్నారు.  ఓటర్ల వివరాలు ఇంటింటి  సర్వే ఈ నెల 25 వ తేదీ వరకూ జరుగుతాయని తెలిపారు. ఈ సర్వే కు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. ఇప్పటివరకు జరుగుచున్న ఇంటింటి సర్వే లో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం కు సంబంధించి 73056 ఇండ్లకు సంబంధించి ఇప్పటి వరకు 71512 ఇండ్లను సర్వే చేసి 98% పూర్తయిందన్నారు.  1,77,620 ఓట్లకు గాను 144488 తనిఖీ చేసి ఆన్లైన్ నమోదు చేసామని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన ఇంటింటికి సర్వేలో బూత్ లెవెల్ అధికా రులు కోత్త ఓటర్ల నమోదుకు చెంది 1209 ఫారం-6 లు 1,209 ,  మరణిం చిన/ గ్రామంతర ఓట్ల తొలగిం పులకు చెంది  ఫారం -7 లు 1, 929 ;   ఓటర్ల జాబితా లోని పేర్లు తప్పు, చిరునామా తప్పులు / మార్పులు తదితర వాటి కోసం 3702 ఫారం-8 లకు చెందిన 3,702 దరఖాస్తులను నమోదు చేసారని తెలిపారు.



ఈ కార్యక్రమం లో చాగల్లు తహశీల్దార్, కే. రాజ్యలక్ష్మి, తాళ్ళపూడి డి.టి. షేక్ లాల్  అహ్మద్, కొవ్వూరు డి.టి. సునీత,  రాజకీయ పార్టీ ప్రతినిధులు, జె. విజయ మోహన్ కుమార్ కొవ్వూరు ఆర్డీఓ  పరిపాలన అధికారి జి. ఎస్. ఎస్. జవహర్ బాజీ, సిబ్బంది, ఎస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.


Comments