ఆహార పదార్థాల నాణ్యత నిర్ధారిత ప్రమాణాల మేరకు ఉండేలా ఫుడ్ సేఫ్టీ శాఖ నిరంతరం పర్యవేక్షించాలి: సిఈఓ, ఎఫ్ఎస్ఎస్ఎఐ కమలవర్ధన రావు.*ఆహార పదార్థాల నాణ్యత నిర్ధారిత ప్రమాణాల మేరకు ఉండేలా ఫుడ్ సేఫ్టీ శాఖ నిరంతరం పర్యవేక్షించాలి: సిఈఓ, ఎఫ్ఎస్ఎస్ఎఐ కమలవర్ధన రావు


*


తిరుపతి ఆగష్టు 24 (ప్రజా అమరావతి): నిబంధనల మేరకు నిర్ధారించబడిన ఆరోగ్యకరమైన ఆహార నాణ్యతా ప్రమాణాలను అమలు చేసి ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత మన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా  (FSSAI)  ఫుడ్ సేఫ్టీ శాఖలకు ఉందని సి.ఈ.ఓ (FSSAI) గంజి కమల వర్ధనరావు (IAS: 1990: కేరళ) అన్నారు.  


గురువారం ఉదయం స్థానిక తాజ్ హోటల్  తిరుపతి నందు కమీషనర్ ఫుడ్ సేఫ్టీ ఆంధ్రప్రదేశ్ వారి ఆతిథ్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (fssai) వారు నిర్వహిస్తున్న 41 వ సెంట్రల్ అడ్వైజరీ కమిటీ (CAC) సమావేశాన్ని కమీషనర్ ఫుడ్ సేఫ్టీ ఎ.పి. నివాస్  తదితరులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి సిఈఓ (fssai) గంజి కమలవర్ధన రావు ప్రారంభించారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల  ఫుడ్ సేఫ్టీ ప్రధాన కార్యదర్శులు, కమిషనర్లు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తదితర అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ శ్రీనివాస్ స్వాగతోపన్యాసం చేశారు.


ఈ సందర్భంగా సి.ఈ.ఓ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు మాట్లాడుతూ 41 వ సెంట్రల్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమీషనర్ ఫుడ్ సేఫ్టీ వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రపంచ పటంలో భారత దేశ ప్రతిష్టను అత్యున్నత స్థాయికి పెంచిన చంద్రయాన్ – 3  విజయాన్ని కొనియాడుతూ చందమామ దక్షిణ ధ్రువం పై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన   ఇస్రో ఛైర్మన్ మరియు వారి సిబ్బంది కి మరియు దేశంలోని వివిధ రంగాలను పురోగతివైపు నడిపిస్తున్న, భారతదేశ ఖ్యాతి ఇనుమడిoచే విధంగా కార్యక్రమాలు అమలు  చేస్తూ ప్రపంచ దేశాలకు దిక్సూచిగా నిలిచిన గౌ.భారత దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలిపారు. 


ఈ సమావేశ ముఖ్య ఉద్దేశ్యం ఆహార భద్రతను అమలు చేయడం అని, ఈ సెంట్రల్ అడ్వైజరీ కమిటీలో దాదాపు 60 మంది ప్రతినిధులు ఉంటారని, FSSAI CAC సమావేశాల నుండి సూచనలు మరియు అభిప్రాయాలను తీసుకుని, ఆహార భద్రతా చట్టం 2006, నియమాలు మరియు నిబంధనలలో నిరంతర ప్రాతిపదికన మార్పులను చేస్తూ ఆహార ప్రమాణాలు అమలు అయ్యేలా వాటిని నిర్థారించి పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు. 21 సైంటిఫిక్ ప్యానెల్స్  ఏర్పాటుతో సుమారు 200 మంది శాస్త్రవేత్తలు మనిషి తీసుకునే మందులు కాకుండా ఇతర ఆహార పదార్థాల ప్రమాణాలను   స్టాండర్దైజ్ చేసి నాణ్యతా ప్రమాణాలను నిర్థారించి వాటిని చట్ట పరిధిలో నియంత్రించి పర్యవేక్షించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం  ఫుడ్ సేఫ్టీ గవర్నమేంట్ ఆఫ్ ఇండియా ( FSSAI), రాష్ట్ర , కేంద్ర పాలిత ప్రాంతాల ఫుడ్ సేఫ్టీ శాఖల యొక్క బాధ్యత అని గుర్తు చేశారు.  దేశంలోని అందరు ఫుడ్ సేఫ్టీ కమీషనర్ల పరిధిలోని తినుబండారాలు/ ఆహార పదార్థాలు తయారుచేసే, విక్రయించే ఆపరేటర్లు, ఏజెన్సీలు దేశ వ్యాప్తంగా సుమారు 72 నుండి 75 లక్షల ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు కేంద్ర, రాష్ట్రాలలో లైసెన్సులు పొంది  రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. అలాగే 5 స్టార్ హోటల్ల నుండి  చిన్న స్థాయి  దుకాణాలలో ఆహార పదార్థాల తయారీ, నిల్వ మరియు సరఫరా అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నాణ్యతా ప్రమాణాలు అమలు అయ్యేలా ఫుడ్ సేఫ్టీ కమీషనర్లు చూడాలని అన్నారు.  ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం జూన్ 7 న న్యూడిల్లీలో సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ ల ప్రతినిధులతో, ఫుడ్ సేఫ్టీ ప్రతినిధులతో, అధికారులతో ఫలవంతమైన సమీక్షా సమావేశం నిర్వహించి ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలు  ఎస్ ఓ పి ఏర్పాటుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ నేపథ్యంలో వివిధ రకాల ఆహార పదార్థాలకు నాణ్యతా ప్రమాణాలు నిర్ధారించే దిశలో  జనవరిలో  బాస్మతి బియ్యం ప్రమాణాలను నిర్థారించడం జరిగిందని అన్నారు. ఈ సంవత్సరం 2023  ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మిల్లెట్ (చిరు దాన్యాలను ) పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరుగుతోందని, ప్రపంచంలోనే మన దేశం మిల్లెట్స్ ఉత్పతిలో అగ్ర స్థానంలో ఉందని, 14 రకాల చిరుధాన్యాల నాణ్యతా ప్రమాణాలను స్టాండర్డైజ్ చేసి, ఈ -బుక్లెట్ ను ప్రధాని విడుదల చేయడం జరిగిందని, మిల్లెట్ల ఉత్పత్తి మన దేశంలో 14.5 మిలియన్ టన్నులు ఉందని అన్నారు. సైంటిఫిక్ ప్యానెల్ కమిటీ ఆద్వర్యంలో ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాలను నిర్థారించడం కొరకు వారు పంపిన ప్రతిపాదనలను FSSAI గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు పలుమార్లు సమీక్షించి ప్రజాస్వామ్య బద్ధంగా నాణ్యతా ప్రమాణాలను  నిర్థారించడం జరుగుతుందని తెలిపారు. న్యూట్రాసిటికల్ ను కూడా నిరంతర పర్యవేక్షనతో ప్రమాణాలను నిర్థారణ చేసి ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే ప్రోబయోటిక్ , ప్రీ బయోటిక్ మరియు సప్లిమెంట్ పదార్థాలను నిర్థారించడం జరుగుతోందని తెలిపారు. ఇవే కావుండా కల్తీ, నాణ్యత లేని ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయం పై కూడా ఫిర్యాదులు అందుతున్నాయని వీటిపై చర్యలు తీసుకోవాల్సిన భాద్యత ఫుడ్ సేఫ్టీ అధికారులపై ఉందని నిబందనలకు లోబడి చర్యలు తీసుకోవాలని సూచించారు. గణాంకాల మేరకు గర్భవతులలో 45 నుండి 47 శాతం ఎనీమియా ఉందనీ, పిల్లలలో 40 నుండి 42 శాతం ఎనీమియా ఉన్నదని దీనిని అధిగమించేందుకు, ఈ మధ్య కాలంలో పేదలకు పంపిణీ చేసే పి.డి.ఎస్. రైస్ ను ఫోర్టిఫైడ్ రైస్ గా ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ తో కలిపి గర్భిణీ స్త్రీలకు, పాఠశాల విద్యార్థులకు అందించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని దీని ద్వారా గర్భిణీ స్త్రీలలో రక్తహీనత, విద్యార్థులలో రక్తహీనత, మాల్ న్యుట్రీషన్  ను నియంత్రించడానికి చర్యలు చేపడుతూ నాణ్యతా ప్రమాణాలు నిర్థారించడం జరిగిందని తెలిపారు. పంట పొలాలలో పురుగు మందుల వాడకం నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రపంచ దేశాలు  దీనిపై చర్యలు చేపడుతున్నాయని, అందులో భాగంగా సుమారు 40 దేశాలు, 100 మంది సైంటిస్ట్ లు డిల్లీలో  జరిగిన అంతర్జాతీయ  సమావేశంలో పాల్గొన్నారని ఈ అంశంపై కూలంకషంగా చర్చించడం జరిగిందని తెలిపారు. పశువులు తీసుకునే మేత కూడా పురుగు మందుల వాడకం ద్వారా ఉత్పత్తి అయితే, వాటిని తీసుకునే ఆవులు, గేదెలు,  పౌల్ట్రీ, ఫిష్ వాటి ఉత్పత్తులను ఆహారంగా స్వీకరించే మానవ జాతికి ఇది ఎంతో హానికారకమని, పురుగు మందుల  నియంత్రణలలో భాగంగా సేంద్రియ వ్యవసాయ పద్దతుల ద్వారా ఆర్గానిక్ ఉత్పత్తుల వాడకం ప్రోత్సహిస్తూ వాటికి ప్రమాణాలను నిర్థారించడం జరుగుతోందని అన్నారు. దేశంలో  శుచిగా, నాణ్యత గా ఉండే ఆహార పదార్థాల కొరకు సుమారు 100 కు పైగా  ఫుడ్ స్ట్రీట్స్ ఏర్పాటు కు  ఎస్.ఓ.పి  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వారి ఆమోదంతో వాటి అమలు చేస్తున్నామని, వాటిని వరల్డ్ క్లాస్ ఫుడ్  స్ట్రీట్ లుగా చేయుటకు చర్యలు చేపట్టడం జరుగుతోందని  అన్నారు. అలాగే చిరు దాన్యాలకు, స్పోర్ట్స్, డిఫెన్స్ తదితర వివిధ విభాగాలకు చెందిన వారు తినే రిసిపీస్ ను (వంటకాలు) స్టాండర్డైజ్ చేసి ఎస్ ఓ పి నిర్థారించడం జరిగిందని ఉదాహరణకు స్పోర్ట్స్, విద్యార్థులు, రైల్వే క్యాటరింగ్,  తదితర కేటగిరీల వారు తీసుకోవాల్సిన ఆహారాన్ని స్టాండర్డైజ్ చేసి ఎస్ ఓ పి తయారు చేయడం జరిగిందని  దీనివలన వారికి కావలసిన క్యాలరీలు అంది ఆరోగ్యంగా ఉండేలా చర్యలు చేపట్టడం జరిగిందనీ అన్నారు. దేశంలో ఇప్పటికే fssai 246 ల్యాబ్లు అందుబాటులో ఉండగా, మరో 100 దాకా మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లు ఏర్పాటుతో పలు రకాల ఆహార పదార్థాల పరీక్షలు అక్కడికక్కడే నిర్వహించేందుకు వీలు కల్పించామని అన్నారు. 


నిన్నటి బుధవారం నాడు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణ అధికారితో సమావేశం నిర్వహించామని భక్తులకు అందజేసే ప్రసాదం మరియు  అన్నప్రసాదం వాటిలో వాడే బియ్యం, నెయ్యి, నూనె, ఇతర పదార్థాలు సేంద్రియ ఉత్పత్తులను వాడుతున్నామని ఈ.ఓ. తెలుపగా సంతోషించ దగిన అంశమని తిరుమల, తిరుపతిలో ఒక శాశ్వత ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు, సిబ్బందికి శిక్షణకు ఉంటే బాగుంటుందని కోరారని అందుకు  చర్యలు చేపడతామని అన్నారు. 


అనంతరం అజెండా మేరకు సాయంత్రం  వరకు వివిధ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఫుడ్ సేఫ్టీ అధికారుల సమీక్షలో  నాణ్యతా ప్రమాణాల మెరుగుదల పై సలహాలు, సూచనలు వారు ఎదుర్కుంటున్న సమస్యలపై చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.


ఈ కార్యక్రమంలో (IRS) FSSAI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇనోషి శర్మ,  క్వాలిటీ అండ్ అస్యూరెన్స్ విభాగం సలహాదారు సత్యన్ కుమార్ పాండా, వివిధ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల  ఫుడ్ సేఫ్టీ కమీషనర్లు  తదితరులు హాజరయ్యారు.   Comments