సాలూరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.*సాలూరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం*పార్వతీపురం, ఆగస్టు 5 (ప్రజా అమరావతి ): ప్రపంచ ఆదివాసీ దినోత్సవంను సాలూరులో నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణు చరణ్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహణపై ఐటిడిఎ కార్యాలయంలో సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి కార్యక్రమంను నిర్వహించుటకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఘనంగా నిర్వహించారు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గల గిరిజన కళాకారులు, వివిధ గిరిజన ఉత్పత్తులు ప్రదర్శన ఉంటుందని ఆయన తెలిపారు. గిరిజన ఉత్సవాలకు వచ్చే ప్రజలకు తాగునీరు సౌకర్యంతో పాటు ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. పారిశుధ్యం నిర్వహణ పక్కాగా ఉండాలని, వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో వేడుకలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి తదితర ఉన్నత అధికారులు పాల్గొంటారని ఆయన అన్నారు. 


ఈ సమావేశంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు,  జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి టి.వి.ఎస్.సుధాకర్, జిల్లా రవాణా అధికారి సి. మల్లిఖార్జున రెడ్డి,  గిరిజన సంక్షేమ శాఖ అధికారి కె. శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

Comments