కోటి మందికి పైగా చిన్నారులకు నులిపురుగు మాత్రలు పంపిణీ.



*కోటి మందికి పైగా చిన్నారులకు నులిపురుగు మాత్రలు పంపిణీ


*

అమరావతి (ప్రజా అమరావతి): గురువారం  జరిగిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా రాష్ట్రం లోని అన్ని జిల్లాలలో  1 కోటి 10 లక్షల పిల్లలకు అల్బెండజోల్ 400 ఎం.జి మాత్రలను పంపిణీ లక్ష్యం కాగా దాదాపు 1 కోటి 6 లక్షల మంది చిన్నారులకు  (97% ) డీవార్మింగ్ మాత్రలు పంపిణీ చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ  ఒక ప్రకటనలో తెలిపింది.   మిగతా 4 లక్షల మంది పిల్లలకు ఆగస్ట్ 17 న జరిగే మాప్ అప్ రోజున ఈ మాత్రల్ని అందజేస్తామని వివరించింది.   గుంటూరు నగరంలోని సంగడిగుంట  సాదు చలమయ్య పాఠశాలలో గురువారం నాడు   అల్బెండజోల్ 400ఎంజి మాత్రల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని  ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ జె. నివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలో 1,10,00,000 పిల్లలకు మాత్రల్ని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో ని ప్రభుత్వ , ప్రైవేటు విద్యాసంస్థల పిల్లలకు పంపిణీ చేసేందుకు ప్రణాళికను  సిద్ధం చేశామన్నారు. ఒకేరోజు మాత్రను వేయడం వల్ల నులిపురుగుల జీవిత చక్రం బ్రేక్ అవుతుందని ఆయన వివరించారు.   రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లాలో 99.30 శాతం, చిత్తూరు జిల్లాలో 99.03 శాతం, అనంతపురం జిల్లాలో 98.89, ఏలూరు జిల్లాలో 98.78 శాతం, ఎన్ టిఆర్ జిల్లాలో 97.50 శాతం, ప్రకాశం జిల్లాలో 97 శాతం మేర నమోదు కాగా, మిగిలిన అన్ని జిల్లాలలో 100 శాతం మేర పంపిణీ చేశారు. 


Comments