చెప్పాడంటే చేస్తాడంతే అని నిరూపించిన ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి.



*నవరత్నాలతో పేదల తలరాతలు మార్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి : డిప్యూటి సి.ఎం*


*చెప్పాడంటే చేస్తాడంతే అని నిరూపించిన ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి*



*పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు : నేదురుమల్లి రాంకుమార్* 


తిరుపతి , ఆగష్టు 19 (ప్రజా అమరావతి): నవరత్నాలతో పేదల తలరాతలు మార్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మన ముఖ్యమంత్రి నడిపిస్తున్నారని అధికారులు కుల, వర్గ, మత, పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేసి సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందేలా పని చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి కళత్తూరు నారాయణ స్వామి అధికారులను ఉద్దేశించి అన్నారు. 

 

శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో వెంకటగిరి నియోజక వర్గ సమీక్ష జిల్లా ఇంచార్జి మంత్రి మరియు ఉపముఖ్యమంత్రి అధ్యక్షతన జిల్లా ప్రణాళిక శాఖ నిర్వహించగా వెంకటగిరి నియోజక వర్గ సమన్వయ కర్త మరియు రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, జెసి డి.కె.బాలాజీ, జిల్లా రెవెన్యూ అధికారి కోదండ రామిరెడ్డి, జిల్లా, సంబంధిత డివిజన్ , మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. 

ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గ సమీక్షలో రాంకుమార్  సూచించిన అవరమైన పనులకు ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు. పేదల తలరాతలు మార్చుతున్న ఈ ప్రభుత్వానికి అండగా వుండి ప్రజలకు సేవలందిస్తూ, అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. గ్రామాల్లో స్మశాన వాటికల కొరకు స్థలాలను ఇప్పటివరకు ఇచ్చినవి కాకుండా ఇంకా అవసరమున్న చోట స్థలాలను గుర్తించి కేటాయించాలని, రహదారి ఏర్పాటుకు సూచించారు. సిఎం గారి హామీలపై దృష్టి సారించి ప్రతిపాదనలు పంపి, పరిష్కరించి, పనులను సకాలంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.  నియోజక వర్గ సమావేశాల్లో చర్చకు వచ్చిన అంశాలు ప్రభుత్వానికి నివేదించి తక్షణ  చర్యలు తీసుకోవాలని జేసి కు సూచించారు. 


నేదురుమల్లి రాంకుమార్ మాట్లాడుతూ ముందుగా గౌ. ముఖ్యమంత్రి వెంకటగిరి పర్యటనను విజయవంతం చేసిన జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతూ ప్రజల్లో గడప గడపకు మన ప్రభుత్వం లో తిరుగుతున్నప్పుడు ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం పై ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని, కమ్యూనిటీ కి ఉపయోగపడే సమస్యలు తెలుసుకున్నానని, ప్రజా ప్రతినిధులు సూచించిన మరియు తెలియజేసిన అంశాలు పరిశీలించి సత్వర పరిష్కారం కోసం అధికారులు తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి కి సంబంధించి పలు సమస్యల పై చర్చిస్తూ ఆల్తూరు పాడు రిజర్వాయర్ పనులు వేగంగా జరుగుతున్నాయని నిధుల విడుదలపై, ప్రాధాన్యత భవనాలు నిర్మాణానికి నిధుల విడుదల అంశంపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంకటగిరి పోలేరమ్మ జాతరను ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర పండుగగా ప్రకటించారని ధన్యవాదాలు తెలుపుతూ పండుగ నిర్వహణకు, అభివృద్ధికి నిధుల విడుదల ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. మునిసిపల్ పరిధిలోని కూరగాయల, మాంస విక్రయ భవనం పూర్తి శిథిలావస్థలో ఉందని నూతన భవన నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలని, జగనన్న కాలనీ లేఅవుట్ కు రోడ్ కనెక్టివిటీ అంశాలకు సంబంధించి అంచనాల ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కు సూచించారు. ఏపి టిడ్కో కింద మంజూరైన గృహాలలో మౌలిక సదుపాయాల కల్పన, జీస్ఆర్ ఉన్న నీటి ట్యాంకు కు అదనంగా ఏర్పాటు, జగనన్న కాలనీ లో విద్యుత్, నీటి, డ్రైనేజీ, అంతర్గత రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ఆర్చి నిర్మాణం పూర్తి కి చర్యలు చేపట్టాలని గృహ నిర్మాణ అధికారులను, ఎస్ ఈ ఆర్ డబ్లూ ఎస్ అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యత భవనాల నిర్మాణం వేగవంతం చేయాలనీ, పేమెంట్ లో టెక్నికల్ సమస్యలుంటే త్వరితగతిన పరిష్కరించాలని తగు ప్రతిపాదనలను పంపాలని సూచించారు. అక్టోబర్ విజయదశమి నాటికి పెద్ద ఎత్తున టిడ్కో, జగనన్న కాలనీ గృహ ప్రవేశాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్ద రానున్న కాలంలో విస్తరణకు ప్రభుత్వ స్థల సేకరణ జరగాలని పరిశీలించాలని సూచించారు. ఆర్ అండ్ బి, పంచాయితీ రాజ్ రోడ్ల మరమ్మత్తులు కల్వర్టులు నిర్మాణాలు జరుగుతున్నాయని, పురోగతి వేగవంతం చేయాలని అన్నారు.


ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లా అధికారుల వారి స్థాయిలో పరిష్కరించాల్సిన అంశాలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, నియోజక వర్గ సమీక్షలో సూచించిన అంశాలు పై అధికారులు దృష్టి పెట్టాలని, ప్రభుత్వానికి నివేదించాల్సినవి వెంటనే పంపాలని సూచించారు.


ఈ సమీక్షలో జిల్లా, నియోజక వర్గ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. 


Comments