అభివృద్ధికి అస‌లైన నిర్వచ‌నం చెప్పాం.

 *అభివృద్ధికి అస‌లైన నిర్వచ‌నం చెప్పాం*


*రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు*

చిలకలూరిపేట (ప్రజా అమరావతి);

అభివృద్ధి అంటే ఏంటో చేసి చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో చేత‌ల ద్వారా చూపించిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కే ద‌క్కుతుంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి గారు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. చిల‌క‌లూరిపేట‌లో నూత‌నంగా నిర్మించిన వంద ప‌డ‌క‌ల ప్ర‌భుత్వాస్ప‌త్రి భ‌వ‌న స‌ముదాయాన్ని గురువారం అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని  మాట్లాడుతూ రూ.30కోట్లతో చిలకలూరిపేట సీహెచ్ సీని ఏరియా ఆస్ప‌త్రిగా మార్చామ‌ని చెప్పారు. 30 ప‌డ‌కల సామ‌ర్థ్యం నుంచి 100 ప‌డ‌క‌ల‌కు పెంచామ‌ని తెలిపారు. అన్ని సూప‌ర్‌స్పెషాలిటీ వైద్య సేవ‌లు ఇక‌పై ఇక్క‌డ అందిస్తామ‌న్నారు. శ‌ర‌వేగంగా బైపాస్ నిర్మాణం, నూత‌న గురుకుల‌పాఠ‌శాల‌లు, అమృత్ ప‌థ‌కం ద్వారా తాగునీటి స‌ర‌ఫ‌రా... ఇలా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన ఘ‌త‌న జ‌గ‌న‌న్న‌దేన్నారు. కార్య‌క్ర‌మంలో ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మ‌న్ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి వైద్య ఆరోగ్య‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ఎం.టికృష్ణ‌బాబు , వైద్య ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ మంజుల‌ , ఏపీవీవీపీ క‌మిష‌న‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు , ఆరోగ్య‌శ్రీ సీఈవో హ‌రీంద్ర‌ప్ర‌సాద్‌ ,జెడ్పి చైర్మన్ కత్తెర క్రిస్టినా , ప‌ల్నాడు జిల్లా ఎస్పీ ర‌విశంక‌ర్‌రెడ్డి  స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, ఇత‌ర అధికారులు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు...


Comments