స్పందన గ్రీవెన్స్ ను పెండింగ్ లేకుండా గడువులోపు పరిష్కరించాలి.

 స్పందన గ్రీవెన్స్ ను పెండింగ్ లేకుండా గడువులోపు పరిష్కరించాలి*


*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


పుట్టపర్తి , ఆగస్టు 21 (ప్రజా అమరావతి):


*స్పందన గ్రీవెన్స్ ను పెండింగ్ లేకుండా గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ 176   అర్జీలను  స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తోపాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్య,డి ఆర్ డి ఎ పి డి  నరసయ్య,  ల్యాండ్ అండ్ సర్వేర్   అసిస్టెంట్  డైరెక్టర్ రామకృష్ణయ్య, గ్రామ వార్డు సచివాలయ  నోడల్ ఆఫీసర్ శివారెడ్డి,  డిపిఓ  విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  వర్చువల్ విధానం ద్వారా మాట్లాడుతూ రీ ఓపెన్ పిటిషన్ లు 10 ఉన్నాయని, రీ ఓపెన్ పిటిషన్లు రాకుండా నాణ్యతగా పిటిషన్లను పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రీ ఓపెన్ పిటిషన్ లను సీరియస్ గా తీసుకుని పరిష్కరించాలన్నారు. రీఓపెన్ పిటిషన్లను జిల్లా అధికారులు నిత్యం ఓపెన్ చేసి చూసుకోవాలని, అర్జీదారుడితో మాట్లాడాలని, అర్థమయ్యేలా అతనికి వివరించాలని, సమాచారం తెలియజేయాలని, సంతృప్తి కలిగేలా పరిష్కారం చూపించి ఎప్పటికప్పుడు పిటిషన్లను క్లోజ్ చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో తహసీల్దార్, ఆర్డీఓలు పిటిషన్ లకు పరిష్కారం నాణ్యతగా అందించాలన్నారు. ప్రాపర్ గా స్పందన పిటిషన్ లను పరిష్కరించాలని ఆదేశించారు. రీ ఓపెన్ పిటిషన్లలో రెవిన్యూకి సంబంధించి ఎక్కువ పిటిషన్ లు ఉంటున్నాయని,  డి ఆర్ ఓ,ఆధ్వర్యంలో   త్వరలో టెలి కన్ఫరెన్స్ ద్వారా  ఆయా మండలాల ఎమ్మార్వోలతో  సమీక్షించుకోవాలని డిఆర్ఓ ను ఆదేశించారు. ఈనెల 25వ తేదీన పెనుగొండ నియోజకవర్గం సంబంధించిన అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు ఆధ్వర్యంలో  స్థానిక కలెక్టరేట్లోని  స్పందన హాలు సమావేశం మందిరంలో  నిర్వహించడం జరుగుతుందని ఆ రోజున ఆయా శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పుట్టపర్తి, మడకశిర, కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యేలు  ప్రస్తావించిన అంశాలపై  సమగ్ర నివేదికలను సిద్ధం చేసుకుని నాకు అందజేయాలని తెలిపారు. ఈనెల 21వ తేదీన ఇంటింటి ఓటర్ల సర్వే 100% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్  ఇచ్చిన సూచనలను   ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదవాలని దానిని ఒక బుక్కు రూపంలో  ముద్రించుకొని  మీ దగ్గర  ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.   ఆయా మండలాలలో  క్షేత్రస్థాయి లోనా పర్యటన ఉన్నప్పుడు   కచ్చితంగా  సంబంధిత ఎన్నికల అధికారులు మరియు సహా ఎన్నికల అధికారుల దగ్గర  కచ్చితంగా ఆ బుక్ ఉండాలని తెలిపారు.హిందూపురం నందు  రేపటినుండి  సదరన్ క్యాంప్  నిర్వహించడం జరుగుతుందని తెలిపారు  ఈ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈనెల 30వ తేదీన  ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  , రాష్ట్రంలో ఐదు లక్షల గృహాలకు  ప్రారంభం కార్యక్రమం  నిర్వహించడం  జరుగుతుందని  తెలిపారు, ఆరోజున  జిల్లాస్థాయి కార్యక్రమం  అమల లో భాగంగా గోరంట్ల మండలం  మల్లాపల్లి  జగన్ అన్న వైఎస్ఆర్ కాలనీ  ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఆ కాలానికిఅన్ని మౌలిక వసతులు ఈనెల 24వ తేదీ లోపు పూర్తి చేయాలని హౌసింగ్ పిడి నీ ఆదేశించారు, క్షేత్రస్థాయిలో  ఆయా శాఖలకు సంబంధించిన హౌసింగ్ నుంచి డి ఈ, ఆర్డబ్ల్యూఎస్ నుంచి  ఏ ఈ, పంచాయతీరాజ్ శాఖ నుంచి  డి ఈ, విద్యుత్ శాఖ నుంచి ఏ ఈ, ఏపీ డి, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, DWMA  సిబ్బంది కలిసికట్టుగా ఆ కాలనీకి అన్ని  మౌలిక వసతులు పూర్తిచేయాలని తెలిపారు. 


. ఈ సందర్భంగా స్పందన కార్యక్రమానికి వచ్చిన పలు అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి.


1. ముదిగుబ్బ మండలం జొన్నల కొత్తపల్లి గ్రామానికి చెందిన  విజయలక్ష్మి భర్త  కరోనా సమయంలో మృతి చెందాడని,  తనకు ఎలాంటి ఆస్తులు లేవని ప్రస్తుతం తన పిల్లలకు 5 మరియు 8వ తరగతి లో  ప్రవేశం తో విద్యాబోధనల కొరకు  ఎస్సీ హాస్టల్ లో అవకాశం కల్పించాలని వినతిపత్రాన్ని సమర్పించింది.

2. ధర్మవరం బాలాజీ నగర్ కు చెందిన భైరవి భర్త 2022 సంవత్సరంలో  చిత్తూరు జిల్లా భక్రాపేట కనుమ వద్ద బస్సు ప్రమాదంలో మరణించాడని  ఇంతవరకు అందవలసిన  వైయస్సార్ బీమా పథకం ద్వారా ఇంతవరకు అందలేదని పేర్కొంటూ అర్జీని సమర్పించింది.


3 .గోరంట్ల మండలం సామల పల్లి పాలసముద్రం గ్రామానికి చెందిన సుకన్య, తిప్పమ్మ, నాగలక్ష్మి లు  దినసరి కూలీలు గా ఉపాధి పొందుతున్నామని ప్రస్తుతం వీరికి ఎలాంటి  సొంత ఇల్లు లేవని అందువల్ల పేద కుటుంబానికి చెందిన తమకు ఇంటి పట్టాలను మంజూరు చేయవలసిందిగా వినతి పత్రాలను సమర్పించారు.


*ఈ కార్యక్రమంలో సిపిఓ విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డిఆర్డీఏ పిడి నరసయ్య, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, డిసిహెచ్ఎస్ డా.ఎం.టి.నాయక్, డిసిఓ కృష్ణ నాయక్, జిల్లా పరిశ్రమల అధికారి చాంద్ భాష, చేనేత జౌళి శాఖ ఏడి రమేష్, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, ఏపిఎంఐపి పిడి సుదర్శన్, బీసీ వెల్ఫేర్ డిడి నిర్మల జ్యోతి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, డిఎస్ఓ వంశీకృష్ణ, ఐసిడిఎస్ పిడి లక్ష్మి కుమారి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Comments