వరదల్లో సాహసోపేతంగా కూనవరం ఎస్సై రెస్క్యూ ఆపరేషన్‌ సీఎంకు చెప్పిన స్థానికులు


కూనవరం,  అల్లూరి సీతారామరాజు జిల్లా (ప్రజా అమరావతి);


వరదల్లో సాహసోపేతంగా కూనవరం ఎస్సై రెస్క్యూ ఆపరేషన్‌ 

సీఎంకు చెప్పిన స్థానికులు 


ఎస్సై బి.వెంకేటషన్‌ అభినందించిన సీఎం

పోలీస్‌ మెడల్‌ ఇవ్వాలని సిఫార్సు.


కూనవరం, అల్లూరి సీతారామరాజు జిల్లా

గత ఏడాది, ఈఏడాది వచ్చిన గోదావరి వరదల్లో సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్స్‌ నిర్వహించిన కూనవరి ఎస్సైను ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అభినందించారు. హెలిపాడ్‌ నుంచి కూనవరంలో వరద బాధితులతో ఏర్పాటు చేసిన సభకు హాజరవుతున్న సందర్భంలో ఒక విజ్ఞాపనకోసం సీఎం బస్సుదిగారు. అదే సమయంలో అక్కడున్న స్థానికుల  అధికారులు బాగా పనిచేశారని సీఎంకు చెప్పారు. అదే సమయంలో స్థానిక ఎస్సై వెంకటేషన్‌ రెస్క్యూ ఆపరేషన్‌ సాహసోపేతంగా నిర్వహించారని గత ఏడాది భీకరంగా వచ్చిన గోదావరి వరదల్లో కూనవరం సమీపంలోని దాదాపు 4-5వేలమంది గ్రామస్తులను తరలించడంలో కీలకపాత్ర పోషించారిన సీఎం ఎదుట మెచ్చుకున్నారు. అదే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న వెంటకేషన్‌ను సీఎం భుజం తట్టి, అభినందించారు. పోలీస్‌ మెడల్‌ ఇవ్వాలంటూ సిఫార్సు చేశారు.

Comments