జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు.

 జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి 

జిల్లా కలెక్టర్  పి అరుణ్ బాబు
పుట్టపర్తి, ఆగస్ట్10 (ప్రజా అమరావతి):  శ్రీ సత్య సాయి జిల్లాలో జరుగనున్న  ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని  జిల్లా కలెక్టర్  పి అరుణ్ బాబు పేర్కొన్నారు


గురువారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో  జిల్లా కలెక్టర్

జిల్లా అధికారులతో 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహణ పై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు.  ఈ కార్యక్రమంలో  అడిషనల్ ఎస్పీ విష్ణు, డిఆర్ఓ కొండయ్య, పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు


ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక ( శిరసాని హిల్స్) పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో వేడుకలు నిర్వహించాలని అందుకు సంబందించిన శాఖలు విజయవంతం అయ్యేలా చూడాలని సూచించారు. మహనీయుల త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని, స్వాతంత్రం వచ్చాక మన దేశం ఎంతో ప్రగతి సాధించింది అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని అన్నారు. ముఖ్యంగా విద్య వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మన జిల్లా సాధించిన ప్రగతి నలుదిశలా చాటేలా ఏర్పాట్లు ఉండాలని, రెగ్యులర్ గా కాకుండా ఏర్పాట్లు ఘనంగా చేయాలని, వివిధ శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ఈనెల 15న స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుటకు పోలీస్ మైదానం సిద్ధం చేయాలని, అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.

 జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు జాతీయ జెండా ఎగురవేస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. వేడుకల నిర్వహణకు వేదిక సిద్ధం చేయాలని, తగిన విధంగా అలంకరించాలని, సీటింగ్ ఏర్పాట్లు, విఐపి లకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని శానిటేషన్, తాగునీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి, రెవిన్యూ, మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. 

స్నాక్స్ ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని అవసరమైన బ్యాకప్ ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ సంక్షేమ శాఖలు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కలిగించేలా ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయాలని, శకటాలు ప్రదర్శించాలని అన్నారు.

 జగనన్న విద్యా కానుక, అమ్మ ఒడి,  డిజిటల్ తరగతులు, ఫ్యామిలీ ఫిజీషియన్, వైయస్సార్ కంటి వెలుగు, వైయస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ల ద్వారా వైద్య సేవలు అందించడం, తదితర అంశాలపై సమగ్ర శిక్ష, విద్యా, వైద్య శాఖలు శకటాలు ప్రదర్శించాలని అన్నారు. 

 విద్యా శాఖ, గిరిజన సంక్షేమ శాఖ సంయుక్తంగా పాఠశాలల పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు వంటివి చూడాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల నుండి ప్రగతి నివేదికలను క్లుప్తంగా  జిల్లా  ప్రణాళిక అధికారి, కలెక్టరేట్ కార్యాలయానికి రేపటికల్లా అందేలా చూడాలని తెలిపారు. 


 ఈ కార్యక్రమంలో డి ఆర్ డి పి డి నరసయ్య, Dwma  పిడి రామాంజనేయులు, హౌసింగ్  పిడి చంద్రమౌళీశ్వర్ రెడ్డి, వ్యవసాయ అధికారి సుబ్బారావు, గ్రామ వార్డు సచివాలయ నోడల్ ఆఫీసర్ శివారెడ్డి, డి ఎం  అండ్ హెచ్ ఓ ఎస్ వి కృష్ణారెడ్డి, జిల్లాలోని ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు

 

Comments