ఉద్యోగుల ఆరోగ్య పధకాన్నిమరింత పటిషంగా అమలు చేసేందుకు చర్యలు.

 ఉద్యోగుల ఆరోగ్య పధకాన్నిమరింత పటిషంగా అమలు చేసేందుకు చర్యలు


ఉద్యోగులు,పెన్సర్లు అందరికీ హెల్తుకార్డులు అందేలా చర్యలు

మెడికల్ రీఇంబర్సుమెంట్ పధకాన్ని స్ట్రీమ్ లైన్ చెస్తాం

ఉద్యోగుల ఆరోగ్య పధకంలో ప్రభుత్వవాటా సొమ్ము సకాలంలో ట్రస్టుకు జమ 

టాప్ టెన్ హెల్తు ప్రొసీజర్లలో ఫ్యాకేజి రేట్లు సవరణకు కృషి

గుండె చికిత్సలో టాప్ బ్రాండ్ స్టంట్ కే ప్రభుత్వం నిధులిస్తోంది

ఉద్యోగుల ఆరోగ్య పధకంపై జిల్లా కలక్టర్లు సమావేశం నిర్వహించాలి

                        ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి

అమరావతి,3 ఆగస్టు (ప్రజా అమరావతి):రాష్ట్రంలో ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య పధకాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేయడంతో పాటు మెడికల్ రీఇంబర్సుమెంట్ విధానాన్నిమరింత స్ట్రీమ్ లైన్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోడవం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పధకం(ఇహెచ్ఎస్)పై గురువారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన ఆగోగ్య తదితర శాఖల అధికారులు,పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు సంబంధించి వివిధ అంశాలను ఆయన విస్తృతంగా చర్చించారు.ముఖ్యంగా మెడికల్ రీ ఇంబర్సుమెంట్ విధానాన్నిమరింత పటిష్టవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని కావున దీనిపై వెంటనే తగిన కసరత్తు ప్రారంభించాలని ఆరోగ్యశ్రీ సిఇఓను ఆయన ఆదేశించారు.అదే విధంగా ఉద్యోగులు,ఫెన్సర్లు అందరికీ ఆరోగ్య కార్డులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.అంతేగాక ఉద్యోగుల ఆరోగ్య పధకానికి ప్రభుత్వ వాటా నిధులు సకాలంలో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు జమ అయ్యే విధంగా తగు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు.

గుండె,కిడ్నీ,కేన్సర్ వంటి 10 ప్రధాన ప్రొసీజర్లకు ప్రస్తుతం ఇస్తున్న ఫ్యాకేజి రేట్లను సవరించాల్సిన అవసరం ఉందని దానిపై కూడా తగిన ప్రతిపాదనలను సిద్దం చేసి పంపాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆరోగ్యశ్రీ సిఇఓను ఆదేశించారు.అదే విధంగా గుండె జబ్బుకు సంబంధించి రోగులకు వేసే స్టంట్ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన టాప్ బ్రాండ్ స్టంట్ కే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని ఆస్టంటే వేసేలా నెట్ వర్కు ఆసుపత్రులకు నిర్దేశం చేస్తామని సిఎస్ స్పష్టం చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పధకం అమలుకు సంబంధించి జిల్లా స్థాయిలో జిల్లా కలక్టర్లు వెంటనే సమావేశాలు నిర్వహించి వివిధ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశించారు.

వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులు,ఫెన్సర్లు,వారి డిపెండెంట్లు కలిపి సుమారు 22 లక్షల మంది ఉన్నారని వారందరికీ హెల్తు కార్డులు అందించేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు.ఉద్యోగులకు సంబంధించిన కార్డులను డ్రాయింగ్ అండ్ డిస్బర్సుమెంట్ అధికారులు(డిడిఓ)కు,ఫెన్సర్లు కార్డులను సబ్ ట్రెజరీ అధికారులు(ఎస్టిఓ)కు పంపేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.

ఆరోగ్యశ్రీ సిఇఓ హరీంద్ర ప్రసాద్ ఉద్యోగుల ఆరోగ్య పధకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ 2013 నుండి ఉద్యోగుల ఆరోగ్య పధకాన్ని అమలు చేయడం జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం ఈపధకంలో 2510 ఐపి ప్రొసీజర్సు కవర్ అవుతున్నాయని,అలాగే 10 కోవిడ్ ప్రొసీజర్లను కూడా దీనిలో చేర్చడం జరిగిందని చెప్పారు.అంతేగాక 25 క్రానిక్ ఓపి ప్రొసీజర్లను కూడా దీనిలో చేర్చడం జరిగిందని,57 డెంటల్ ప్రొసీజర్లు దీనిలో కవర్ అవుతున్నాయన్నారు. లక్షా 28వేల 593 మంది గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగులను కూడా ఈపధకం కిందకు తీసుకువచ్చామని వివరించారు.ఉద్యోగుల ఆరోగ్య పధకం అమలులో సమస్యలుంటే ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించేందుకు వీలుగా 104 కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు.

ఈసమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈపధకం అమలులో గల సమస్యలను,మెడికల్ రీఇంబర్సుమెంట్ లో గల సమస్యలను సిఎస్ దృష్టికి తెచ్చి వాటిని సకాలంలో పరిష్కరించాలని కోరారు.

ఈసమావేశంలో సర్వీస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్,ఆర్థికశాఖ కార్యదర్శి కె.వి.సత్య నారాయణ,హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్,ఇహెఎచ్ఎస్ ఇడి మూర్తి,డిఎంఇ డా.నర్సిహం తదితర అధికారులు పాల్గొన్నారు.అలాగే ఉద్యోగ సంఘాల తరపున ఏపీఎన్జీవో అధ్యక్షులు బండి శ్రీనివాసరావు,ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామి రెడ్డి,ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు,ఎపిటిఎఫ్ అధ్యక్షులు సాయి శ్రీనివాస్,ఎపిపిఆర్టియు అధ్యక్షులు యం.కృష్ణయ్య,శ్రీధర్ రెడ్డి,యుటిఎఫ్ అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు,ఆల్ ఆంధ్రప్రదేశ్ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం గోపాల కృష్ణ, మల్లేశ్వరరావు,ఎపి ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సంఘం అధ్యక్షులు ఎస్.శ్రీనివాసరావు,డీఎస్. కొండయ్య,ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ జి.ఆస్కార రావు,పిఆర్టియు అధ్యక్షులు గిరి ప్రసాద్,ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.


Comments