ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే డెలివరీలకు చర్యలు .. జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు.

 


మచిలీపట్నం: ఆగస్టు 24 (ప్రజా అమరావతి);


*ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే డెలివరీలకు చర్యలు .. జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు


*


జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే గర్భిణీ స్త్రీల డెలివరీలు జరిగేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు.


గురువారం అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పాల్గొన్నారు.


ఈ వీడియో కాన్ఫరెన్స్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, హెల్త్, శిశు మహిళా సంక్షేమం, జగనన్నకు చెబుదాం, జగనన్న ఇళ్ల నిర్మాణాలు, పాఠశాల విద్య, నాడు నేడు రెండవ దశ పనులు, గడపగడపకు మన ప్రభుత్వం పనులు తదితర అంశాల పురోగతిపై ఆయన జిల్లాల వారీగా సమీక్షించారు.


కృష్ణాజిల్లాలో 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీ హెచ్ సీ) ఉన్నప్పటికీ కేవలం జూలై నెల వరకు కేవలం 56 డెలివరీలు మాత్రమే జరిగాయని దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్కు సూచించారు. సమస్యాత్మకం కానీ డెలివరీలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనే జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, తీవ్రమైన కేసులను మాత్రమే ఏరియా ఆసుపత్రి లేదా జిల్లా ఆసుపత్రులకు రిఫర్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. అధిక ప్రమాదం గర్భిణీ స్త్రీల ప్రసూతి మరణాలు సంభవించకుండా తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ను సక్రమంగా వినియోగిస్తున్నట్లు ఆయన వివరించారు.


రక్తహీనతతో బాధపడుతున్న కిశోర బాలికలు, గర్భిణీ స్త్రీలకు క్రమం తప్పకుండా ఐరన్ మాత్రలతో పాటు పోషకాహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, అందుకు సంబంధిత అధికారులకు నిత్యం ఆదేశాలు ఇచ్చి పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.


మన బడి నాడు-నేడు రెండవ దశ పనులతో పాటు గడపగడపకు మన ప్రభుత్వం ప్రాధాన్యత పనులను పూర్తి చేయడం, పాఠశాల విద్యార్థుల డ్రాప్ అవుట్ల పరిశీలన, బాల్యవివాహాల నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి కలెక్టర్ తెలిపారు.


ఈ వీడియోకాన్ఫరెన్స్ లో వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టర్ తో పాటు పాల్గొన్నారు.


Comments