విజయనగరం. (ప్రజా అమరావతి ):
విజయనగరంలో కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం పనులను పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీమతి విడదల రజని, విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాష్ట్ర వైద్య మౌలిక వసతుల సంస్థ ఎం.డి. మురళీధర్ రెడ్డి, వైద్య విద్య డైరక్టర్ నరసింహారావు
అనంతరం వైద్య కళాశాల వద్ద మీడియాతో మాట్లాడిన మంత్రులు, డిప్యూటీ స్పీకర్
ఈ ఏడాది సెప్టెంబరు నుంచి రాష్ట్రంలోని ఐదు కొత్త వైద్య కళాశాలల్లో విద్యా సంవత్సరాన్ని, మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం : వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీమతి విడదల రజని
విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల మెడికల్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు
విజయనగరం వైద్య కళాశాలలో నిర్మాణం పనులు శరవేగంగా, సంతృప్తికరంగా జరుగుతున్నాయి
రూ.500 కోట్లతో 70 ఎకరాల విస్తీర్ణంలో విజయనగరంలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నాం
నిర్మాణ పనులు పూర్తిచేసేందుకు లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని చేరుకునేలా చర్యలు చేపడుతున్నాం
ఈ ఐదు కళాశాలల ప్రారంభం ద్వారా రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి
ఎం.బి.బి.ఎస్. చదవాలనుకున్న పేద విద్యార్ధులకు వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది
రాష్ట్రంలో రూ.8500 కోట్లతో 17 వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు
ఒకే సారి 17 వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా వైద్యరంగంలో ముఖ్యమంత్రి విప్లవాన్ని తీసుకువస్తున్నారు
దీనిలో ఉత్తరాంధ్రలోనే నాలుగు వైద్య కళాశాలలు వస్తున్నాయి, విజయనగరంతోపాటు పాడేరు, నర్సీపట్నం, పార్వతీపురంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుంది
రాష్ట్రంలో నాడు-నేడు ద్వారా వైద్య రంగంలో రూ.16 వేల కోట్లతో ఆసుపత్రుల ఆధునీకరణ చేపట్టాం
ఆసుపత్రుల్లో వసతుల కల్పనతో పాటు అవసరమైన వైద్యులు, సిబ్బందిని కూడా సమకూరుస్తున్నాం
రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో, ఆసుపత్రుల్లో 50 వేల మంది వైద్యులు, సిబ్బందిని నియమించాం : వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీమతి విడదల రజని
ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ అతి త్వరలో విజయనగరం వైద్య కళాశాలను ప్రారంభించబోతున్నారు: మంత్రి విడదల రజని
కొత్త వైద్య కళాశాలలు స్వంతంగా ఆర్ధికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశ్యంతోనే సెల్ఫ్ ఫైనాన్సింగ్ గా కొన్ని సీట్లను ఏర్పాటు చేయడం జరిగింది : మంత్రి రజని
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా 90 శాతం కుటుంబాలు సేవలు పొందుతున్నారు
#ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లను 3,257కు పెంచడం జరిగింది
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలతో ప్రజలు ఎంతో సంతోషంగా వున్నారు : మంత్రి విడదల రజని
addComments
Post a Comment