మంత్రి రజిని అవినీతికి లెక్కేలేదు. : మంత్రి పుల్లారావు

 *మంత్రి రజిని అవినీతికి లెక్కేలేదు* : *మంత్రి పుల్లారావు


*










గుంటూరు జిల్లా:ఆగస్టు 17 (ప్రజా అమరావతి);

ధనార్జనే ధ్యేయంగా ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి రజని పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.


పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రజిని అవినీతి చిట్టాకు లెక్కే లేదని.. ఇంకా ఎంత దోచుకుంటారో తెలియదని అన్నారు. మంత్రి ఆరోగ్యశాఖను పూర్తిగా భ్రష్టుపట్టించారని విమర్శించారు. ఆస్పత్రుల్లో కనీసం మందులు కూడా అందుబాటు-లో ఉండట్లేదన్నారు. మంత్రి అవినీతిపై రాష్ట్రం మొత్తం కోడై కూస్తోందన్నారు.

   

వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీ నుంచి బదిలీల వరకు అవినీతే జరుగుతోందని, భూవివాదం ఉన్నచోట తలదూర్చి సెటిల్‌మెంట్లు- చేస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. కుటుంబీకులను ముందుపెట్టి అవినీతి వ్యవహారాలను చక్కబెడుతున్నారని, చిలకలూరిపేట మున్సిపాలిటీ-ని అవినీతికి అడ్డాగా మార్చారన్నారు. పనులు చేయకుండానే రూ.2.70 కోట్ల బిల్లులు చేసుకున్నారని, ప్రజాధనాన్ని మంత్రి రజని సొంతానికి వాడుకుంటున్నారని విమర్శించారు.


మున్సిపల్‌ కార్యాలయంలో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది మొత్తం మంత్రి కుటుంబీకులేనని, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో రూ.50 లక్షల అవినీతి జరిగిందని ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో ఆరోపించారు.

Comments