జగన్ పని అయిపోయింది...ఇంటికి పోవడం ఖాయం.



*సెప్టెంబర్ 1 నుంచి 45 రోజుల పాటు బాబు ష్యూరిటీ - భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమం*


*జగన్ పని అయిపోయింది...ఇంటికి పోవడం ఖాయం


*


*భరించలేం జగన్...బైబై జగన్ అని ప్రజలు అంటున్నారు*


*ఇసుక దోపిడీపై ఇసుక సత్యాగ్రహం పేరుతో పోరాటం*


*వెంకన్న పవిత్రతను దెబ్బతీసేలా టీటీడీ లో  ప్రభుత్వ నియామకాలు:- నారా చంద్రబాబు నాయుడు*


*రాష్ట్ర పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బాబు ష్యూరిటీ - భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంపై చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం*

అమరావతి (ప్రజా అమరావతి);

*జాతీయ అధ్యక్షుల వారి ప్రసంగం:-*                                                                                                                                         “ ఈ సమావేశం ద్వారా ‘భవిష్యత్తుకి గ్యారెంటీ : బాబు భరోసా’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.  రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి నమ్మకం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంతో ఈ ప్రభుత్వ దుర్మార్గాలు, అవినీతిపై ప్రజల్లోకి వెళ్లాం. 

• తరువాత మహానాడు నిర్వహించాము. దాన్ని అడ్డుకోవడానికి అనేక కుట్రలు చేశారు. కానీ రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు తరలివచ్చి, మహానాడుని జయప్రదం చేశారు. అనంతరం ఇదేంఖర్మ కార్యక్రమాన్ని ప్రారంభించాం. రెండు కార్యక్రమాల్లో డోర్ టు డోర్ ప్రచారం చేశాం. నియోజక వర్గ ఇన్ ఛార్జ్ లు రెండు కార్యక్రమాలను విజయవంతం చేశారు. 

• యువగళం పాదయాత్రలో ఏంజరుగుతుందో చూస్తున్నాం. వారే దాడి చేస్తారు.. తిరిగి మనపైనే తప్పుడుకేసులు పెట్టిస్తున్నారు. అలానే అంగళ్లు, పుంగనూరులో వాళ్ల అవినీతి, దోపిడీ బయటపెడతామన్న భయంతో నన్ను అడ్డుకున్నారు. వారే దాడిచేసి, తిరిగి నాతో ఉన్న నేతల పై అక్రమ  కేసులు పెట్టించారు.

• ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్ కు గ్యారంటీ’ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభిస్తున్నాం. బూత్ వారీగా రోజుకి 10 ఇళ్లచొప్పున తిరగాలి. అదే సమయంలో యూనిట్, క్టస్టర్ ఇన్ ఛార్జులు ప్రతి ఇంటికి వెళ్లి జరిగే దాన్ని పరిశీలిస్తారు. ప్రజావేదిక అనే కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు ప్రతి మండల, పట్టణ, నగర ప్రధాన కేంద్రాల్లో  పాదయాత్ర చేసి, డోర్ టు డోర్ ప్రచారం చేసి, ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి, ఈ కార్యక్రమం ద్వారా ఏంచేయబోతున్నామో తెలియచేస్తూ ప్రజలకు ఒక నమ్మకం కల్పించాలి. మూడోది  ఈ కార్యక్రమంలో భాగంగా నేను 35 నియోజకవర్గాల్లో పర్యటిస్తాను. 

•  ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్ కు గ్యారంటీ’ కార్యక్రమంలో 3 కోట్ల మంది రికార్డులు అప్ డేట్ చేయాలనుకుంటున్నాం. 3 కోట్ల ఓటర్లను కలవాలి.  కార్యక్రమంతో 75శాతం మందినే కలుస్తాం. కానీ ఎన్నికల సమయానికి నూటికి నూరుశాతం మందిని కలవగలిగితే ప్రజా చైతన్యం పెరుగుతుంది. వారిలో మా భవిష్యత్ కు భద్రత ఉంటుందనే నమ్మకం కలుగుతుంది. 

• ఈ మొత్తం కార్యక్రమంలో ఎవరికీ ఎలాంటి మినహాయింపు లేదు. ప్రత్యర్థి చేసే తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు చాలా వరకు కట్టడి చేశాం. ఈ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మనం ఇదివరకు నిర్వ హించిన కార్యక్రమాలతో ప్రజల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. 

• జగన్ పని అయిపోయిందనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడూ మనం పోటీచేయలేదు. కానీ మొట్టమొదటిసారి మూడు ప్రాంతాల్లో మూడు ఎమ్మెల్సీలు గెలిచాం. పులివెందుల వ్యక్తిని ఎమ్మెల్సీని చేశాం. మన ఎమ్మెల్యేలను లాక్కున్నారు . ప్రజలు మనల్ని గెలిపించిన 23స్థానాలు మనకు లేవు.. ఎలా గెలుస్తారని ఛాలెంజ్ చేశారు. నేను ఛాలెంజ్ చేశాను. ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనపార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని 23 ఓట్లతో గెలిపించాం.దేవుడి స్క్రిప్ట్ తిరగరాశాడు. ఆ  తిరగరాయడమే వైసీపీ పతనం...టీడీపీ  గెలుపు అని అప్పుడే చెప్పాను. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన గెలుపుపై వక్ర భాష్యాలు చెప్పారు. చదువుకున్నవాళ్లు మాకు ఓటేయరు..రూరల్ ప్రాంతాల్లో మాకు మంచి పట్టుందని బుకాయించారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వీళ్లను మరలా గట్టిదెబ్బ కొట్టాలని నిర్ణయించాను. తెనాలి బుర్రిపాలెంలోఎస్సీల ఓట్లు మొత్తం టీడీపీ అభ్యర్థికే పడ్డాయి.  కొండె పి నియోజకవర్గం పాకాలలో 30 ఏళ్ల నుంచి మనం గెలిచిందిలేదు. 7500 ఓట్లున్న పంచాయతీలో 250 ఓట్లతో గెలిచాం. గెలుపుకోసం ఈ దుర్మార్గు లు ఓటుకి రూ.5వేలు పంచారు. మీరిచ్చే 5 వేలు కాదు..రాష్ట్రమే  ముఖ్యమని ప్రజలు గట్టిగా చెప్పారు. పొద్దుటూరులోకూడా 5వేలు పంచారు. కానీ గెలవలేదు. వార్డుల్లో పంచాయతీల్లో బ్రహ్మండంగా గెలిచి చూపించాం. 

•  ఇండియా స్థాయిలోజరిగిన ఇండియాటుడే – సీ ఓటర్ సంస్థ సర్వే నిర్వహించింది.  ఆసర్వేలో చాలా స్పష్టంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి 15ఎంపీ స్థానాలు వస్తాయని తేలింది. వీళ్లు ఇంతకు ముందు చేయించిన సర్వేలు అన్నీ బోగస్ వని తేలింది.  45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి అమానుష ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడ లేదు.  ఇదొక పనికిమాలిన దద్దమ్మ ప్రభుత్వం.. రాజకీయ కక్షలతో విధ్వంసాలకు తెగబడే ప్రభుత్వం.

• సవాల్ చేసి చెబుతున్నా... రేపు జరిగే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం నూటికి వెయ్యి శాతం చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం. జగన్ పని అయిపోయిం ది...ఇతను కోలుకునే పరిస్థితి లేదు. శిశుపాలుడు వందతప్పులు చేస్తే, ఇతను వేల తప్పులు చేశాడు. భగవంతుడు కూడా ఇతన్ని క్షమించడు. ఎంత చెడ్డవాడు అయినా ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే బాధ్యతతో ప్రవర్తి స్తాడు. కానీ ఇతని ప్రవర్తన భయంకరంగా తయారైంది. ప్రజలు జగన్ ను భరించే స్థితిలో లేరు.

• ప్రజా చైతన్యం తీసుకురావడంతో పాటు, ప్రజలకు ఒక నమ్మకం కల్పిస్తే మనం అనుకున్నది సాధించగలం. మనం చేయాలనుకుంటున్న వాటిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. సూపర్ సిక్స్ తో ఏంచేయబోతున్నామో ఇప్పటికే తెలియచేశాం. సంక్షేమ పథకాలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ. భవిష్యత్ లో జగన్ కంటే మూడురెట్లు అధికంగా సంక్షేమాన్ని అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలి. సంపద సృష్టితో ఆదాయం పెరిగితే, సంక్షేమం..అభివృద్ధి సమాంతరంగా కొనసాగుతాయి. దానికే  ఈ సైకో ముఖ్యమంత్రి విఘాతం కలిగించాడు. 

• సైకో జగన్ అనడానికి  ఒక కారణం ఉంది. మానసిక స్థితి బాగోలేని వ్యక్తులు సైకోగా మారి రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తారో చెప్పడానికి ఇతనే పెద్ద ఉదాహరణ. 

• మనం గతంలో చేసిన సంక్షేమం గురించి ప్రజలకు చెప్పాలి. టీడీపీ హాయాంలో రూ.200 పింఛన్ ను రూ.2వేలకు పెంచాము. ఇతను రూ.3వేలు ఇస్తానని మాటతప్పాడు. అదే తెలుగుదేశం అధికారంలో ఉండి ఉంటే ప్రతి పింఛన్ దారుడికి రూ.3 వేలు అందేవి. జగన్ రెడ్డిని నమ్మి ప్రతి పింఛన్ దారుడు ఈ నాలుగేళ్లలో, రూ.30వేల వరకు నష్టపోయాడు. 50 లక్షల మంది రూ.30వేల చొప్పన నష్టపోయారు. ఈ విషయం వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మీదే. 

• పింఛన్లతో పాటు, అన్నాక్యాంటీన్లు, విదేశీవిద్య, పెళ్లికానుక, చంద్రన్న బీమా, రైతు రుణమాఫీ, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సీ.ఎమ్.ఆర్.ఎఫ్ చెక్కులు, ఉచిత ఇసుక, నిరుద్యోగ భృతి, కాపు కార్పొరేషన్ లాంటి ఎన్నో పథకాల్ని ఇతను రద్దుచేశాడు. పుట్టినప్పటి నీం మరణించే వరకు అన్నిదశల్లో అందరికీ సంక్షేమపథకాలు అమలుచేసిన ఘనత టీడీపీది. చనిపోయిన వారికి గౌరవమైన వీడ్కోలు పలకడానికి మహాప్రస్థానం అమలుచేశాం. ఈ పథకాలు అన్నీ ఏమయ్యాయి? 

• అమ్మఒడి పథకంపై ఏంచెప్పారు ... ఏం చేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అందరికీ ఏటా రూ.15వేలచొప్పున తల్లుల ఖాతాల్లో వేస్తామన్నారు. తరువాత ఇంటికి ఒక్కరికేనని మాటమార్చారు.  అదికూడా ఒక సంవత్సరం ఎగ్గొట్టారు. చివరకు రూ.15వేలను రూ.13వేలు, రూ.12వేలకు చేర్చారు. అందుకే తల్లికి వందనం కార్యక్రమం కింద ఒక ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే, ఒక్కొక్కకరికీ రూ.15వేల చొప్పున ఇస్తామని చెప్పాం. ఈ ఒక్క కార్యక్రమం చాలు వీళ్ల మోసాలను తెలియచేయడానికి. 

• రైతు రుణమాఫీ కింద తాము కేంద్రప్రభుత్వం ఇచ్చే సొమ్ముతో పని లేకుండా ప్రతి రైతుకి రూ.12,500లు ఇస్తామని చెప్పాం. ఇతను కేంద్రం ఇచ్చే సొమ్ము కాకుండా రూ.7,500లు మాత్రమే ఇచ్చాడు. ఇలా అనేక పథకాల అమల్లో పూర్తిగా విఫలమయ్యారు. 

• అలానే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పెట్రోల్.. డీజిల్..గ్యాస్ ధరలు పెంచారు. నిత్యావసరాల ధరలు పెంచారు. 8సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. టీడీపీ హాయాంలో ఒక్కరూపాయి కరెంట్ ఛార్జీ పెంచలేదు. రాష్ట్రంలో అసలు కరెంట్ లేకుండా చేసి ప్రజలపై రూ.50వేలకోట్ల భారం వేశారు. ఇదీ వీళ్లు సాధించింది. అప్పులకోసం రైతుల మెడలకు ఉరితాళ్లు వేయడానికి సిద్ధమయ్యారు. రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడు తున్నారు. టీడీపీప్రభుత్వం వచ్చి ఉంటే ప్రజలకు కరెంట్ కష్టాలు ఉండేవి కావు. ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పండి. 

• ఇసుకాసురుడు ఈ ముఖ్యమంత్రి. రూ.40వేలకోట్లు దోచుకున్నాడు. జేపీ వెంచర్స్, టర్న్ కీ సంస్థల్ని అడ్డంపెట్టుకొని ఎన్జీటీ నిబంధనలు ఉల్లంఘించి ఇసుక పాలసీలో ఇష్టానుసారం వ్యవహరించారు. ఇసుకంతా తవ్వేయడంతో భూగర్భజలాలు ఇంకిపోయి రైతులు ఇబ్బంది పడుతు న్నారు. ఇసుకపై ప్రేమచూపుతూ, సాగునీటి ప్రాజెక్టులపై శీతకన్ను వేశా రు. కొత్త ఇసుకపాలసీ తీసుకొచ్చి ఇష్టానుసారం దోచేస్తున్నాడు. ఇసుక దోపిడీపై నిలదీస్తే సిగ్గులేని ప్రభుత్వం సమాధానం చెప్పలేదు.  రాబోయే రోజుల్లో ఇసుక సత్యాగ్రహ చేపట్టాలి. ఇసుక సహజవనరు. మన ఊళ్లల్లో అందరికీ అందుబాటులో ఉండే ఇసుకకు వీళ్లకెందుకు కప్పంకట్టాలని నిలదీయండి. ప్రజలతో కలిసి ఇసుక సత్యాగ్రహాన్ని పెద్దఎత్తున చేపట్టండి. నాలుగేళ్లలో జగన్, పెద్డిరెడ్డి, జేగ్యాంగ్ చేసిన రూ.40వేల కోట్ల ఇసుకదోపిడీ పై ప్రజల్ని చైతన్య పరచండి. పేదలరక్తం పీల్చి దోచుకుంటున్నారని తెలియ చేయండి. 

• మనప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.68వేలకోట్లు ఖర్చు పెట్టాం. 64 ప్రాజెక్టుల్లో 24 పూర్తిచేసి జాతికి అందించాం.  ఈ ముఖ్యమంత్రికి భయం అంటే తెలియదు. 16నెలలు జైల్లో ఉండి వచ్చాడు కదా! కానీ రాష్ట్రం నష్టపోతోంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఉండుంటే సాగునీటి సమస్య ఉండేది కాదు. పోలవరం పూర్తయ్యేది.. రాష్ట్రమంతా సస్యశ్యా మలం అయ్యేది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని సర్వ నాశనం చేసింది.

• మద్యం ధరలు ఇష్టానుసారం పెంచారు. అమ్మేది కల్తీమద్యం... అది ఎక్కువ ధరకు. మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ చెల్లింపులు లేవు. మద్యం అమ్మకాలతో సాగించే దోపిడీపై సమాధానం చెప్పాలని నిలదీశాను. దోపిడీ ప్రభుత్వం కాబట్టి స్పందించలేదు. ఇతనికి ఎదురుదాడి తప్ప, సమాధానం చెప్పడం తెలియదు. 

• ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రానికి మొదలైన అరిష్టం.. పోలవరాన్ని గోదా ట్లో ముంచేసింది. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే పోలవరం నిర్మాణం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందిస్తుంది.

• మూడురాజధానులని మూడు ముక్కలాట ఆడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. మన రాజధాని ఏది అంటే సమాధానం చెప్పలేని దుస్థితి. ఇవే కాదు.. టిడ్కోఇళ్లకు పార్టీ రంగులేసి పేదలకు అన్యాయం చేశా డు. 

• తన మూర్ఖత్వంతో శాసనమండలిని రద్దుకి ప్రయత్నించాడు. ఎన్నికల కమిషన్ ను వేధించాడు. హైకోర్టు న్యాయమూర్తుల్ని దోషుల్ని చేశాడు. పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి పల్లెలను అంధకారంలోకి నెట్టా డు. ఆర్థిక సంఘం ఇచ్చే డబ్బుల్ని దారిమళ్లించారు. చివరకు కేంద్ర ప్రభు త్వ పథకాలకు రాష్ట్రవాటా ఇవ్వలేని దుస్థితికి వచ్చారు. కేంద్రం ప్రజల కోసం డబ్బులిస్తే, వాటిని సక్రమంగా వినియోగించి, ఎస్సీల సంక్షేమానికి నిధులు ఇవ్వలేకపోయారు. డ్వాక్రాసంఘాలకు కూడా నిధులివ్వలేదు. 

• ఇన్ని దారుణాలు చేసి, ఇంకా రూ.10లక్షల కోట్ల అప్పులు చేశారు. ప్రజలపై పన్నులు ధరలభారం వేశారు. ప్రజల ఆదాయం తగ్గిపోయింది. అప్పులుతెచ్చినా ఒక్క రోడ్డు వేసింది లేదు. ఎక్కడా ఒక్క పరిశ్రమ రాలేదు. యువతకు ఉపాధిలేదు. కానీ జగన్ అండ్  కంపెనీ మాత్రం ఆర్థికంగా అభివృద్ధి చెందింది. మరోపక్క రాష్ట్రం దివాళా తీసి.. పేదవాడికి పూట గడవడమే కష్టంగా మారింది.

• ఇంకో పక్క భయంకరమైన ప్రచారానికి తెరలేపారు. ఎల్లప్పుడూ ఈయన కు రుణపడి ఉండాలంట! నాకు, నా కుటుంబానికి ఫలానా పథకం ద్వారా ఫలానా లభ్ది కలిగిందని చెబుతూ తాను, తన కుటుంబం ఈయనకు రుణపడి ఉండాలని సంతకం పెట్టాలంట. వీళ్ల అబ్బసొమ్ము ఇచ్చారు.. వీళ్ల తాత జాగీరు పంచారు. రాష్ట్రాన్ని లూఠీ చేసిన వ్యక్తి తనకు రుణపడాలంటు న్నాడు. ప్రజలకు గోచీ మిగిల్చాడు....అదికూడా లేకుండా చేస్తానంటున్నా డు. దీనిపై ప్రజలు ఆలోచించాలి. ఎన్నికష్టాలు..నష్టాలు వచ్చాయో... మీ ఆదాయం ఎంత పెరిగిందో, మీ జీవన ప్రమాణాలు ఎంతవరకు మెరుగుపడ్డాయో ఆలోచించాలని కోరుతున్నా. ప్రతి వ్యక్తి ఆదాయం తగ్గిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మీరుంటే ఈ వ్యక్తి తనకు రుణపడి ఉండాలంటున్నా డు. ఏ వ్యక్తికి కంటిమీద నిద్ర లేకుండా చేశాడు. 

•  రుణపడి ఉంటామని, మీరిచ్చే పత్రాలపై ప్రజలు ఎందుకు సంతకం పెట్టాలో చెప్పండి. అందుకే ప్రజలకు విన్నవిస్తున్నా..ఎవరూ సంతకాలు పెట్టకండి. ప్రజల నుంచి  ఇంతకుముందే డిజిటల్ సంతకాలు తీసుకొని వాటిని దుర్వినియోగం చేశారు. ప్రజలందరూ  ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన సమయం వచ్చింది. 

• ప్రజల్ని హింసించడమే ఈ ముఖ్యమంత్రికి ఆనందం. లక్షలకోట్ల దోపిడీయే ఇతని లక్ష్యం. ఇసుక, ఖనిజాలే ఇతని ఆహారం. భూములు ఇతని ఫలహారం, మద్యమే ఇతనికి మంచినీరు. ఇలాంటి నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు పోతున్న వ్యక్తికి ప్రజలు రుణపడి ఉండాలా? జగన్ ను చూస్తే ప్రజాస్వామ్యమే సిగ్గుపడుతుంది. రుణపడి ఉండటం కాదు జగన్. ‘భరించలేని జగన్.. బైబై జగన్’  ఇదే మనందరి నినాదం కావాలి. 

• ఇండియా టుడే –  సీఓటర్ సర్వే చూశాక ఇతను ఎన్ని దొంగసర్వేలు చేయించినా ఆరునెలల్లో ఇంటికెళ్లడం ఖాయం. ఇతను వస్తే ఈ రాష్ట్రం ఏమ వుతుందో చెప్పి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఇప్పటికే చాలా దారుణా లు జరిగాయి. మెడపై కత్తి పెట్టి ప్రజల ఆస్తులు రాయించుకుంటున్నారు. 

• చివరకు వీళ్ల స్వలాభంకోసం వేంకటేశ్వరస్వామిని అప్రదిష్ట పాలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో  నేరాన్ని ఒప్పుకున్న వ్యక్తిని టీటీడీ సభ్యుడిగా నియమిస్తారా? నీ స్వార్థంకోసం మతాన్ని, ప్రజల విశ్వాసాన్ని కాలరాస్తావా? బాబాయ్ ని చంపి, వేరేవాళ్లపై నెట్టేసిన వ్యక్తి, తల్లినిచెల్లిని గెంటేసిన వ్యక్తి రాష్ట్రాన్ని కాపాడతాడా? 

• నాలుగున్నరేళ్లలో జరిగిన దోపిడీ, అన్యాయం, విధ్వంసంతో పాటు, మనం వస్తే ప్రజలకు ఏం చేస్తామో కూడా చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి తెలియ చేయండి. తల్లికి వందనం, మహాశక్తి పథకాలతో మహిళల్నిచైతన్య వంతుల్ని చేయండి. టీడీపీప్రభుత్వం వస్తే 20లక్షల ఉద్యోగాలు వస్తాయని, ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి అందుతుందని చెప్పండి. నష్టపోయిన రైతులకు అండగా నిలవండి. రైతుని రాజుని చేసే బాధ్యత తెలుగుదేశానిదనే భరోసా ఇవ్వండి. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంతో పాటు ప్రత్యేక సబ్ ప్లాన్ అమలుచేస్తామని తెలియచేయండి. 

• పీ-4 పాలసీ అమలుతో పేదల్ని సంపన్నుల్ని చేయాలన్న మన ఆలోచన ల్ని ప్రజలతో పంచుకోండి. ప్రజజలు ప్రభుత్వం, ప్రైవేట్, పార్టనర్ షిప్ (పీ-4) విధానంతో పేదల్ని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చి, వారిని ధనికుల్ని చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని చెప్పండి. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మీరు భాగస్వాములు కావాలి. మా నేతలు, మా బృందాలు మీవద్దకు వచ్చినప్పుడు మీఆలోచనలు వారికి చెప్పాలని ప్రజల్ని కోరుతున్నా.

• ‘బాబు ష్యూరిటీ : భవిష్యత్తుకి గ్యారెంటీ’, భవిష్యత్తుకి గ్యారెంటీ : బాబు భరోసా  కార్యక్రమంలో భాగంగా మన నేతలు, కార్యకర్తలు ప్రతి వ్యక్తి మనసులోకి వెళ్లేలా పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ అనుకుంటే సాధ్యం కానిది లేదు. 42 ఏళ్లుగా మనల్ని నడిపించి, గెలిపిస్తున్న గొప్ప కార్యకర్త లు మనకు ఉన్నారు. కార్యకర్తలు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రం కోసం..ప్రజలకోసం మనం ఎంతో చేయాలి. ఇప్పటికే మీరు ఎన్నో కష్టాలు పడ్డారు. కార్యకర్తల కుటుంబాల్ని కాపాడుకుంటా. నా కార్యకర్తల జోలికి వచ్చిన వాళ్లను మమ్మల్ని పెట్టిన దానికంటే పదింతలు ఇబ్బంది పెడతాను. రౌడీయిజం..గూండాయిజాన్ని అణచివేసి, రాష్ట్రాన్ని కాపాడు కుంటా. రాజకీయ రౌడీల్ని తుదముట్టించే బాధ్యత తీసుకుంటా.” అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Comments