మేలో జేపీ సంస్థ గడువు పూర్తయినా ఇసుక రవాణా చేస్తారా?

 కొల్లూరు మండలం (ప్రజా అమరావతి);

(జువ్వలపాలెం,

చిలుమూరు గ్రామాలు)


టీడీపీ చేపట్టిన ఇసుక సత్యాగ్రహం లో పాల్గొన్న మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు .


ఏపీ వ్యాప్తంగా అక్రమ ఇసుక క్వారీల వద్ద టీడీపీ ఆందోళనలో భాగంగా  బాపట్ల జిల్లా కొల్లూరు మండలం

జువ్వలపాలెం,

చిలుమూరు గ్రామాలలో

అక్రమ ఇసుక  డంపింగ్ యార్డ్ లను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి సందర్శించి,నిరసన తెలిపిన  మాజీ మంత్రి మరియు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు .


 ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ


అక్రమ క్వారీలపై

కోర్టు ఆదేశాలిచ్చినా ఇసుక రవాణా చేస్తున్నారంటూ ఫైర్ - ఇసుక రవాణా అడ్డుకునేందుకు క్వారీల వద్ద టీడీపీ నేతల నిరసనలు - చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్


- మేలో జేపీ సంస్థ గడువు పూర్తయినా ఇసుక రవాణా చేస్తారా? -


ఇసుక తరలింపునకు అనుమతులు చూపాలి


ఇసుక తవ్వకాలు చేపట్టాలంటే రివర్ కన్జర్వేషన్ రెవెన్యూ పర్మిషన్ తీసుకుని తవ్వకాలు చేపట్టాలి కానీ ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేకుండా  దాదాపుగా 35 వేల లారీల ఇసుక డంపు చేసి ఉంచారు ఎవడబ్బ సొత్తు అని చెప్పేసి ఇక్కడ డంపు చేశారని చెప్పేసి నేను అడుగుతున్నా?


 ఏ పర్మిషన్తో ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు, ఎవరు చేస్తున్నారు ఈ డంపు? ఈ రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల క్రితం జేపీ వెంచర్స్  అనే సంస్థకు ఇసుక దోచుకోమని లీజికి ఇవ్వడం జరిగింది దాని కింద సబ్లిజి కింద టర్న్ కి అనే సంస్థకి ఇవ్వడం జరిగింది వాళ్లు వీళ్లు కలిసి దోపిడీ చేసి జగన్మోహన్ రెడ్డికి కప్పం కడుతున్నారు, కింద స్థాయిలో ఎవరు వాటా వాళ్ళు పంచుకుంటున్నారు.


 హెవీ మిషనరీ వాడటానికి వీలు లేదు ఇసుక తవ్వకాలు ఆపివేయమని మద్రాస్ లోని గ్రీన్ ట్రిభ్యునల్ తీర్పు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాలు ఆపివేయమని చెప్పేసి తీర్పిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సుప్రీంకోర్టు కి వెళ్లడం జరిగింది, సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రిలీఫ్ రాలేదు.


 అటువంటి పరిస్థితుల్లో ఏ అధికారం లేకుండా ఏ అర్హత లేకుండా అడ్డగోలుగా ఇసుకను దోచేస్తున్నారు.


 రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న అగ్రిమెంట్ కూడా మే నెల తోనే ముగిసిపోయింది, అదే జేపీ వెంచర్స్ కి జిఎస్టి పర్మిషన్ కూడా జూన్ నెల తో  ముగిసిపోయింది.


అయినా కూడా జెపి వెంచర్స్ పేరు మీద బిల్లులు ఇష్యూ చేసి ఇసుక తోలుతూ  ఉన్నారు.


ఇక్కడ ఉన్న ఎస్సై సీఐ డీఎస్పీ రెవెన్యూ అధికారులు మొత్తం వాటాలు పంచుకొని ఇసుక తోలిస్తూ ఉన్నారు.


లేదంటే వారిని వచ్చి ఇక్కడ చెప్పమనండి వీళ్ళకి పర్మిషన్ ఉండటం వల్ల మేము ఇసుక ఇక్కడ డంపు చేసే తోలుతున్నాము అని చెప్పేసి ఆ పర్మిషన్ చూపిస్తే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం.


ఈ అక్రమాల్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు కచ్చితంగా రాబోయే రోజుల్లో జైలుకి పంపి తీరుతాం మైనింగ్ డిడి గారిని నేను అడుగుతున్న ఇంత అక్రమాలు జరుగుతూ ఉన్నా మీరు చూస్తూ ఉన్నారు గతంలో ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారి గతి ఏమైందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.


మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపుమేరకు ఇసుకలో అక్రమంగా 40 వేల కోట్ల రూపాయలు దండుకుంటున్న ఈ ప్రభుత్వం మీద పోరాటంలో భాగంగా ఈరోజు ఇసుక రాంపులు సందర్శించడం జరిగింది. వాటాలు తీసుకున్న ఏ ఒక్క అధికారులుని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు.

Comments