ప్యాడి కొనుగోళ్ల నేపథ్యంలో కస్టమైజ్డ్ మిల్లింగ్ రైస్ మిల్లర్ల సామర్థ్యం నిర్ధారణ అత్యంత పారదర్శకంగా చేపట్టాలి.రాజమహేంద్రవరం  (ప్రజా అమరావతి);


రానున్న ఖరీఫ్ సీజన్లో ప్యాడి కొనుగోళ్ల నేపథ్యంలో కస్టమైజ్డ్ మిల్లింగ్ రైస్ మిల్లర్ల సామర్థ్యం నిర్ధారణ అత్యంత పారదర్శకంగా చేపట్టాల


ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు.


శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో సంబంధిత సమన్వయ అధికారులతో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సమావేశం జేసీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, రానున్న ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్ల యొక్క సామర్థ్యాన్ని క్షేత్ర స్థాయి లో వాస్తవ పరిస్థితిని నిర్ధారణ చేసుకుని,ఆ వివరాలు ఆన్లైన్ లో అప్లోడ్ చెయ్యలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలు ద్వారా సేకరించిన ధాన్యం నిర్దేశించిన సి ఎం ఆర్ మిల్లు ద్వారా బఫర్ గోడౌన్, అక్కడ నుంచి ఎం ఎల్ ఎస్ పాయింట్ , చౌక ధరల దుకాణం కు, మొబైల్ డెలివరీ యూనిట్ వాహనం ద్వారా లబ్ధిదారులకు చేరడం జరుగుతుందని అన్నారు. ఈ క్రమంలో ధాన్యం సేకరణ కి చెంది వాటి సామర్థ్యం, ఇతర మౌలిక సదుపాయాలు కలిగి ఉందో లేదో నిర్ధారణ కోసం పౌర సరఫరా, అనుబంధ విభాగాల ద్వారా కాకుండా  ఇతర శాఖా అధికారులను  తనిఖీలు నిర్వహించాల్సి ఉందన్నారు. కార్మిక, సహకార, పరిశ్రమలు, డివిజనల్ అభివృద్ధి అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫుడ్ ఇన్స్పెక్టర్ లతో కూడిన అధికారులు ద్వారా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆమేరకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 

ఆయా మిల్లులు తనిఖీ చేసి, వారం రోజుల్లో ప్యాడి ప్రోక్యుర్ మెంట్ యాప్ లో అప్లోడ్ చెయ్యాలని ఆదేశించారు. జిల్లాలో సి ఎం ఆర్ రైస్ మిల్లులుగా 140 మిల్లులను గుర్తించడం జరిగిందని, ఆమేరకు రానున్న ఏడు రోజులు క్షేత్ర స్థాయి లో తనిఖీలు పూర్తి చెయ్యాలని ఆదేశించారు. ప్యాడి సేకరణ అనంతరం యాప్ లోని డేటా ఎంట్రీ కి అనుగుణంగా ఆన్లైన్ ద్వారా కేటాయింపులు జరుగుతాయని, ఈ నేపద్యంలో క్షేత్ర స్థాయి తనిఖీ లను అత్యంత జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు. 


జిల్లా పౌర సరఫరాల అధికారి పి. విజయ భాస్కర్ ప్రోక్యూర్ మెంట్ యాప్ పై శిక్షణ అందచేశారు.


ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి పి. విజయ భాస్కర్, మార్కెటింగ్ జిల్లా మేనేజర్ ఏ .కుమార్,  ఏ ఎస్ వో వి. త్రినాధ్ రావు, సహాయ లేబర్ కమిషనర్  బి ఎస్ ఎమ్ వలి, జిల్లా సహకార అధికారి వై. ఉమా మహేశ్వర రావు, , డి ఎల్ డి వో పి. వీణా దేవి, వి. శాంత మణి, ఈ ఈ పోల్యూషన్ కంట్రోల్ బోర్డు ,  ఫుడ్ ఇన్ స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.


Comments