న‌వ‌ర‌త్నాలు-ద్వై వార్షిక న‌గ‌దు మంజూరు కార్య‌క్ర‌మం

 

కాకినాడ‌, ఆగ‌స్టు 24 (ప్రజా అమరావతి);


*న‌వ‌ర‌త్నాలు-ద్వై వార్షిక న‌గ‌దు మంజూరు కార్య‌క్ర‌మం


కింద‌*

జిల్లాలో 8,877 మందికి రూ. 11.44 కోట్ల ల‌బ్ధి

- కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా వెల్ల‌డి


న‌వ‌ర‌త్నాలు-ద్వై వార్షిక న‌గ‌దు మంజూరు కార్య‌క్ర‌మం ద్వారా కాకినాడ జిల్లాలో 8,877 మందికి రూ. 11.44 కోట్ల మేర ల‌బ్ధి జ‌రుగుతోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా తెలిపారు. వివిధ సంక్షేమ ప‌థ‌కాల‌కు అర్హ‌త ఉండి నిర్ణీత స‌మ‌యంలో ద‌ర‌ఖాస్తు చేసుకోలేక‌పోవ‌డం, బ్యాంకు ఖాతా వివ‌రాలు స‌రిగా లేక‌పోవ‌డం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల మిగిలిపోయిన వారికి న‌వ‌ర‌త్నాలు-ద్వై వార్షిక న‌గ‌దు మంజూరు కార్య‌క్ర‌మం ద్వారా ల‌బ్ధి మొత్తాన్ని ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మ‌చేసే కార్య‌క్ర‌మాన్ని గురువారం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి.. తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం నుంచి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి కాకినాడ క‌లెక్ట‌రేట్ నుంచి క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, ఎమ్మెల్సీ క‌ర్రి ప‌ద్మ‌శ్రీ, కుడా ఛైర్‌ప‌ర్స‌న్ రాగిరెడ్డి చంద్ర‌క‌ళా దీప్తి, రాష్ట్ర అయ్యార‌క కార్పొరేష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్ ఆవాల రాజేశ్వ‌రి.. గ్రామీణాభివృద్ధి, విద్య‌, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమం త‌దిత‌ర శాఖ‌ల అధికారులు, వివిధ ప్రాంతాల ల‌బ్ధిదారుల‌తో క‌లిసి వ‌ర్చువ‌ల్‌గా హాజ‌ర‌య్యారు. బ‌ట‌న్ నొక్కి ల‌బ్ధిదారుల ఖాతాల్లోకి న‌గ‌దును జ‌మ‌చేసే కార్య‌క్ర‌మాన్ని ముఖ్య‌మంత్రి ప్రారంభించిన అనంత‌రం క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా.. ప్ర‌జాప్ర‌తినిధులు, వివిధ శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి ప‌థ‌కాల ల‌బ్ధిదారులు, విద్యార్థుల‌కు రూ. 11.44 కోట్ల మెగా చెక్‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ల‌బ్ధిదారుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ప‌థ‌కాల లబ్ధి మొత్తాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల స్థాయిలో అత్యంత పార‌ద‌ర్శ‌క‌త‌, జ‌వాబుదారీత‌నంతో అర్హులంద‌రికీ సంతృప్తిక‌ర స్థాయిలో ప‌థ‌కాలు అందించ‌డం జ‌రుగుతోంద‌ని తెలిపారు. అర్హ‌త ఉండి ఏ కార‌ణంచేత‌నైనా ల‌బ్ధి చేకూర‌కుండా ఉంటే వెంట‌నే గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌ను సంప్ర‌దించి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే వెరిఫికేష‌న్ చేసి ద్వై వార్షిక న‌గ‌దు మంజూరు కార్య‌క్ర‌మంలో ల‌బ్ధి చేకూర్చ‌డం జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీర‌మ‌ణి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎస్‌వీఎస్ సుబ్బ‌లక్ష్మి, సాంఘిక సంక్షేమ జేడీ డీవీ ర‌మ‌ణ‌మూర్తి, మ‌త్స్య‌శాఖ జేడీ పీవీ స‌త్య‌నారాయ‌ణ, వివిధ శాఖ‌ల అధికారులు, ప‌థ‌కాల ల‌బ్ధిదారులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

***

*ల‌బ్ధిదారుల మ‌నోగ‌తం*


1. *ఎంతో గొప్ప‌గా సంక్షేమ ప‌థ‌కాలు*

బ్యాంకు ఖాతాలో స‌మ‌స్య కార‌ణంగా వైఎస్ఆర్ ఆస‌రా మొత్తం అంద‌లేదు. వాలంటీర్ సూచ‌న‌, స‌హాయంతో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకున్నాను. ఇప్పుడు ఆ ప‌థ‌కం ద్వారా నాకు ల‌బ్ధి చేకూరుతోంది. ఇంత గొప్ప‌గా సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్న గౌర‌వ ముఖ్య‌మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. వాలంటీర్‌, స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌లు ద్వారా మాలాంటి పేద‌ల‌కు ఎంతో మేలు జ‌రుగుతోంది. ఎవ‌రూ ఎక్క‌డికీ వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా మా ఇళ్ల వ‌ద్దే ప్ర‌భుత్వ సేవ‌లు అందుతున్నాయి.

- కె.ర‌త్నం, పెనుమ‌ర్తి, కాకినాడ గ్రామీణం.


2. అర్హ‌త ఒక్క‌టే ప్రాతిప‌దిక‌గా ప‌థ‌కాల అమ‌లు

సంక్షేమ కేలండ‌ర్ ప్రకారం అమ్మ ఒడి ల‌బ్ధి మొత్తాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన స‌మ‌యంలో క‌రెంట్ బిల్లు స‌మ‌స్య కార‌ణంగా మా పిల్ల‌ల‌కు అమ్మ ఒడి రాలేదు. త‌ర్వాత స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి, మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకున్నాం. ఇప్పుడు ద్వై వార్షిక న‌గ‌దు మంజూరు కార్య‌క్ర‌మం ద్వారా అమ్మ ఒడి ల‌బ్ధి చేకూరుతోంది. కులం, మ‌తం, వ‌ర్గం, రాజ‌కీయం ఇలా వేటి ప్ర‌మేయం లేకుండా అర్హ‌త ఒక్క‌టే ప్రాతిప‌దిక‌గా ఎంతో చిత్త‌శుద్ధితో ప్ర‌జా సంక్షేమానికి న‌వ‌ర‌త్నాలు ప‌థ‌కాల ద్వారా కృషిచేస్తున్న గౌర‌వ ముఖ్య‌మంత్రికి మాలాంటి ల‌బ్ధిదారులు అంద‌రి త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను.

- జి.కిశోర్‌కుమార్‌, 37వ వార్డు, కాకినాడ అర్బ‌న్‌.


*****

*ద్వైవార్షిక ల‌బ్ధి కార్య‌క్ర‌మం ల‌బ్ధిదారుల వివ‌రాలు*


ప‌థ‌కం                           ల‌బ్ధిదారులు      ల‌బ్ధి మొత్తం (రూ.)

1. జ‌గ‌న‌న్న అమ్మ ఒడి     646               96,90,000

2. వైఎస్ఆర్ నేత‌న్న నేస్తం  5                 1,20,000

3. ఈబీసీ నేస్తం               251               37,65,000

4. జ‌గ‌న‌న్న చేదోడు      2,046              2,04,60,000

5. వైఎస్ఆర్ మ‌త్స్య‌కార భ‌రోసా 47        4,70,000

6. జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన     975          84,39,200

7. జ‌గ‌న‌న్న విద్యా దీవెన     1,481      2,07,69,737

8. వైఎస్ఆర్ ఆస‌రా            1,995      3,91,59,067

9. వైఎస్ఆర్ రైతు భ‌రోసా    1,431       1,15,68,000

మొత్తం                          8,877         11,44,41,004


Comments