అందరూ తప్పనిసరిగా చేనేత దుస్తులు ధరించాలి : జిల్లా కలెక్టర్,.

 అందరూ తప్పనిసరిగా చేనేత దుస్తులు ధరించాలి :  జిల్లా కలెక్టర్,


  

పుట్టపర్తి, ఆగస్టు 5 (ప్రజా అమరావతి), స్వాతంత్ర సాధనకు మొట్టమొదటి మెట్టు అయిన స్వదేశీ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన చేనేతకు గౌరవం ఇచ్చేలా నిర్వహిస్తున్న చేనేత దినోత్సవం నాడు  అందరూ తప్పనిసరిగా చేనేత దుస్తులను ధరించాలని జిల్లా కలెక్టర్  పి  అరుణ్ బాబు శనివారం ఒక ప్రకటనలో   తెలిపారు 

గతంలో 1905లో స్వాతంత్ర సమరం తీవ్రంగా జరిగే రోజులలో ఆగస్టు 7న విదేశీ దుస్తులను బహిష్కరించాలని స్వదేశీ దుస్తులను ధరించాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం రాజధానిలో ఈ ఉద్యమాన్ని చేపట్టారు. అప్పటినుంచి భారతీయులు రాట్నంపై  వడిచే చేనేత దుస్తులను వేసుకోవడం, విదేశీ వస్తువుల బహిష్కరణ చేయడం జరిగిందని, స్వాతంత్ర్య సమరంలో ఇది ఒక ప్రధాన ఘట్టంగా భావించిన దరిమెల భారతదేశంలో ఆగస్టు 7న జాతీయచేనేత దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించడం జరిగిందని. భారత స్వాతంత్ర సమరంలో ప్రముఖ పాత్ర వహించిన ఈ విదేశీ దుస్తుల నిరాకరణ అత్యంత ప్రాధాన్యమైన భావించి ఇది ఒక ప్రత్యేక ఉద్యమంగా భావించాలన్నారు. ఆగస్టు 7న ఉద్యోగులు, కుటుంబంలో  ఉండే సభ్యులు, కార్మికులు, రైతులు, ప్రైవేటు ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు ఈ జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని అందరూ తప్పనిసరిగా చేనేత దుస్తులు ధరించాలని కలెక్టర్  పై ప్రకటనలలో తెలిపారు.



Comments