మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్.



మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్.



కర్నూలు/మంత్రాలయం:ఆగస్ట్ 31 (ప్రజా అమరావతి): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ గురువారం సాయంత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు.


శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం నిర్వహించిన 352వ ఆరాధనోత్సవాల్లో భాగంగా గురువారం  పూర్వారాధన కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రాలయం విచ్చేసిన రాష్ట్ర గవర్నర్  గారికి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి మహా ద్వారం వద్ద మంగళ  వాయిద్యాల నడుమ వేద పండితులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. తొలుత మాంచాలమ్మ దేవత ను దర్శించుకున్న అనంతరం  రాష్ట్ర గవర్నర్ గారు రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు..ఈ సందర్భంగా  అర్చకులు  అందచేసిన తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ వారితో  కలిసి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం స్వరూపం, చరిత్ర, నిర్వహణ   గురించి రూపొందించిన  ఏవి ని తిలకించారు.


అనంతరం గవర్నర్ గారు శ్రీ రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ కార్యక్రమాల్లో గవర్నర్ గారి వెంట పూర్వారాధన కార్యక్రమంలో  రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి మరియు కర్నూలు జిల్లా ఇంఛార్జ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ,నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, జిల్లా ఎస్పీ జి.కృష్ణ కాంత్ ,ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


తొలుత మంత్రాలయానికి విచ్చేసిన  రాష్ట్ర గవర్నర్   గారికి పద్మనాభ తీర్థ అతిథి గృహం వద్ద   రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి మరియు కర్నూలు జిల్లా ఇంఛార్జ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ , నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ ,ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, మఠం మేనేజర్ ఎస్.కే.శ్రీనివాస రావు తదితరులు స్వాగతం పలికారు.

 


Comments