రూ.1 ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ అందాలి.

 

అమరావతి (ప్రజా అమరావతి);


*జగనన్న ఆరోగ్యసురక్షపై క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాల కలెక్టర్లతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*


*డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా అనే అంశంపై ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ రూపొందించిన బ్రోచర్‌ను విడుదల చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*జగనన్న ఆరోగ్య సురక్షపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు.*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ..:*


ఈ కార్యక్రమం గురించి ఇప్పటికే సీఎంఓ, వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి సుదీర్ఘంగా కలెక్టర్లుతో చర్చించి, ఒక రోడ్‌ మ్యాప్‌ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమం ఎలా చేపట్టాలన్న దానిపై... మరింత స్పష్టత ఇస్తున్నాను. 


జగనన్న సురక్ష తరహాలోనే ఈ కార్యక్రమం చేపడుతున్నాం. సురక్ష తరహాలో ప్రతి ఇంటికి వెళ్లి, వారి సమస్యలను తెలుసుకుంటాం. ఒక నిర్ణీత రోజున వారికి మంచి జరిగేలా హెల్త్‌ క్యాంపు నిర్వహిస్తాం. సురక్షలో ఏ రకంగా సుమారు 98 లక్షలకు పైగా సర్టిఫికేట్లు నెల రోజుల వ్యవధిలో అందించామో... అదే తరహాలో ఇక్కడ చేపట్టాల్సిన అవసరం ఉంది.

వారికి ప్రతి పథకంలోనూ లబ్ధి జరిగిస్తూ, అవసరమైన సర్టిఫికేట్స్‌ ఇప్పిస్తూ.. ప్రభుత్వం మీకు అందుబాటులో, మీ ఊరులోనే ఉందని భరోసా ఇవ్వగలిగామో... అదే మాదిరిగానే జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో మరో కార్యక్రమం చేస్తున్నాం.


ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో జల్లెడ పట్టి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారమిచ్చే గొప్ప బాధ్యతను మనం తీసుకుంటున్నాం. ఈ విషయాన్ని ఎవ్వరూ మర్చిపోవద్దు. 

మనం చేసే ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో జల్లెడ పట్టి.. ఒక పర్టిక్యులర్‌ రోజునాడు ఆ గ్రామంలో హెల్త్‌ క్యాంపు నిర్వహిస్తాం. అందులో వారికి అవసరమైన పరీక్షలు చేయడం పాటు, మందులు, కళ్లద్దాలు ఇస్తూ...అదనపు బాధ్యత కూడా తీసుకున్నాం.


జల్లెడ పట్టిన గ్రామాన్ని ఫ్యామిలీ డాక్టర్‌ పూర్తిగా బాధ్యత తీసుకుని ఆ గ్రామాన్ని మ్యాపింగ్‌ చేసి... ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో ఏ సమస్యలున్నాయన్నది తెలుసుకుని విలేజ్‌ క్లినిక్‌ ద్వారా వాటిని పరిష్కరిస్తారు. విలేజ్‌ క్లినిక్‌ల ద్వారా ఆ గ్రామాన్ని ఆరోగ్యపరంగా చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం చేస్తారు. 


ఆ తర్వాత ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో ఎవరికి... ఏ రకమైన మందులు కావాలి, ఎలాంటి ట్రీట్‌ మెంట్‌ జరగాలి అన్న దానిపై చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం జరుగుతుంది.

ఆ గ్రామంలో ఒక ఇంట్లో ఎవరికైనా డయాలసిస్‌ జరుగుతున్నా.. ఇంకేదైనా మందులు అవసరమైన, పెరాలసిస్, మరేదైనా సమస్య ఉంటే వారికి రెగ్యులర్‌ మెడిసిన్‌ ఇవ్వడంతో పాటు వైద్యుడు వారిని పరీక్షించి... తదుపరి చికిత్స అందించే కార్యక్రమం కూడా జరగాలి. ఈ రెండు బాధ్యతలను మనం తీసుకుంటున్నాం. రెగ్యులర్‌గా ఒకవైపు తనిఖీలు చేస్తూనే... మందులు కూడా ఇవ్వబోతున్నాం. మందులు లేని పరిస్థితి కూడా ఉండకూడదు. దీనికి సంబంధించిన బాధ్యత కూడా మనం తీసుకుంటున్నాం. ఇది చాలా పెద్ద మార్పు. 


అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి ఇళ్లు కవర్‌ కావాలి. క్రానిక్‌ పేషెంట్ల ఉన్న ఇళ్లను ప్రత్యేకంగా మరింత లక్ష్యంగా చేసుకుని వారికి పీరియాడికల్‌గా పరీక్షలు, మందులు, చికిత్స అందిస్తూ... వారిని చేయిపట్టుకుని నడిపించాలి.


ఈ కార్యక్రమంలో గర్భవతులు, బాలింతలుతోపాటు రక్తహీనత ఉన్నవాళ్లను కూడా గుర్తించాలి. ఈ కార్యక్రమం ద్వారా జీరో ఎనిమిక్‌ కేసులే లక్ష్యంగా పనిచేయాలి. వాళ్లను కూడా గుర్తించి మందులుతో పాటు పుడ్‌ సప్లిమెంటేషన్‌ కూడా చేస్తాం. 


దీర్ఘకాలిక వ్యాధులు, నియోనేటల్‌ అండ్‌ ఇన్‌ఫాంట్‌ కేర్‌ కేసులను కూడా పరిగణలోకి తీసుకోవడంతో పాటు,  బీపీ, షుగర్‌ వంటి వాటితో బాధపడుతున్నవారికి కూడా చికిత్స అందించాలి. ఒకవైపు సరైన సమయంలో వీటికి చికిత్స అందిస్తూనే.. జీవనవిధానాల్లో జరగాల్సిన మార్పులు, ఆయా వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై కూడా గ్రామాల్లో అవగాహన కలిగించాలి. దీన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టాలి. 

ఈ వివరాలతో ప్రతి గ్రామాన్ని మ్యాపింగ్‌ చేయాలి. 45 రోజుల పీరియడ్‌తో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆ తర్వాత కూడా చేపట్టాలి.  ప్రతి మండలంలో కనీసం నెలకు 4 గ్రామాల్లో ఈ క్యాంపులు నిర్వహించాలి. ఆ తర్వాత కూడా ఈ క్యాంపులు జరగాలి. దీనివల్ల ప్రతి 6 నెలలకొకమారు ఆ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ హెల్త్‌ క్యాంపు నిర్వహించినట్లవుతుంది. 


ఈ కార్యక్రమం ఐదు దశలలో జరుగుతుంది. 

సెప్టెంబరు 30 న హెల్త్‌ క్యాంపు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభం కావడానికి 15 రోజుల ముందు... అంటే సెప్టెంబరు 15 నుంచి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని జల్లెడ పట్టే కార్యక్రమం ప్రారంభమవుతంది.


తొలిదశలో వలంటీర్లు, గృహసారధులతో పాటు ప్రజాప్రతినిధులు ఈ ముగ్గురూ వెళ్లి ప్రతి ఇంటినీ సందర్శిస్తారు. ఆరోగ్య సురక్షా కార్యక్రమం జరగబోయే రోజు, తేదీతోపాటు ఏయే కార్యక్రమాలు చేపడతామో వివరిస్తారు. ఆరోగ్యశ్రీపై కూడా అవగాహన కలిగిస్తారు. 

ఆరోగ్యశ్రీ పథకంలో ఎంప్యానెల్‌  అయిన ఆసుపత్రులు ఎక్కడ ఉన్నాయి ? ఎలా వెళ్లాలి ?  ఉచితంగా వైద్యం అందుకోవాలంటే ఆరోగ్యశ్రీని ఎలా వినియోగించుకోవాలన్న అంశాలపై అవగాహన కలిగించే కార్యక్రమం జరుగుతుంది. 


తొలిదశలో వాలంటీర్లు, గృహసారధులు, ప్రజాప్రతినిధులు వచ్చి వెళ్లిన తర్వాత దశలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, మీ ఏరియా వాలంటీర్లు వస్తారని చెప్పాలి. గ్రామాన్ని రెండు భాగాలుగా విభజిస్తే... ఒక భాగంలో ఒక ఏఎన్‌ఎం, ఆశావర్కర్, వాలంటీర్‌తో కూడిన ఒక టీం వస్తుంది. ప్రతి ఇంట్లోనూ మీ అందరితో మాట్లాడి... 7 రకాల టెస్టులకు సంబంధించిన విషయాలను మీతో చర్చిస్తారని ప్రజలకు వివరిస్తారు.


రెండో టీంలో సీహెచ్‌ఓ నేతృత్వంలో ఆశావర్కర్, వాలంటీర్‌ వస్తారు. ఇక్కడితో రెండో దశ పూర్తవుతుంది. ఇంటిలోనే 7 రకాల టెస్టులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ...  బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, యూరిన్‌ టెస్టుతో పాటు స్పూటమ్‌ (కఫం)టెస్ట్‌తో పాటు ఫీవర్‌ కేసులుంటే మలేరియా, డెంగ్యూ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. వీటిని ప్రతి ఇంటికి వెళ్లి జల్లెడ పట్టే కార్యక్రమం చేస్తారు. 

ఈ టెస్టుల రిజల్ట్‌ ఆధారంగా... మొబైల్‌ యాప్‌లో ఇలా సేకరించిన డేటాను అప్‌డేట్‌ చేస్తారు.ఆ తర్వాత ప్రతి ఇంటికి, పేషెంట్‌కి ఒక కేష్‌ షీట్‌ కూడా జనరేట్‌ అవుతుంది. ఈడేటా హెల్త్‌ క్యాంపు జరిగేనాటికి ఉపయోగపడుతుంది. 


ఫేజ్‌ –3లో మరోసారి ఓరియెంటేషన్‌ కార్యక్రమం ఉంటుంది. అంటే హెల్త్‌ క్యాంప్‌ జరగబోయే 3 రోజుల ముందు వాలంటీర్, గృహసారధులు, ప్రజా ప్రతినిధులు ఆ గ్రామంలో మరోసారి గుర్తు చేస్తారు. అందుబాటులో ఉండాలని చెప్తారు.


ఫేజ్‌ 4లో  హెల్త్‌ క్యాంపు నిర్వహిస్తారు. ఇది ప్రతి మండలంలో ఒక రోజు హెల్త్‌ క్యాంపు ఉంటుంది.  45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో..  గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ హెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తారు. పట్టణాల్లో అర్భన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ను ఒక యూనిట్‌గా తీసుకుని హెల్త్‌ క్యాంపు నిర్వహించాలి.


ఈ కార్యక్రమంలో నలుగురు డాక్టర్లు పాల్గొంటారు. ఇందులో ఇద్దరు డాక్టర్లు పీహెచ్‌సీల నుంచి పాల్గొంటారు. మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉంటాయి. వీటి నుంచి ఇద్దరు డాక్టర్లతో పాటు మరో ఇద్దరు స్పెషలిస్టు డాక్టర్లు కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. వీరిలో ఒకరు గైనిక్‌ లేదా పీడియాట్రిక్‌ స్పెషలిస్టు డాక్టర్‌ అందుబాటులో ఉండేటట్టు తగిన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా కంటిపరీక్షలను కూడా క్యాంపులో భాగంగా చేపట్టాలి.

ఆయ గ్రామాల్లో... స్కూళ్లలో ఈ కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాటు చేయాలి. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుంది. అదే విధంగా ఎంపీడీఓ, ఎమ్మార్వోలు ఈ మెడికల్‌ క్యాంపు నిర్వహణా బాధ్యత తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. హెల్త్‌ క్యాంపు నిర్వహణకు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.


ఇవి కాకుండా ఐదో దశలో ప్రతి గ్రామంలో జల్లెడ పట్టిన తర్వాత.... హేండ్‌ హోల్డింగ్‌గా ఉండాలి. ఒక్కసారి పేషెంట్లను గుర్తించిన తర్వాత.. వారికి సంబంధించి పీరియాడికల్‌ టెస్టింగ్, కన్సల్టేషన్, పీరియాడికల్‌గా మందులు ఇవ్వడం అన్నది ఈ కార్యక్రమంలో ప్రధాన అంశం. మందులు లేవు, దొరకడం లేదు అన్న మాట వినిపించకూడదు. ఫ్యామిలీ డాక్టర్‌ విలేజ్‌ క్లినిక్కుల ద్వారా బాధ్యత తీసుకోవాలి. 


ఫేజ్‌ 1, ఫేజ్‌ 2లో ఏఎన్‌ఎం, వాలంటీర్లు, ఆశావర్కర్లు, సీహెచ్‌ఓ బ్రోచర్లు తీసుకుని వెళ్లినప్పుడు ఆరోగ్యశ్రీపైన కూడా అవగాహన కలిగించాలి. ఆరోగ్యశ్రీ యాప్‌ను ఫోన్లో డౌన్లోడ్‌ చేయడం ఎలా అన్న అంశాలతోపాటు... ఎలా వినియోగించుకోవాలన్న దానిపై కూడా అవగాహన కలిగించాలి. రూ.1 ఖర్చు కూడా లేకుండా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం అన్నది ప్రభుత్వం యొక్క ప్రత్యేక కార్యక్రమం ఉద్దేశ్యం.  ఆరోగ్య సేవలను ఎలా వినియోగించుకోవాలో అవగాహన కలిగించాలి. ఆరోగ్యశ్రీ సేవలను పొందడం, జీరో ఎనిమిక్‌ కేసులు ఈ రెండు అంశాలు ప్రధానమైనవి. 

 

*రూ.1 ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ అందాలి


.*                                                   ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ఎక్కడ ఉన్నాయి ?. ఎలా వెళ్లాలి ? అన్న అంశాలపై అవగాహన కలిగించాలి. ఈ కార్యక్రమంలో ఇవి చాలా ప్రధానమైన అంశాలు. 

నాకు గట్టి నమ్మకం ఉంది.. జగనన్న సురక్షా కార్యక్రమం తరహాలో.. ఆరోగ్య సురక్షా కార్యక్రమం కూడా మీ చేతుల మీదుగా విజయవంతం అవుతుంది. ప్రతి ఇంటిని ఆరోగ్యపరంగా ప్రజలను సురక్షంగా ఉంచే కార్యక్రమమే ఆరోగ్య సురక్షా కార్యక్రమం. ఎవరికి ఇందులో ఎలాంటి అనుమానాలున్నా.... సీఎంఓతో నివృత్తి చేసుకొండి. సెప్టెంబరు 15న కార్యక్రమం ప్రారంభమై...  30వ తేదీ నాటికి తొలి హెల్త్‌ క్యాంప్‌ మొదలవుతుంది. 


మనం ఈ నాలుగేళ్లలో కేవలం వైద్యఆరోగ్యశాఖలో 53,126 పోస్టులు భర్తీ చేశాం. అన్ని ఆసుపత్రులను జాతీయ స్ధాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసాం. విలేజ్‌ క్లినిక్స్, పీహెచ్‌సీలు మొదలుకుని ఆరోగ్యసురక్ష  కార్యక్రమం జరగబోతుంది. సీహెచ్‌సీలు నుంచి ఏరియా ఆసుపత్రులు, డిస్ట్రిక్ట్‌ ఆసుపత్రులు మొదలుకుని టీచింగ్‌ ఆసుపత్రుల వరకు నాడు–నేడుతో జాతీయ స్ధాయి ప్రమాణాలతో అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. 17 కొత్త మెడికల్‌ కాలేజీలు నిర్మాణం చేసుకుంటున్నాం. వీటికి అదనంగా 5 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏజెన్సీలో నిర్మిస్తున్నాం. ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతంగా పెంచాం. మనం రాకముందు 1,050 సేవలు అందుబాటులో ఉంటే ఇప్పుడు 3,256 సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. ప్రతి పేషెంట్‌ ఈ సేవలను ఉచితంగా అందుకోవాలన్నదే మనలక్ష్యం.


ప్రతి పేషెంట్‌ కూడా డబ్బులు ఖర్చు కాకుండా, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా అందుబాటులోకి వైద్య సేవలను తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్‌ క్లినిక్‌ల పాత్ర ప్రివెంటివ్‌ కేర్‌లో ఒక కొత్త అధ్యాయం. 


*ఖాళీలు తక్షణ భర్తీ...*

వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఎక్కడైనా ఖాళీలుంటే... మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వాటిని తక్షణమే భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలి. గతంలో ఈ తరహా కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. ఛాలెంజ్‌గా తీసుకుని విజయవంతం చేయాలి. విష్‌ యూ ఆల్‌ ది బెస్ట్‌ అని సీఎం ప్రసంగం ముగించారు.

Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image