ఆంధ్రప్రదేశ్ జాతీయ సేవా పధకం వాలంటీర్లకు 2 ఎన్ఎస్ఎస్ జాతీయ స్థాయి ఉత్తమ సేవా పురస్కారాలు.



*ఆంధ్రప్రదేశ్ జాతీయ సేవా పధకం వాలంటీర్లకు 2 ఎన్ఎస్ఎస్ జాతీయ స్థాయి ఉత్తమ సేవా పురస్కారాలు



అమరావతి, సెప్టెంబర్  26 (ప్రజా అమరావతి): కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ వారు నిన్న ప్రకటించిన జాతీయ స్థాయి ఉత్తమ సేవా పురస్కారాలలో ఆంధ్రప్రదేశ్ జాతీయ సేవా పధకం తరుపున ఇద్దరు వాలంటీర్లు  ఎన్ఎస్ఎస్ జాతీయ స్థాయి వాలంటీర్ అవార్డుకు  ఎంపిక ఐనట్లు  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జాతీయ సేవా పధకం అధికారి డా. పి.అశోక్ రెడ్డి  తెలిపారు. రాష్ట్ర జాతీయ సేవా  పధకం క్రింద వివిధ సేవా  కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించినందుకు 2021-22 సంవత్సరానికి కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ వారు  ఆంధ్ర ప్రదేశ్ ను  2 పథకాలకు ఎంపిక చేశారు. 


ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల విభాగం లో  పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా , విక్రమసింహపురి యూనివర్సిటీ అనుబంధ కళాశాల ఐన జగన్స్ డిగ్రీ మరియు పి.జి కాలేజీ కి చెందిన పెళ్లకూరు సాత్విక  అలాగే అనంతపురము జిల్లా, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ  కు  చెందిన కురుబ జయమారుతీ లు ఉత్తమ వాలంటీర్ అవార్డు కు ఎంపిక ఐనట్లు తెలిపారు.  


ఈ సెప్టెంబర్ 29, 2023 న  ఢిల్లీ లోని  రాష్ట్రపతి భవన్  లో, దర్బారు హాల్ లో కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ వారు ఏర్పాటు చేసే 2021-22 సంవత్సరానికి జాతీయ సేవా పధకం అవార్డు ల పంపిణి కార్యక్రమం లో భారతదేశ రాష్త్రపతి శ్రీమతి. ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా వీరిద్దరు  1,00,000/- నగదు, సిల్వర్ మెడల్ , సర్టిఫికెట్ అందుకోనున్నట్లు తెలిపారు. 


ఈ సందర్భంగా డా. పి.అశోక్ రెడ్డి  మాట్లాడుతూ రాష్ట్రం లో 36 యూనివర్సిటీలలో , 2173 అనుబంధ కళాశాలల్లో జాతీయ సేవా పధకం తరుపున వివిధ సేవా కార్యక్రమాలు, వివిధ అవగాహనా సదస్సులు, మెడికల్ క్యాంపు లు, స్వచ్ఛ్ భారత్ మిషన్ తరుపున పరిశుభ్రత కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, కంప్యూటర్ పై అవగాహనా కార్యక్రమాలు, ప్లాస్టిక్ వినియోగం పైన అవగాహన సదస్సులు మరియు అనర్ధాలు , విపత్తు సహాయ కార్యక్రమాలు, బీచ్ లు క్లీనింగ్ , వ్యర్ధాల సేకరణ , కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల పైన ప్రజలకు, గృహిణులకు, పెద్ద వారికి అవగాహన కల్పించడం, బహిరంగ విసర్జన రహిత గ్రామాల ఏర్పాటు కు కృషి చేయడం , పౌష్ఠిక  ఆహరం పైన అవగాహన,  మహిళా సాధికారిత, యువత సాధికారిత, పర్యావరణ సమతుల్యత, యువత-నైపుణ్యాభివృద్ధి, డ్రగ్స్, మత్తు పదార్ధాల వినియోగం పై అవగాహనా సదస్సులు , శానిటైజేషన్ పైన అవగాహనా, బాల్య వివాహాలు నిర్ములన, వ్యవసాయం పైన అవగాహన , వివిధ ప్రభుత్వ శాఖలతో అనుబంధం అయి కార్యక్రమాలు నిర్వహించడం వలన 2021-22 సంవత్సరానికి మన రాష్ట్రానికి 2 పురస్కారాలు దక్కినవి అని ,మన రాష్ట్ర జాతీయ సేవా పధకం కు కేంద్ర ప్రభుత్వం తరుపున ప్రతి సంవత్సరం అవార్డులు వస్తున్నాయని ఇది చాలా శుభపరిణామం అని  రాష్ట్ర సచివాలయం లో మంగళవారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో  ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ. జె.శ్యామల రావు గారు , రాష్ట్ర జాతీయ సేవా పధకం అధికారి డా. పి.అశోక్ రెడ్డి  తెలిపారు.

Comments