ఆంధ్రప్రదేశ్ నుండి ఐ.రా.స. దాకా...
ఆంధ్రప్రదేశ్ నుండి ఐ.రా.స. దాకా...


దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఘనత

అభినందించిన విద్యాశాఖామాత్యులు శ్రీ బొత్స సత్యనారాయణ 

ఈ నెల 16 నుండి అమెరికాలో జరిగే సదస్సుకు 10 మంది తెలుగు విద్యార్థులు

ప్రతినిధుల్లో 8 మంది బాలికలు, ఇద్దరు బాలురు

నేడే (14.9.23) పయనం

విజయవాడ (ప్రజా అమరావతి,): మన రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల 10 మంది విద్యార్థులు ఐక్యరాజ్యసమితిలో  ఈ నెల 16 నుండి జరిగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సదస్సుకు హాజరవడం గర్వకారణమని రాష్ట్ర విద్యాశాఖామాత్యులు శ్రీ బొత్స సత్యనారాయణ అన్నారు.  ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఐ.రా.స.లో అడుగుపెట్టడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు. ఇది ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పేద, బలహీన వర్గాలకు చెందిన పిల్లల అభ్యున్నతికి చేస్తున్న కృషికి నిదర్శనం  అని అన్నారు. 

ఈ సదస్సులో పాల్గొనడానికి అమెరికా పయనం అవుతున్న విద్యార్థులతో బుధవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు.  పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ  ఎస్.సురేష్ కుమార్ , సమగ్ర శిక్ష రాష్ర్టపథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు తో పాటు విద్యార్థులతో మాట్లాడుతూ ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ ప్రయాణంలోను, అమెరికాలోను తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించి, సూచనలు చేశారు.  నార్త్ అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పర్యటన విజయవంతం చేసుకోవాలని అన్నారు. ఎనిమిది మంది బాలికలు, ఇద్దరు బాలురతో కూడిన ప్రతినిధుల బృందాన్నిపూర్తి ప్రభుత్వ వ్యయంతోనే ఈ అమెరికాకు తీసుకెళ్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా వివరించారు. ఈ పర్యటనలో భాగంగా విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించామని తెలిపారు. వారం రోజుల పాటు ఈ పర్యటన ఉంటుందన్నారు. 

ప్రతినిధి బృందం లక్ష్యం:

నాడు నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్నవసతిదీవెన, ద్విభాషా పాఠ్యపుస్తకాలు, విద్యార్థుల కోసం టాబ్లెట్‌లు పంపిణీ, డిజిటల్ తరగతి గదులు, ఆంగ్ల విద్య, పాఠ్యాంశాల సంస్కరణలు, సబ్జెక్టు ఉపాధ్యాయుల ఏర్పాటు వంటి విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను ప్రదర్శించడం.


సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ. బి.శ్రీనివాసరావు, IAS., బృంద ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కేజీబీవీ కార్యదర్శి శ్రీ. డి.మధుసూధనరావు, మొత్తం ప్రయాణ కార్యక్రమాన్ని సులభతరం చేయడానికి నోడల్ ఆఫీసర్‌గా నామినేట్ చేయబడ్డారు. యునైటెడ్ నేషన్స్‌లోని ECOSOC స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ శ్రీ వున్నవ షకిన్ కుమార్‌ సమన్వయంతో USAలోని ప్రతినిధుల బృందం కోసం అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు..శ్రీమతి వి.విజయదుర్గ మరియు కె.వి.హేమప్రసాద్ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ మార్గదర్శకులుగా ఉన్నారు. 

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని పాఠశాలల నుండి విద్యార్థి ప్రతినిధి బృందం పాల్గొనడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులు నేరుగా దౌత్య, అంతర్జాతీయ సంబంధాలతో నిమగ్నమవ్వడానికి, నేటి ప్రపంచంలో కూడా ప్రధానమైన అంశాలను చర్చించడానికి అవకాశం పొందుతారు. వారు ఈ అంశాల గురించి విస్తృతమైన జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు.


మన విద్యార్థులు UN మరియు న్యూయార్క్ మరియు వాషింగ్టన్ DCలోని ఇతర సంస్థలను సందర్శించిన తర్వాత క్రింది నైపుణ్యాలను వారసత్వంగా పొందుతారు:

వివిధ ప్రపంచ సమస్యల గురించి సమగ్ర జ్ఞానం పొందుతారు.

వివిధ అంశాల గురించి, వివిధ దేశాల స్థానాలు మరియు దృక్కోణాలపై అవగాహన

ప్రపంచ సమస్యలకు పరిష్కారాలతో ముందుకు రావడానికి సృజనాత్మక ఆలోచన ప్రక్రియ

ఆలోచనలు మరియు ఆవిష్కరణలను చర్చించడానికి, స్పష్టంగా చెప్పడానికి, వ్యాపార నైపుణ్యాలు నేర్చుకుంటారు.

అభివృద్ధి అంశాలపై పెద్ద సమావేశాల్లో స్పష్టంగా, నమ్మకంతో మాట్లాడగల సామర్థ్యం.


విద్యార్థుల ఎంపిక ప్రక్రియ:

ప్రభుత్వ పాఠశాలల నుంచి పది మంది విద్యార్థులను పటిష్ట ప్రక్రియ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. 

రాత పరీక్ష: SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ 2023లో మొత్తం 7 ప్రభుత్వ మేనేజ్‌మెంట్ పాఠశాలల నుండి అత్యధిక ప్రతిభ కనబరిచిన 103 మంది అభ్యర్థులను 31-07-2023న నిర్వహించిన రాత పరీక్షకు పిలవడం జరిగింది.

కమ్యూనికేషన్ స్కిల్స్: రాత పరీక్ష నిర్వహించిన తర్వాత 30 మంది అభ్యర్థులు 1:3 నిష్పత్తిలో 02-08-2023న నిర్వహించిన స్పీకింగ్ టెస్టుకు సంక్షిప్తంగా జాబితా చేయబడ్డారు.

చివరగా, కమిటీ 30 మంది షార్ట్ లిస్టెడ్ అభ్యర్థుల నుండి 10 మంది విద్యార్థులను ఎంపిక చేసింది, వారు రాత మరియు మాట్లాడే పరీక్ష (కమ్యూనికేషన్ స్కిల్స్) రెండింటిలోనూ చక్కని ప్రతిభ కనబరిచడంతో తుది జాబితాకు ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపికలో లింగం, సామాజిక ఆర్థిక స్థితిని కూడా కమిటీ గమనించింది. చివరగా 9 జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎనిమిది మంది బాలికలును, ఇద్దరు అబ్బాయిలు ఎంపికచేయడం జరిగింది. 


విద్యార్థుల వివరాలు: 

క్ర.సం. విద్యార్థి పేరు లింగం చదివిన పాఠశాల తండ్రి పేరు తల్లి పేరు కుటుంబ నేపథ్యం ప్రస్తుతం చదువుతున్న విద్యా సంస్థ1

మాల శివలింగమ్మ

బాలిక కేజీబీవీ ఆదోని, కర్నూలు జిల్లా

మాల సోమనాథ్ మాల గంగమ్మ ఆమె తండ్రి పేద రైతు మరియు తల్లి రోజువారీ కూలీ

APSWRS, ఆరేకల్, కర్నూలు2

మోతుకూరి చంద్రలేఖ


బాలిక కేజీబీవీ ఎటపాక, ఏఎస్ఆర్ జిల్లా.

మోతుకూరి రామారావు

మోతుకూరి మణి ఆమె తండ్రి ఆటో డ్రైవర్ మరియు తల్లి గృహిణి ఇంటర్మీడియట్‌లో చేరడానికి నవోదయ ఫలితాల కోసం ఎదురూస్తోంది. 3

గుండుమొగుల గణేష్ అంజనాసాయి

బాలుడు

ఏపీఆర్ఐఎస్,

అప్పలరాజుగూడెం (బాలురు) పశ్చిమ గోదావరి జిల్లా

గుండుమొగుల గోపి

గుండుమొగుల లక్ష్మి అతని తండ్రి ఒక పేద కౌలు తండ్రి.


ఐఐఐటీ నూజివీడు4


దడాల జ్యోత్స్న


బాలిక

సాంఘిక సంక్షేమం, వెంకటాపురం, కాకినాడ జిల్లా.


సింహాచలం


సింహాచలం ఆమె తండ్రి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. డా. బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయం ఐఐటీ అకాడమీలో ఇంటర్ చదువుతుంది.5


సి.రాజేశ్వరి


బాలిక

AP మోడల్ స్కూల్

,నంద్యాల


సి.దస్తగిరి

సి.రామలక్ష్మి ఆమె తండ్రి లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తల్లి గృహిణి.


ఐఐఐటీ ఇడుపులపాయ6 పసుపులేటి గాయత్రి

బాలిక ZPHS వట్లూరు, ఏలూరు జిల్లా పసుపులేటి రమేష్

పసుపులేటి జ్యోతి ఆమె తండ్రి రోజువారీ కూలీ, తల్లి గృహిణి.


ఐఐఐటీ నూజివీడు7 అల్లం రిషితారెడ్డి

బాలిక మున్సిపల్ ఉన్నత పాఠశాల, కస్పా, విజయనగరం జిల్లా ఎ.రామకృష్ణారెడ్డి

ఎ.ఉదయలక్ష్మి ఆమె తండ్రి ప్రైవేట్ సెక్టార్‌లో మెకానిక్ మరియు తల్లి గృహిణి.


ఐఐఐటీ నూజివీడు8 వంజివాకు యోగేశ్వర్

బాలుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలుర) చంద్రగిరి గ్రామం, నరసింగపురం, తిరుపతి జిల్లా.


వి.నాగరాజు వి.విజయ అతని తండ్రి తిరుపతి జిల్లాలో కేబుల్ ఆపరేటర్, తల్లి గృహిణి.


ఐఐఐటీ నూజివీడు9


షేక్ అమ్మాజన్


బాలిక

ఏపీ ఆర్ఎస్, వేంపల్లి, శ్రీ సత్యసాయి జిల్లా

షేక్ మౌలా

షేక్ ఫాతిమా తల్లి మాత్రమే ఉన్నారు. ఆమె రోజువారీ వ్యవసాయ కూలీ


ఐఐఐటీ ఇడుపులపాయ


10

సామల మనస్విని

బాలిక KGBV, గుమలక్ష్మీపురం, పార్వతీపురం, మన్యం జిల్లా


NA


కృష్ణవేణి GL పురం KGBVలో 9వ తరగతి చదువుతున్న సింగిల్ పేరెంట్ విద్యార్థి,

కేజీబీవీ, జీఎల్ పురం.

Comments