బైపిళ్ళ నారాయణ నిఖిల్ కు లక్ష రూపాయల ఆర్ధిక సహాయ చెక్కును అందించిన జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు.

 ఎన్టీఆర్ జిల్లా (ప్రజా అమరావతి);


        


మల్టిపుల్ డిజబిలిటీతో బాధపడుతున్న రెండున్నర సంవత్సరాల బైపిళ్ళ నారాయణ నిఖిల్ కు లక్ష రూపాయల ఆర్ధిక సహాయ చెక్కును అందించిన జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కుమారుని వివాహానికి హాజరై తిరిగి వెళ్లే సమయంలో అక్కడ ఎడమ కన్ను, చెవి అంగవైకల్యం మల్టిపుల్ డిజబిలిటీ  తో బాధపడుతున్న రెండున్నర సంవత్సరాల నారాయణ నిఖిల్ ను ముఖ్యమంత్రి పరామర్శించారు. నగరంలోని భవానిపురం, 38వార్డు కొత్తపేటలో నివాసం ఉంటున్న బైపిళ్ళ రమేష్, లక్ష్మీ పద్మ దంపతుల  కుమారుడు నారాయణ నిఖిల్ అనారోగ్య సమస్య తో బాధపడుతున్నాడని మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వివరించారు.  వారి సమస్యను  విన్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నారాయణ నిఖిల్ కు  వైద్య సేవలు నిమిత్తం  ఆర్థిక సహాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావును ఆదేశించగా తక్షణమే జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు వైద్య సేవల నిమిత్తం లక్ష రూపాయల చెక్కును కలెక్టరేట్లో అందజేశారు. Comments