ప్రారంభమైన ’ఆపరేషన్ అజయ్’ - స్వదేశానికి చేరిన 10 మంది ఏపీ వాసులు.
తాడేపల్లి (ప్రజా అమరావతి);
*ప్రారంభమైన ’ఆపరేషన్ అజయ్’ - స్వదేశానికి చేరిన 10 మంది ఏపీ వాసులు*ఇజ్రాయెల్ లో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం *‘ఆపరేషన్ అజయ్’* ద్వారా భారతీయులను విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా మొదటి విమానం నిన్న (12.10.23) ప్రారంభించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 10 మంది ఇవాళ (13.10.23) డిల్లీకి  చేరుకున్నారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఇజ్రాయెల్లో దాదాపు 18,000 మంది భారతీయులు ఉండగా, వీరందరినీ తరలించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రి శ్రీ. ఎస్. జైశంకర్ ట్విట్టర్లో వెల్లడించిన సంగతి విదితమే. భారతీయులు స్వదేశానికి రావడానికి భారత రాయబార కార్యాలయంలో వారి  వివరాలను భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నెంబర్: +972 35226748 లేదా ఈ  లింక్ ద్వారా నమోదు చేసుకోగలరని కోరింది.

https://sxnqsinzgbxy1u0-adwdemo.adb.ap-hyderabad-1.oraclecloudapps.com/ords/r/mea/evacuaid/evacu_aid?session=113613339334455 

రాష్ట్ర ప్రభుత్వం తరఫున APNRTS ఈ లింక్ మరియు హెల్ప్ లైన్ నంబర్లను ఏపీ వాసులకు తెలియజేయడమే కాక, తనకు వస్తున్న సమాచారాన్ని.... ఇజ్రాయెల్ నుండి రావాలనుకుంటున్న వారి వివరాలను ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్ ద్వారా  MEA కు పంపడం జరుగుతోంది.    
అయితే నిన్నటి విమానంలో మొత్తం 10 మంది ఆంధ్రప్రదేశ్ వాసులు డిల్లికి చేరుకున్నారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది ఏపీ వాసులు రానున్నారు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు డిల్లీ నుండి ఏపీకి రావడానికి ప్రయాణ ఖర్చులు భరించలేని విద్యార్థులు మరియు ఇతర వలసదారులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున విమాన చార్జీలు పెట్టి వారిని  రాష్ట్రానికి పంపాలని డిల్లీలోని ఏపీ రెసిడెంట్ భవన్ అధికారులకు ఆదేశం ఇచ్చారు.

 ఇజ్రాయెల్ లో ఉన్న భారతీయ పౌరులు అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నెంబర్ తో పాటు, ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు +91 8500027678 (వాట్సాప్), 0863 2340678 ను సంప్రదించగలరు. అలాగే, మీ కుటుంబసభ్యులు లేదా మిత్రులు లేదా తెలిసిన వారు ఎవరైనా ఇజ్రాయెల్ లో ఉంటే, APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించి వివరాలు తెలపగలరని కోరుతున్నాము.

Comments