నెదర్లాండ్ జట్టును ఉతికి ఆరేసిన మ్యాక్స్వవెల్.

 *నెదర్లాండ్ జట్టును ఉతికి ఆరేసిన మ్యాక్స్వవెల్


*

న్యూ ఢిల్లీ :అక్టోబర్ 25 (ప్రజా అమరావతి);

వన్డే ప్రపంచకప్ లో న్యూఢిల్లీ  వేదికగా  ఆడుతున్న పలు జట్లు 350 ను మినిమం టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నట్టున్నాయి. చిన్నా, పెద్ద జట్లు అనే తేడాలేకుండా బ్యాటర్లు బ్యాట్ ఝుళిపిస్తున్నారు. ఆస్ట్రేలియా కూడా మరోసారి రెచ్చిపోయి ఆడింది,


నెదర్లాండ్స్ ఎదుట 400 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. అంతగా అనుభవంలేని నెదర్లాండ్స్ బౌలర్లను ఉతికారేసింది.


ఓపెనర్ డేవిడ్ వార్నర్ (93 బంతుల్లో 104, 11 బౌండరీలు, 3 సిక్సర్లు) బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ తో అలరించాడు.


వార్నర్ కు తోడుగా మ్యాక్స్వెల్,44 బంతుల్లో 106, 9 ఫోర్లు, 8 సిక్సర్లు కూడా ఆఖర్లో శివాలెత్తడంతో ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేసింది.


స్టీవ్ స్మిత్ (68 బంతుల్లో 71, 9 ఫోర్లు, 1 సిక్సర్), మార్నస్ లబూషేన్ (47 బంతుల్లో 62, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మిడిలార్డర్లో ఆసీస్ స్కోరుబోర్డును నడిపించారు..

Comments