చంద్ర‌బాబు త‌ల‌వంచ‌డు, త‌ల దించ‌డు.

 చంద్ర‌బాబు త‌ల‌వంచ‌డు, త‌ల దించ‌డు-నీతి నిజాయితీయే ఆయ‌న ఆయుధం

- ప్ర‌జ‌ల త‌ర‌ఫున శాంతియుతంగా పోరాడాల‌ని చెప్పారు

- రాష్ట్ర ప్ర‌గ‌తి-ప్ర‌జాసంక్షేమ‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు-ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొత్తు ప్ర‌క‌ట‌న‌ 

-త్వ‌ర‌లో భువ‌న‌మ్మ ``నిజం గెల‌వాలి`` కార్య‌క్ర‌మం

- న‌వంబ‌ర్ 1 నుంచి బాబు ష్యూరిటీ-భ‌విష్య‌త్తుకి గ్యారెంటీ పునః ప్రారంభం 

- చంద్ర‌బాబు క‌డిగిన ముత్యంలా త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కొస్తారు

- అనంత‌రం యువ‌గ‌ళం పాద‌యాత్ర మొద‌ల‌వుతుంది

-  టిడిపి-జ‌న‌సేన 160 సీట్లు గెల‌వ‌బోతోంది

- టిడిపి రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

అమరావతి (ప్రజా అమరావతి);

 ``నా క‌ల‌లో కూడా ఇటువంటి ప‌రిస్థితి వ‌స్తుంది అని ఊహించ‌లేదు. తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. గతంలో ఏ కష్టం వచ్చినా మన అధినేతలు ఎన్టీఆర్ , చంద్రబాబు  ముందు ఉండి పోరాడేవారు. ఇందిరాగాంధీ క‌క్ష క‌ట్టి ఎన్టీఆర్ ని గ‌ద్దె దింపేస్తే, తెలుగుజాతి ఏక‌మై తెలుగుదేశం సైన్య‌మై పోరాడి నెల‌రోజుల్లో ఆయ‌న‌ని మళ్లీ సీఎంని చేశారు. నాటి పోరాటం వేరు, నేడు మ‌నం చేసే పోరాటం వేరు. ఇప్ప‌డు సైకో జ‌గ‌న్ అనే రాక్ష‌సుడితో పోరాడుతున్నాం. త‌న కుటుంబాన్ని వ‌దిలి ప్ర‌జ‌ల కోస‌మే 45 ఏళ్లు ప‌నిచేసిన నిస్వార్థ సేవ‌కుడు చంద్ర‌బాబుని వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేస్తూ 43 రోజులు జైల్లో నిర్బంధించారు. ఆయ‌న‌ని ములాఖ‌త్‌ల‌లో క‌లిసిన‌ప్పుడు ఆయన నీతి- నిజాయితీతో కూడి ధైర్యం క‌నిపించంది. శాంతియుతంగా పోరాడండి, అరాచ‌క‌పాల‌న‌ని అంత‌మొందించేందుకు ప్ర‌జ‌ల్ని చైత‌న్యం చేయండి అని పిలుపునిచ్చారు. సైకో జ‌గ‌న్ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడ‌టానికి చంద్ర‌బాబు- ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌లిసి పోరాడాల‌ని నిశ్చ‌యించుకున్నారు. టిడిపి-జ‌న‌సేన కూట‌మి 160 సీట్లు గెల‌వ‌బోతోంది. క‌ష్టాల్లో ఉన్న ప్ర‌జ‌లకి భ‌రోసా ఇచ్చేందుకు చంద్ర‌బాబు ప్రారంభించిన బాబు ష్యూరిటీ-భ‌విష్య‌త్తుకి గ్యారెంటీ న‌వంబ‌ర్ ఒక‌టి నుంచి రాష్ట్ర‌మంతా ప్రారంభం కానుంది. చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్టుపై ఆవేద‌న‌తో అశువులు బాసిన అభిమానుల కుటుంబాల‌ని ప‌రామ‌ర్శించి అండ‌గా నిలిచేందుకు నా త‌ల్లి భువ‌న‌మ్మ త్వరలోనే ``నిజం గెలవాలి`` అనే కార్య‌క్ర‌మం ద్వారా మృతుల కుటుంబీకుల‌ను ప‌రామ‌ర్శిస్తారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర కూడా త్వ‌ర‌లోనే ఆరంభం అవుతుంది.`` అని లోకేష్ వివ‌రించారు.  ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌లో శ‌నివారం టిడిపి రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్ర‌సంగించారు. నారా లోకేష్ ప్ర‌సంగంలో ముఖ్యాంశాలు 

 రాజ‌కీయ‌కక్ష సాధింపులో భాగంగా మన అధినేతను అరెస్ట్ చేసారు. 

మన అధినేతను అరెస్ట్ చేసి నేటితో 43 రోజులు. 

ఈ సంక్షోభాన్ని కార్యకర్తలు, నాయకులు కలిసి ఎదుర్కొంటున్నారు. 

   చంద్ర‌బాబుని అరెస్టు చేస్తే టిడిపి ఆగిపోతుంద‌నుకున్నారు. భ‌యం మ‌న బ‌యోడేటాలో లేదు.

  నాడు ఇందిరాగాంధీని లెక్క‌చేయ‌ని మ‌నం...మ‌రుగుజ్జు జ‌గ‌న్ ని లెక్క చేస్తామా?

చంద్ర‌బాబుకి మద్ద‌తుగా రాష్ట్ర‌ వ్యాప్తంగా ఉద్యమాలు, ఇతర రాష్ట్రాల్లో ఉద్యమాలు, విదేశాల్లో కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి. 

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని మరో సారి నిరూపించారు. 

శాంతియుతంగా వివిధ రూపాల్లో పోరాడుతున్నప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను.

చంద్రబాబు గారి అరెస్టుతో తీవ్ర ఆందోళ‌న‌కి గురై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనతో 157 మంది చనిపోయారు. ఆ కుటుంబాలకు మనం అండగా ఉండాలి. పార్టీ వారి కుటుంబాలను ఆదుకుంటుంది. 

ఎవరూ అధైర్య పడొద్దు, ఆందోళన చెందొద్దు త్వరలోనే మన నాయకుడు బ‌యటకు వస్తారు.

మనం ఎప్పుడూ తప్పు చెయ్యం...తల వంచం. 

అసలు ఈ అరెస్ట్ ఎందుకు జ‌రిగిందో ప్ర‌జ‌లు తెలుసు కోవాలి?

ఒక్క ఛాన్స్ ఇస్తే మీ జీవితాలు మార్చేస్తా అంటే ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. 

151 కూడా ఆయనకి సరిపోలేదు. టిడిపి నుండి నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు. 

అందరూ ఆయన కేంద్రం మెడలు వంచుతాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు, ప్రజల జీవితాలు మారిపోతాయి అని అనుకున్నారు. 

  ఒక్క రోడ్డు వెయ్యరు, ఒక్క సాగునీటి ప్రాజెక్టు కట్టరు, ఒక్క కంపెనీ తీసుకురారు, కృష్ణా జలాల పై మన రాష్ట్రం హక్కు కోల్పోతుంటే పట్టించుకోరు, రైతాంగానికి సాగు నీరు ఇవ్వలేరు.

కానీ సీఎం అయిన మొదటి రోజు నుండే వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేస్తూ  సైకో జగన్ కక్ష సాధింపు మాత్రమే ఎజెండా గా పెట్టుకొని పనిచేస్తున్నాడు.

 టిడిపి నేత‌ల‌ని అక్ర‌మ కేసులు పెట్టి జైలుకు పంపాడు. మ‌నంద‌రినీ మ‌న నాయ‌కుడు చంద్ర‌బాబు కాపాడుకున్నాడు.

 నాపై కూడా త‌ప్పుడు కేసులు బ‌నాయించాడు. 

 మ‌నం త‌గ్గేదే లేదు, చంద్ర‌బాబు ఇచ్చి కార్యాచ‌ర‌ణ ముందుకు తీసుకెళ్ల‌డం మ‌న బాధ్య‌త‌. 

జగన్ ఎజెండా ఒక్కటే చంద్రబాబు గారిని, కుటుంబ సభ్యులను వేధించడం. 

ప్రజలందరికి నాయకుడుకి, నియంతకి మధ్య తేడా తెలియాలి. 

2014 లో చంద్రబాబు గారికి అధికారం ఇస్తే ఆయన నాయకుడిలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. 

2019 లో ఒక్క చాన్స్ ఇస్తే జగన్ కి అధికారం ఇస్తే నియంతలా రాష్ట్రాన్ని నాశనం చేసాడు, అప్పుల్లో ముంచేసాడు. 

రాష్ట్రానికి కియా, డిక్స‌న్, ఫాక్స్ కాన్‌ లాంటి ఎన్నో పెద్ద కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించినందుకు చంద్రబాబు గారిని బంధించారు. 

పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తి చేసినందుకు చంద్రబాబు గారిని బంధించారు.

200 పెన్స‌న్ 2 వేలు చేసినందుకు, సంక్షేమ ప‌థ‌కాలు అందించినందుకు చంద్ర‌బాబుని అక్ర‌మ అరెస్టు చేశారు.  

ఇతర రాష్ట్రాలకు ధీటుగా మనకి రాజధాని ఉండాలని కష్టపడినందుకు చంద్రబాబు గారిని బంధించారు.

రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వమని చంద్రబాబు గారు పోరాడటం తప్పా ? 

ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యమని అడగడం నేరమా? 

 సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం ఎందుకు అని ప్రశ్నించడం తప్పా? 

 ఇసుక దోపిడీ, కల్తీ మద్యం గురించి మాట్లాడటం నేరమా? 

 కేంద్రం మెడలు వంచి సాధిస్తా అన్న ప్రత్యేక హోదా ఎక్కడ అని నిలదీయడం జగన్ తట్టుకోలేకపోయాడా?

  షాక్ కొడుతున్న కరెంట్ బిల్లు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి అని డిమాండ్ చెయ్యడం చంద్రబాబు గారు చేసిన పెద్ద తప్పా? ప్రజలు ఆలోచించాలి. 

ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యల పై ప్రభుత్వాన్ని నిలదీయడాన్ని కూడా జగన్ తట్టుకోలేకపోయాడు. ఫ్రస్ట్రేషన్ కి గురయ్యాడు. 

45 ఏళ్ళు రాష్ట్రానికి సేవ చేసారు, కుటుంబం కంటే ప్రజలే ముఖ్యం అనుకున్న ఏకైక నాయకుడు చంద్ర‌బాబు.

రాష్ట్రాన్నే ఆయన కుటుంబం అనుకున్నారు. అందరూ బాగుండాలి అనుకున్నారు. 

త‌న కొడుకు భ‌విష్య‌త్తు గురించి బాబు ఏనాడూ ఆలోచించ‌లేదు. ప్ర‌జ‌ల పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోస‌మే అహ‌ర్నిశ‌లు శ్ర‌మించారు.  

తన కుటుంబ సభ్యుల ఆస్తులు పెంచుకోవాల‌ని ఏ రోజూ ఆలోచించలేదు. రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు పేదరికం నుండి బయటకు రావాలి అని కోరుకున్నారు.

జగన్ వచ్చిన మొదటి రోజు నుండి  ఏం చేసాడో గుర్తు తెచ్చుకోండి. ప్రజా వేదిక కూల్చడంతో ఆయన పరిపాలన ప్రారంభం అయ్యింది. 

చంద్రబాబు గారి ఇంటి గేటుకి తాడు కట్టి బయటకి వెళ్లకుండా అడ్డుకున్నారు.

ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించే టిడిపి నాయకులపై వేల కేసులు, కార్యకర్తలపై లక్షల కేసులు బ‌నాయించారు. 

ఇప్పుడు ఏకంగా చంద్ర‌బాబు కుటుంబ సభ్యుల పైకి కూడా వచ్చారు. మహిళల్ని కూడా వదలడం లేదు. 

మొన్న సిఐడి నన్ను విచారణకు పిలిచి అమ్మ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపించారు. 

ఆమె ఏ రోజైనా రాజకీయాల్లో తలదూర్చారా? ప్రమాణ స్వీకారానికి తప్ప ఎప్పుడూ ఎక్కడికి రావు. 

సేవా కార్యక్రమాలు తప్ప బయటకే రారు. అలాంటి మా అమ్మ భువనమ్మని అసెంబ్లీ సాక్షిగా అవమానించారు. 

ఇప్పుడు ఆమె పై కూడా కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు. 

వైసిపి నాయకులు, మంత్రులు అమ్మని, బ్రాహ్మణి ని అవమానిస్తూ మాట్లాడుతున్నారు. 

చంద్ర‌బాబు భోజనంలో విషం కలిపి పంపుతున్నారు అంటూ మాట్లాడుతున్నారు. అంటే ఎంత బరితెగించారో అర్ధం చేసుకోండి. 

భోజనంలో విషం కలిపి పంపడం, బాబాయ్ ని లేపేయడం, కోడికత్తి డ్రామా  జగన్ డిఎన్ఏ. 

 ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి నేను రావాల‌నుకున్న‌ప్పుడు తండ్రిగా చంద్ర‌బాబు నాకు చెప్పింది ఒక్క‌టే, ``క‌త్తితో బతికే వాడు క‌త్తితోనే పోతాడు.`` అని అన్నారు. ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా రాజ‌కీయాలు చేయాల‌ని, నీతిగా పాల‌న అందించాల‌న్న‌దే ఆయ‌న నాకు ఇచ్చిన సందేశం.

 టిడిపి పాల‌న‌లో  చంద్ర‌బాబు ఒక్క చిటికేస్తే జ‌గ‌న్ తిరిగే వాడా?

రాష్ట్రం కోసం, ప్రజల కోసం అవమానాలు భరిస్తున్నాం. 

జగన్ ఒక సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్, జగన్ ఒక భస్మాసురుడు. 

తెలుగు రాష్ట్రాల ప్రజల నుండి, వైసిపి నాయకులు, మంత్రులు, ఢిల్లీలో వివిధ పార్టీల పెద్దల వరకూ ఎవరూ జగన్ చేస్తున్న ఆరోపణలు, పెట్టిన కేసులను నమ్మడం లేదు. చంద్ర‌బాబు ఒక గొప్ప‌నాయ‌కుడు అంటున్నారు.

అది చంద్రబాబు గారి క్యాలిబర్. 45 ఏళ్ల పాటు ఆయన పడిన కష్టం. నీతి,  నిజాయితీ తో బ్రతికితే ఎలా ఉంటుందో నాకు చంద్రబాబు గారు జైలు కి వెళ్ళాకా అర్ధం అయ్యింది. 

జగన్ అరెస్ట్ అయితే మనం ఆధారాలు చూపించాం. ఒక్కడు కూడా రోడ్డు మీదకి వచ్చి జగన్ కి మద్దతు తెలపలేదు. జగన్ అవినీతి పరుడు కాదని ఈ రోజుకీ కనీసం వైసిపి నాయకులు కూడా అనరు. 

చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే అందరూ రోడెక్కి నిరసన తెలుపుతున్నారు. 

సుమారుగా 17 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టిన చంద్రబాబు గారిపై జగన్ చేస్తున్న అవినీతి ఆరోపణ ఎంతో తెలుసా? 27 కోట్లు. 

 వైసీపీ వాళ్లు చంద్ర‌బాబు స్కిల్ స్కాంలో 3 వేల‌కోట్లు అవినీతి అన్నారు, 370 కోట్లుకి దిగారు, ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు.  అది పార్టీ విరాళాలు, స‌భ్య‌త్వం ద్వారా వ‌చ్చిన‌వి. ఆధారాలు కోసం సీఐడీ ప‌రుగులు పెడుతోంది, పార్టీ ఆడిట‌ర్లు, బ్యాంక‌ర్లు ని బెదిరించారు. ఈ లెక్క‌ల‌న్నీ మ‌హానాడులో ప్ర‌తి ఏటా వెల్లడిస్తాం. సైకో జ‌గ‌న్ లా మాది దొంగ పార్టీ కాదు, లెక్క‌ల‌న్నీ పార‌ద‌ర్శ‌కం. 

 60 ల‌క్ష‌ల మంది కార్య‌క‌ర్త‌లు త‌మ క‌ష్టార్జితం 100 స‌భ్య‌త్వంతో టిడిపి దేవాల‌యం నిర్మించుకున్నాం

ఆ 27 కోట్లు కూడా పార్టీ అకౌంట్ కి వచ్చాయి అంటున్నారు. అవి మెంబర్ షిప్, విరాళాల రూపంలో వచ్చినవి. ఆలా అయితే వైసిపి కి వందల కోట్లు వచ్చాయి. 

జగన్ అవినీతి పరుడు.. ఆ అవినీతి మరక మన నాయకుడికి అంటించాలి అనే కోరిక తప్ప ఒక్క ఆధారం కూడా లేని పస లేని కేసులు పెట్టారు. 

నాలుగున్నర ఏళ్లుగా సైకో జ‌గ‌న్‌ ఏమి జరగకూడదు అని కోరుకున్నాడో అది జరిగిపోయింది. 

టిడిపి - జనసేన పొత్తు కుదిరింది. 

ములాఖాత్ లో భాగంగా రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాల గురించి చర్చించుకున్న తరువాత చంద్రబాబు గారు- పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. 

టిడిపి - జనసేన మధ్య విభేదాలు సృష్టించాలని అనేక రూపాల్లో వైసిపి, పేటీఎం గ్యాంగులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఫేక్ అకౌంట్స్ ద్వారా నాయకుల్ని కించపర్చడం లాంటి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. 

మన నాయకులు, మన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. 

జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు అయ్యింది. ఎల్లుండి జ‌రిగే టిడిపి-జ‌న‌సేన స‌మావేశం అనంత‌రం ఉమ్మడి కార్యాచరణ ప్ర‌క‌టిస్తాం.

ఈ లోపు ఇరు పార్టీలు నిర్వహించే కార్యక్రమాలకు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు విజయవంతం చెయ్యాలి. 

రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ కి వ్యతిరేకంగా టిడిపి - జనసేన కలిసాయి.

  రైతుల్ని వేధిస్తున్న వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు గారు - పవన్ కళ్యాణ్ గారు కలిసారు.  జగన్ పాలనలో బీసీలు, మైనార్టీలు, దళితుల పై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈ పొత్తు ఏర్పడింది.

 కరెంట్ ఛార్జీలు, ఇసుక, పెట్రోల్, డీజిల్, ఇంటి పన్ను, చెత్త పన్ను పేరుతో జగన్ బాదుడే బాదుడు కి వ్యతిరేకంగా చంద్రబాబు గారు - పవన్ కళ్యాణ్ గారు కలిసి పోరాడాలి అని నిర్ణయించుకున్నారు. 

  జగన్ చేసింది ఏమి లేదు, చెప్పుకోవడానికి ఏమి లేదు అందుకే చంద్రబాబు గారు, పవన్ గారి పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు. 

అదే వ్యక్తిగత విమర్శలు మేము చేస్తే మీ పరిస్థితి ఏంటి? మీ ఇంట్లో జరిగిన విషయాలు గురించి మాట్లాడితే మీరు మొఖం ఎక్క‌డ పెట్టుకుంటారు సైకో జ‌గ‌న్ ?

 చంద్ర‌బాబు వ్య‌క్తిగ‌తంగా పోవొద్ద‌ని మ‌మ్మ‌ల్ని హెచ్చ‌రిస్తుండ‌డంతో మేము సంయ‌మ‌నం పాటిస్తున్నాం.

రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. కృష్ణా జలాల్లో వాటా కోల్పోతున్నాం, జగన్ దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. వర్షాలు లేక పంటలు ఎండి పోతున్నాయి. ప్రాజక్టులు అన్ని ఖాళీ అవుతున్నాయి. పంటలు కాపాడాల్సిన జగన్ దోపిడీ లో బిజీగా ఉన్నాడు. 

ఇసుక మొత్తం తమ్ముడికి రాసి ఇచ్చాడు. కల్తీ మద్యం మొత్తం మరో తమ్ముడికి ఇచ్చాడు. మైనింగ్ అంతా బంధువులే, ల్యాండ్ మాఫియా రెచ్చిపోతుంది. ప్రజలు కష్టాల్లో ఉంటే జగన్ అండ్ కంపెనీ రాష్ట్రాన్ని దోచుకునే పనిలో బిజీగా ఉన్నాడు.

విద్యుత్ ఛార్జీల బాదుడుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన మొదటి సీఎం జగన్. ఏడాదికి ప్రజల నుండి అదనంగా 11 వేల కోట్లు దోచుకుంటున్నాడు. 

పేదల్ని దోచుకుంటూ జగన్ పేదలకు - పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్నాడు. 

రూ.550 కోట్లు పెట్టి వైజాగ్‌లో ప్యాలెస్ క‌ట్టాడు. రూ. 25 లక్షల బాత్ టబ్, రూ. 25 లక్షల కమోడ్ ఈయన పేదవాడు అంట. 

 ల‌క్ష రూపాయ‌ల చెప్పులు వేసుకునే సైకో జ‌గ‌న్ పేద‌వాడ‌ట 

 ప‌వ‌ర్ ప్లాంట్లు, ప్యాలెస్‌లు ఉన్న జ‌గ‌న్ పేద‌వాడా? 

జరగబోయేది పేదలకు - దోపిడీ దారులకు మధ్య యుద్ధం.

ప్రతి ఇంటికి వెళ్దాం జగన్ దోపిడీ గురించి వివరిద్దాం. ప్రజా సమస్యల పై పోరాడదాం.

త్వరలోనే భువనమ్మ ``నిజం గెలవాలి`` కార్యక్రమం ప్రారంభం అవుతుంది. 

చంద్రబాబు గారి అరెస్ట్ తో ఆగిన ``బాబు షూరిటీ - భవిష్యత్తుకి గ్యారెంటీ`` కార్యక్రమం నవంబర్ 1 నుండి ప్రారంభిస్తున్నాం.

ఈ కార్య‌క్ర‌మం ద్వారా సూప‌ర్ సిక్స్ హామీలు ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తాం. 

మహాశక్తి పథకం కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకి రూ.1,500 ఇస్తాం. 

తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15,000 ఇస్తాం.

దీపం పధకం కింద ఏడాదికి 3 సిలెండర్లు ఉచితం. ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం. 

అన్నదాత పధకం కింద ఏడాదికి రూ. 20 వేలు సాయం. 

యువగళం కింద 20 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగం వచ్చే వరకూ రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం. 

బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం. 

వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు. 

పేదరికం నుండి బయటకు వచ్చేలా పేదల ఆదాయం పెంచే కార్యక్రమాలు చేస్తాం. 

నిజం గెలవాలి, బాబు షూరిటీ - భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమాలు అందరూ సమిష్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. 

మ‌న‌కి కేవ‌లం 5 నెల‌లే స‌మ‌యం ఉంది. ఇంటింటికీ వెళ‌దాం, ప్ర‌జ‌ల్ని చైత‌న్యం చేద్దాం. 

తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్ర ప్రభుత్వం చేస్తుంది. 

 క్ల‌స్ట‌ర్‌, యూనిట్, బూత్‌... మండ‌ల‌, గ్రామ నాయ‌క‌త్వంలో అక్టోబ‌ర్ 27 నుంచి డ్రాఫ్ట్ ఓట‌ర్ల లిస్టు వ‌స్తుంది. మార్పులు, చేర్పులు చూడాలి. ఒక్క‌ ఓటు పోకూడ‌దు. దొంగ ఓట్ల చేర్పుల‌పై పోరాటం ఆపొద్దు. 

 చంద్ర‌బాబు ఏనాడూ త‌ప్పు చేయ‌రు, లోకేష్ త‌ప్పు చేసినా లోకేష్‌ని జైలుకి పంపించే బాధ్య‌త తీసుకుంటానంటూ గ‌తంలోనే ప్ర‌క‌టించారు. 

 చంద్ర‌బాబుని ఇన్ని ములాఖ‌త్‌ల‌లో క‌లిసినా ఏనాడూ త‌ల‌దించ‌లేదు. నిజాయితీలో ఉండే ధైర్యం అది. త‌న‌ది ప్ర‌జ‌ల కోసం పోరాటం అని ఆపొద్ద‌ని చెప్పారు. 

 శాంతియుతంగా పోరాడాల‌ని చంద్ర‌బాబు సూచించారు. 

 నెల్స‌న్ మండేలాని జైలులో నిర్బంధించారు. అక్క‌డి ప్ర‌జ‌ల‌కి తెలుసు ..ప్ర‌జ‌ల కోసం పోరాడినందుకే మండేలాని అక్ర‌మంగా నిర్బంధించార‌ని. 

 నెల్స‌న్ మండేలాలాగే చంద్ర‌బాబు ఏ త‌ప్పూ చేయ‌ర‌ని జ‌నం న‌మ్ముతున్నారు. బాబు రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జైలు త్వరలోనే ఆయన బయటకి వస్తారు. 


 చంద్ర‌బాబు డ‌బ్బులు సంపాదించాలంటే, రాజ‌కీయాలు చేయ‌క్క‌ర్లేదు. త‌న‌కున్న తెలివితేట‌లు వ్యాపార‌, పారిశ్రామికంగా ఉప‌యోగిస్తే దేశంలో ఏ పారిశ్రామిక‌వేత్తా స‌రిపోనంత సంపాదించ‌గ‌ల‌రు. 

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది. కొవ్వొత్తు పట్టుకున్నా, విజిల్ వేసినా, సంకెళ్లు వేసుకున్నా కేసు పెడుతున్నారు. 

 రాజ‌శేఖ‌ర్ రెడ్డితో టిడిపి రాజ‌కీయంగా విభేదించింది, కానీ ఆయ‌న కొడుకు అంత ఘోరంగా లేడు

 సైకో జ‌గ‌న్ ఈ రోజు మా కుటుంబాన్ని ఇబ్బందుల పాలుజేశాడు. 

 ఇదే దుస్థితి ప్ర‌తి కుటుంబానికీ వ‌స్తుంది...సైకో జ‌గ‌న్ రాష్ట్ర‌మంతా ధ్వంసం చేస్తాడు. పోరాడే వాళ్ల‌ను, ప్ర‌శ్నించే వాళ్ల‌నూ జైల్లో వేస్తాడు

 టిడిపి-జ‌న‌సేన పోరాడ‌క‌పోతే ...రాష్ట్రాన్ని ముక్కలు ముక్క‌లుగా న‌రికి వైసీపీ నేత‌ల‌కి ఇచ్చేస్తాడు.

 సైకో జ‌గ‌న్ పాల‌న‌పై  ప్ర‌జ‌ల్లో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఉంది. ప్ర‌జ‌ల్లోకి వెళ‌దాం, ప్ర‌జాచైత‌న్యం తీసుకొద్దాం.. 

 త్వ‌ర‌లో నా యువ‌గ‌ళం కూడా ప్రారంభం అవుతుంది. 

 టిడిపి-జ‌న‌సేన క‌లిసి 175 సీట్ల‌కి 160 సీట్లు గెలుస్తాం..

ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గకుండా బాబుతో నేను అంటున్న ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.

Comments