జనసేన ద్వారానే రాష్ట్ర భవిష్యత్.

 ___ జనసేన ద్వారానే రాష్ట్ర భవిష్యత్



___ గంజాయి, భూకబ్జాలకు అడ్డాగా కాకినాడ

___ టీడీపీ- జనసేన కలిసే ప్రచారం

___ జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల

   కాకినాడ, అక్టోబర్ 19 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే భవిష్యత్ ఎంతగానో అభివృద్ధి చెందుతుందని లేనిపక్షంలో రాష్ట్ర ఆర్థిక స్థితితో పాటు ప్రజలకు నష్టం కలుగుతుందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అలాగే ఎంతో సుందరమైన కాకినాడ నగరంలో నేడు గంజాయి, భూకబ్జా వంటి అక్రమాలకు వైకాపా పాలనలో కాకినాడ అడ్డాగా చెప్పారు.    

  గురువారం కాకినాడలోని సూర్య కళామందిరంలో కాకినాడ నగర కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం పార్టీ నగర అధ్యక్షుడు తోట సుధీర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా తోట సుధీర్ మాట్లాడుతూ కాకినాడ నగరంలో జనసేన - టీడీపీ కలిసి సంయుక్త ప్రచారం నిర్వహిస్తామని దీనిని ఇరు పార్టీల పరస్పర సహకరించాలని కోరారు. జనసేనాని పవన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తుందని జనసేన అధికారంలోకి వస్తే ముఖ్యంగా విద్య,  వైద్య వసతులు మెరుగుపడతాయని సుధీర్ చెప్పారు. 

  ముఖ్యఅతిథి పీఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కాకినాడ నగరంలో దారుణమైన పాలన ఉందని ఇక్కడ ఉన్న పాలకులు అభివృద్ధి చేయకపోగా కాకినాడను మురికివాడగా మార్చారన్నారు. అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయకుండా చెత్త పన్ను వేసి చెత్త కూడా తీయట్లేదన్నారు. రాష్ట్రంతో పాటు కాకినాడలో కూడా ప్రజలను ఇబ్బంది పెడుతూ వైకాపా పాలన సాగిస్తున్నారన్నారు. విద్యుత్, ఇంటి పన్ను ఇతర వస్తువుల ధరలు పెంచారని ఇవన్నీ జనసేన అధికారంలోకి వస్తే తగ్గుతాయన్నారు. కాకినాడ సెజ్ను బంగాళా ఖాతంలో కలిపేద్దాం అని నాటి సీఎం జగన్ అన్నారని ఇప్పుడు దాన్ని లో భూములను పరిశ్రమను అమ్ముకుంటున్నట్లు చెప్పారు. జగనన్న కోలనీ పేరుతో చాలామంది లబ్ధిదారులను మోసం చేశారని అలాగే పథకాలు కూడా కొందరికే అందుతున్నాయన్నారు. కాకినాడ నగరంలో జనసేనాని పవన్ మత్స్యకారులకు, రెల్లి సామాజిక వర్గాలకు అనేక కార్యక్రమాలు చేపట్టి వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపారన్నారు. కాకినాడ నగరంలో పోర్టు, పరిశ్రమలు అభివృద్ధి చెందకపోగా అవి కూచించుకుపోయాయని నాదెండ్ల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ-జనసేనలు  కలిసి పోటీ చేస్తాయని దీనికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కొన్నిచోట్ల త్యాగాలు కూడా చేయాలని చెప్పారు. 2024 రాష్ట్రంలో జనసేన- టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మనోహర్ పేర్కొన్నారు. అనంతరం జనసేన పార్టీలో పలువురు చేరారు.     

  ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ముత్తా శశిధర్, కందుల దుర్గేష్, పితాని బాలకృష్ణ, తుమ్మల బాబు, శెట్టిబత్తుల రాజబాబు , వేగుళ్ల లీలా కృష్ణ,  తంగెళ్ల శ్రీనివాస్, సుంకర కృష్ణవేణి, పోలసపల్లి సరోజ, పాఠంశెట్టి సూర్య చంద,  బత్తుల బలరామకృష్ణ, పరుపుల తమ్మయ్య బాబు తదితరులు పాల్గొన్నారు.

Comments