ప్రతి సంక్షేమ కార్యక్రమం..ప్రజల అభివృద్ధి కోసమే : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.



ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా (ప్రజా అమరావతి);


ప్రతి సంక్షేమ కార్యక్రమం..ప్రజల అభివృద్ధి కోసమే : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.


టిడ్కో గృహాలు కట్టింది మేమే..ప్రజలకు ఇచ్చింది మేమే.


ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ ఇచ్చిన తరహాలో గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల పనులు మొదలుపెట్టింది.


రాష్ట్రవ్యాప్తంగా కేటాయింపులు, కాంట్రాక్టర్ల చెల్లింపులు, చేపట్టిన పనులు కేవలం 10శాతమే.


టిడ్కో గృహ నిర్మాణాలపై మన ప్రభుత్వం రాగానే లోతుగా అధ్యయనం చేసింది.


ఉత్తరప్రదేశ్ లోని లక్నో, తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన గృహ నిర్మాణాలను పరిశీలించాం.


ఎక్కువ ధరకు టెండర్లు వేయడం గమనించి రివర్స్ టెండరింగ్ పద్ధతి ద్వారా వందల కోట్లు ప్రజాధనం వృథా కాకుండా ఆపాం.


యువతకు నైపుణ్య, శిక్షణ కార్యక్రమంలో చేసిన స్కాం వల్ల ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.


అన్యాయం, అధర్మమని సోషల్ మీడియాలో అతి ప్రచారమే తప్ప ప్రజా స్పందన కరవైంది.


ఫైబర్ నెట్, టిడ్కో, స్కిల్ ట్రైనింగ్, రాజధాని భూములు సహా గత ప్రభుత్వంలో ప్రతీది స్కామే అని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు.


ఇక్కడ స్పందనలేదని అమెరికా, సెంట్ ఫ్రాన్సిస్ కో, దల్లాస్, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో ధర్నాలు చేస్తున్నట్లు పబ్లిసిటీ చేసుకుంటున్నారు.


20 మంది జనంతో ఎక్కడెక్కడో ధర్నాలు చేస్తే అది ధర్నా? ధర్మ పోరాటమా?.


చంద్రబాబు ప్రభుత్వం చేసింది స్కాం, ప్రజలకు జరిగింది అన్యాయమని తేటతెల్లమైంది.


నిత్యావసర ధరలు కూడా ఏపీలోనే పెరిగినట్లు టీడీపీ నాయకులు అమాయక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు*


నాడు-నేడు ద్వారా రాష్ట్రంలోని పాఠశాలల రూపు రేఖలు మారాయి.


ఆసరా,చేయూత, చేదోడు సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజాభివృద్ధి కార్యక్రమాలే.


నంద్యాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశాం.


దశాబ్దాలుగా ఈ ప్రాంతం వాసుల కోరికను నంద్యాలను జిల్లా చేసి నిజం చేశాం.


కోర్టు అనుమతులతో కర్నూలు జిల్లాలో హైకోర్టు కట్టాలనుకోవడం అభివృద్ధి కార్యక్రమం కాదా?.


నంద్యాల-హైదరాబాద్ , నంద్యాల నుంచి మద్రాసుకు జాతీయ రహదారి ఏర్పాటుకు కృషి.


ఆళ్లగడ్డలో డిగ్రీ కాలేజీ, ఇండోర్ స్టేడియం, అహోబిలానికి మంచి రహదారి నిర్మాణం అభివృద్ధి కాక మరేమిటి?.


సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రతి పేదవారికీ కులమతాలు లేకుండా సంక్షేమం అందించాం.


పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి వంటి మంచి వ్యక్తిత్వమున్న నాయకులను గెలిపించుకోవాలి.


టీడీపీ పార్టీ, ప్రతిపక్ష నాయకుడి మనస్తత్వం తెలిసేలా స్థానిక ఎమ్మెల్యే బిజేంద్ర రెడ్డి చెప్పిన 'సూది' కథకు ఆర్థిక మంత్రి ప్రశంసలు.


తన దగ్గరకు వచ్చిన ప్రతిసారీ తన నియోజకవర్గం, ప్రజల గురించి మినహా వ్యక్తిగతంగా పని చేయమని ఇంతవరకూ ఎమ్మెల్యే బిజేంద్ర రెడ్డి కోరలేదు.


నంద్యాల జిల్లా ఇన్చార్జ్ మంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలానీ సమూన్, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ప్రభుత్వ సలహాదారు గంగుల ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బ్రిజేంద్రనాధ్ ర్రెడ్డి తదితరులు.



Comments