జగనాసుర చీకటి పాలనకు నిరసనగా టీడీపీ శ్రేణులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన.

 *మంగళగిరి పట్టణం అంబేడ్కర్ విగ్రహాం వద్ద   ‘కళ్లు తెరిపిద్దాం’ నిరసన కార్యక్రమం*


*‘జగనాసుర చీకటి పాలనకు నిరసనగా టీడీపీ శ్రేణులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన


*


మంగళగిరి టౌన్, అక్టోబర్ 28 (ప్రజా అమరావతి):  టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ నిర్భంధాన్ని నిరసిస్తూ మంగళగిరి పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహాం వద్ద టీడీపీ శ్రేణులు ‘కళ్లు తెరిపిద్దాం’ నిరసన కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. రాత్రి 7 నుంచి 7.05 గంటల వరకూ  ‘జగనాసుర చీకటి పాలనకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. సీఎం ఇప్పటికైనా కళ్ళు తెరవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న జగనాసురుడికి కళ్లు తెరిపించడానికే నిరసన  కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అక్రమ కేసులో చంద్రబాబు పాత్ర ఎక్కడ లేకపోయినా అరెస్టు చేశారన్నారు. రాజకీయ మనుగడ కోసం అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును అరెస్టు చేయడం సిగ్గు చేటని అన్నారు. అక్రమంగా అరెస్టు చేసి ఇన్ని రోజులవుతున్నా.. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని కూడా కోర్టుకు సమర్పించలేకపోయిందని విమర్శించారు. ఇది చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేసే ప్రయత్నం తప్ప వేరొకటి కాదని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వాయిదాలు అడుగుతూ చంద్రబాబు రిమాండు కొనసాగిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా  సంక్షేమం కోసం అహర్నిశలు తపించిన చంద్రబాబు ఆరోగ్యం, భద్రత గురించి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు వైకాపాను బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు.

Comments