సిఎస్ జవహర్ రెడ్డి తో భేటీ అయిన నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం.
విజయవాడ,27 అక్టోబరు (ప్రజా అమరావతి): వికసిత్ భారత్-2047 లో భాగంగా ఎపి స్టేట్ విజన్ ప్లాన్ 2047 రూపకల్పనకై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు అమరావతి రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో వర్కు షాపు నిర్వహించడం జరిగింది. ఈవర్కు షాపు విజయవంతం గా ముగిసిన సందర్భంగా శుక్రవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డితో కొద్ది సేపు సమావేశమై వర్కు షాపులో చర్చించి న వివిధ అంశాల గురించి వివరించారు. ఈసందర్భంగా సిఎస్ డా.జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి విజన్ 2047 డాక్యుమెంట్ ను రూపొందించడంతో పాటు దాని అమలుకు తగిన నిధులు సమకూర్చేందుకు కూడా నీతి ఆయోగ్ తగిన సిఫార్సులు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ వర్కు షాపులో రాష్ట్ర,జిల్లా స్థాయి అధికారుల నుండి ఆయా శాఖలకు నుండి వచ్చిన ముఖ్యాంశాలను నీతి ఆయోగ్ ప్రత్యేక డాక్యుమెంట్ రూపొందించాలని సిఎస్ చెప్పారు.
నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధ మాట్లాడుతూ మూడు రోజుల వర్కు షాపులో పలు శాఖలకు సంబంధించి వివిధ అంశాలు చర్చకు వచ్చాయని చెప్పారు. ఎపి విజన్ ప్లాన్ 2047 రూపకల్పనకు క్షేత్ర స్థాయి అధికారుల నుండి మంచి సూచనలు,సలహాలు, సమాచారం సేకరించినట్లు వివరించారు.మొత్తం మీద ఈవర్కు షాపు పూర్తి విజయవంతం అయినందుకు ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈసమావేశంలో రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి గిరిజా శంకర్,నీతి ఆయోగ్ డిజి(డిఎంఇఓ)సంజయ్ కుమార్,అడ్వయిజర్(పిపిపి) సిహెచ్.పార్థసారధి రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ బి.నాందే, బిసిజి డెలిగేట్స్ అంకుశ్ వాధేరా,అభిషేక్ గుప్త,కేశవ్ దామని,శ్రీ వల్లి,అగర్వాల్ తోపాటు రాష్ట్ర ప్రణాళికా శాఖ అధికారులు పాల్గొన్నారు.
అనంతరం వర్కు షాపును విజయవంతం చేసినందుకు నీతి ఆయోగ్ ప్రతినిధులు, బిసిజి ప్రతినిధులను సిఎస్ జవహర్ రెడ్డి దుశ్శాలువ, జ్ణాపికలతో సత్కరించారు.
addComments
Post a Comment