అవినీతికి పాల్పడ్డారని ఒక్క ఆధారమైనా చూపగలిగారా?



*చంద్రబాబునాయుడుపై జగన్ వ్యక్తిగత కక్షసాధింపు!*

*వ్యవస్థలను మేనేజ్ చేసి 50రోజులుగా జైల్లో పెట్టారు*

*అవినీతికి పాల్పడ్డారని ఒక్క ఆధారమైనా చూపగలిగారా?


*

*కంటిడాక్టర్ పై వత్తిడి తెచ్చి 24గంటల్లో రిపోర్టు మార్చేశారు*

*వ్యవస్థలను మేనేజ్ చేయకపోతే ఇదంతా ఎలా సాధ్యం?*

*ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదు...వారి పరీక్షలకు అంగీకరించం*

*అవినీతి చేసి, బాబాయిని చంపినోళ్లు బయట తిరగుతున్నారు*

*ఏ తప్పూ చేయని చంద్రబాబునాయుడును జైలులో పెట్టారు*

*బస్సు యాత్రపేరుతో గాలితిరుగుడు...ప్రజా సమస్యలు గాలికి*

*ములాఖత్ అనంతరం విలేకరులతో యువనేత నారా లోకేష్*

రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): చంద్రబాబునాయుడును జైలులో బంధించి 50రోజులైంది. ఏ తప్పు చేయకపోయినా వ్యవస్థలను మేనేజ్ చేసి ఆయనను ప్రజలమధ్యకు రాకుండా చేశారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తంచేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబునాయుడుతో ములాఖత్ అనంతరం యువనేత లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ... గతంలో రాజకీయ కక్షసాధింపు చూశాం, ఇప్పుడు వ్యక్తిగత కక్షసాధింపులు ఇప్పుడు చూస్తున్నాం. వ్యక్తిగతకక్షతో జగన్ తోపాటు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు చంద్రబాబును చంపేస్తామని చెప్పడం ఎపి ప్రజలు చూస్తున్నారు. అనంతపురంలో ఎంపి స్టేట్మెంట్ చూశాం, జైలులోనే చనిపోతారని చెబుతున్నారు. కేసుకు ఎలాంటి సంబంధం లేని మా తల్లిని జైలుకు పంపుతామని మహిళామంత్రి స్టేట్ మెంట్ ఇచ్చారు. వారి స్టేట్ మెంట్లను చూశాక చంద్రబాబు భద్రతపై మాకు సందేహాలు ఉన్నాయి. గత 50రోజులుగా ఒక్క ఆధారమైన ప్రభుత్వం బయటపెట్టిందా? ఇదంతా వ్యవస్థల మేనేజ్ మెంట్ గాక మరేమిటి? ప్రభుత్వం చంద్రబాబుగారిని జైలులో ఉంచడానికి పదేసి కోట్లు లాయర్లకు ఖర్చు పెడుతోంది. ముకుల్ రోహత్గీతో వారంవారం వాయిదాలు అడుగుతూ బెయిల్ రాకుండా జాప్యం చేస్తున్నారు,  ప్రభుత్వంలో పిపిలు, ఎజిపిలుగా పనిచేసిన వారు జగన్ కేసులు వింటున్నారు, మాకు సందేహాలు ఉన్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో గరిష్టంగా ఒక వ్యక్తి 38రోజులు రిమాండ్ లో ఉన్నారు, ఏ ఆధారం లేకుండా చంద్రబాబునాయుడును 50రోజులుగా రిమాండ్ లో ఉంచడం వ్యవస్థల మేనేజ్ మెంట్ కాదా?

*దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండి!*

ఈ ప్రభుత్వానికి చాలెంజ్ చేస్తున్నాం, దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండి. అన్నింటికీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. 50రోజులుగా మీరు పీకింది ఏమిటి? స్కిల్ డెవలప్ మెంట్, ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డులో ఒక కొత్త ఆధారమైనా బయటపెట్టారా? స్కిల్ డెవలప్ మెంట్ చైర్మన్ అజయ్ రెడ్డి అన్ని సెంటర్లు నడుస్తున్నాయని చెప్పారు. మొదటినుంచి మేం చంద్రబాబు ఏ తప్పు చేయలేదనే చెబుతున్నాం. మా అకౌంట్లు కూడా ప్రజల మధ్య పెట్టాం, 50రోజులుగా ఏంపీకారని ప్రశ్నిస్తున్నాం. వ్యవస్థలను మేనేజ్ చేసి 15ఏళ్లు సిఎంగా, 15ఏళ్లు ప్రతిపక్షనేతగా పనిచేసిన వ్యక్తిని జైలులో బంధించడం అన్యాయం. మా తల్లి నిజం గెలవాలని ప్రజల్లోకి వెళితే మా తల్లిని కూడా జైలుకు పంపాతామని అనడం వ్యక్తిగత కక్షసాధింపు కాకపోతే మరేమిటి? మాకు గానీ, కుటుంబసభ్యులకు స్కిల్ డెవలప్ మెంట్ లో ఎలాంటి పాత్రలేదు, చంద్రబాబు ఎలాంటి అవినీతి చేయలేదు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో 2.13లక్షలమందికి శిక్షణ ఇచ్చింది నిజం, 85వేలమందికి ఉద్యోగాలు ఫైబర్ గ్రిడ్ లో 10లక్షల కనెక్షన్లు ఇచ్చింది నిజం, ఏటా వందకోట్ల టర్నోవర్ చేసే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ఏర్పాటు నిజం. నాలుగేళ్లలో ఒక్కసారి ఐటి రిటర్న్స్ స్క్రూటినీ జరగలేదు, మేం నిజాయితీగా ఉన్నాం. 

*న్యాయపోరాటం కొనసాగిస్తాం*

వ్యవస్థలను మేనేజ్ చేసే మా నాయకుడ్ని బంధిస్తే ఊరుకోం, న్యాయపోరాటం చేస్తాం.  17ఎ పై జడ్జిమెంట్ రిజర్వ్ అయింది ఉంది. రాబోయే రెండువారాల్లో 17ఎపై జడ్జిమెంట్ వస్తుంది, అందుకోసం వేచిచూస్తున్నాం. వ్యవస్థలను మేనేజ్ చేశారుకనుకే చంద్రబాబు జైలులో ఉన్నారు, నేను సూటిగా అడుగుడున్నా, మేనేజ్ చేయకపోతే పదేళ్లుగా లక్షకోట్ల అవినీతి చేసిన జగన్ పదేళ్లుగా బెయిల్ పై ఎలా బయట ఉన్నారు, బాబాయి హత్యకేసులో అవినాష్ ఎలా బయట తిరుగుతన్నారు, సిబిఐ అరెస్టు చేయడానికి వస్తే ఎందుకు అడ్డుకున్నారు? తప్పులు చేసిన, అవినీతినిచేసిన వ్యక్తి రోడ్లపై హాయిగా తిరుగుతాడు, బాబాయిని గొడ్డలితో చంపిన వ్యక్తి రోడ్లపై తిరుగుతాడు, మైనింగ్ దోచేసిన పాపాల పెద్దిరెడ్డి వ్యక్తి బయట ధైర్యంగా తిరుగుతారు, ఇదంతా వ్యవస్థలను మేనేజ్ చేయడం గాక మరేమిటి?

*కంటిడాక్టర్ రిపోర్టు ఎలా మారిపోయింది?*

బాబుగారికి నెలలోగా ఆపరేషన్ చేయాలని ఒక రిపోర్టులో ఉంది, అదే అప్తాల్మాలిజిస్ట్ తొందరేం లేదని మరో రిపోర్టులో ఉంది. 24గంటల్లో ఆప్తాల్మాలజిస్ట్ ఎలా మనసు మార్చుకున్నారు? వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారనడానికి ఇంకా ఎన్ని ఆధారాలు కావాలి? ఈ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయాం, పరీక్షలపేరుతో ఏం చేస్తుందోనన్న భయం మాలో ఉంది. దక్షిణ భారతదేశంలో ఎన్ఎస్ జి రక్షణలో ఉన్నఒకే ఒక వ్యక్తి చంద్రబాబునాయుడు, ప్రతిపక్షంలో ఉన్నాఆయనకు కేంద్రం ఆయనకు రక్షణ కల్పించింది. చంద్రబాబును చంపుతామని మావోయిస్టులు లేఖ రాశారు, జైలులో డ్రోన్లు ఎగురుతున్నాయి, గంజాయి సరఫరా జరుగుతోంది, ఇంత జరుగుతుంటే భద్రతపై సందేహం ఉండదా? డిఐజి, డిజి, హోంమంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నా, బాబుగారి విజువల్స్ ఎలా బయటకు వచ్చాయి? దానికి సమాధానం చెప్పమనండి. సీల్డ్ కవర్ ప్రజల్లో పెట్టమనండి.

*అంతా ప్యాలెస్ బ్రోకర్ సజ్జల నేతృత్వంలోనే!*

ప్యాలెస్ బ్రోకర్ నాయకత్వంలోనే అంతా జరుగుతోంది. ఆయన డిజి, డిఐజిలకు ఎలా సమీక్ష చేస్తారు, అందుకే మేం కాల్ డేటా అడుగుత్నo, తప్పు చేయకపోతే కాల్ డేట్ ఇవ్వడానికి ఎందుకు భయం? ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలిసిపోతుందని భయమా? చంద్రబాబు 6కిలోలు బరువుతగ్గిన మాట వాస్తవం, 72 ఉండేవారు, 66కిలోలకు తగ్గారు, ఆయన రెగ్యులర్ గా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటారు,  ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉన్న మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు నంద్యాలలో ప్రజలమధ్య భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఉంటే ఈ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసింది. జైలు అధికారులకు స్వేచ్చ ఉన్నట్లుగా కన్పించడం లేదు, మేం ములాఖత్ కు వెళ్లాక అధికారికి పదిసార్లు ఫోన్లు వచ్చాయి. ఈ ప్రభుత్వ పర్యవేక్షణలో మేం వైద్య పరీక్షలకు సిద్ధంగా లేము, మాకు నమ్మకం లేదు. సొంత బాబాయిని చంపినోడు, చెల్లిన మెడబట్టి బయటకు గెంటేసినవాడు ఈ ముఖ్యమంత్రి, ఆయనను ఎలా నమ్ముతాం?

*గాలియాత్రలు కాదు, ప్రజల గురించి ఆలోచించండి!*

రాష్ట్రంలో 32లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది, కరువు నెలకొంది, పంట ఎండిపోయింది, సిఎం ఒక్క సమీక్ష చేయరు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లరు. బస్సు యాత్ర అని గాలితిరుగుడు తిరుగుతున్నారు, ఎందుకు ప్రజలకోసం ఎందుకు ఆలోచించరు? మరోవైపు యువత ఉద్యోగాల్లేక ఇబ్బంది పడుతున్నారు, నిత్యావసర వస్తువుల ధరల గురించి పట్టించుకోరు. నిన్నగాక మొన్న ఆర్టీసి బస్సు వైసిపి నాయకుడికి దారి ఇవ్వలేదని డ్రైవర్ ను నడివీధిలో దాడిచేస్తే ప్రభుత్వం చర్య తీసుకోలేదు. టిడిపి నాయకులపై తప్పుడుకేసులు పెట్టి వేధిస్తున్నారు. దళితులను చంపేస్తున్నారు, ఇవన్నీ ఎవరూ మాట్లాడకూడదు, వారు చెప్పినట్లు వింటేనే బతకనిస్తాం అనేలా ఉంది.

*ఏ ముఖం పెట్టుకొని బస్సు యాత్ర చేస్తారు?*

ఏ ముఖం పెట్టుకుని వైసిపి నాయకులు సామాజిక బస్సు యాత్ర చేస్తారు? డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేసి, గుండెపోటు వచ్చేలా చేసింది ఎవరు? దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కొట్టి చంపిన అనంతబాబు జగన్ పక్కన కూర్చుంటున్నాడు, ఇదా దళితులకు చేసే న్యాయం?  దళితులకు రావాల్సిన 27సేంక్షేమ పథకాలు రద్దుచేయడమే సామాజిక న్యాయమా? వైసిపి నేతల వేధింపులు తట్టుకోలేక మైనారిటీలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది, పలమనేరులో మిస్బాకు టిసి ఇచ్చి పంపించడంతో అవమానంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అమర్ నాథ్ గౌడ్ తన అక్కను వేధిస్తున్నాడని వైసిపి నేతను కొడుకును అడిగినందుకు పెట్రోల్ పోసి తగులబెట్టారు, ఇదేనా బిసిలకు చేస్తున్న న్యాయం? స్థానిక ఎన్నికల్లో 10శాతం తగ్గించడమే న్యాయమా? ఎసి బస్సుల్లో తిరిగితే అన్యాయం న్యాయం కాదు, నేను చెప్పింది 1శాతమే ఇంకా 99శాతం ఉన్నాయి, అందుకే నల్లబెలూన్లతో నిరసన తెలుపుతున్నాం.

*ఇసుక అవినీతిపై సివిసికి త్వరలో లేఖ*

జగన్ లా మేం పారిపోం, ఆయన ఏనాడైనా ప్రెస్ మీట్ పెట్టారా? వైసిపి నాయకులు, జగన్, ఆయన బ్రోకర్లు, చుట్టుపక్కల ఉన్నవారు జగన్ అవినీతిపరుడు కాదని ఎప్పుడైనా చెప్పారా? వ్యవస్థలను మేనేజ్ చేసి పదేళ్లుగా బెయిల్ పై తిరుగుతున్నారు, ఆ స్థాయిలో మేనేజ్ చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల అవకతవకలపై ఈడి, ఐటిలకు లేఖలు రాశాను, సిఎజికి రాశాను, ఇసుకపై సివిసికి లేఖ రాయబోతున్నాం. కేంద్రానికి కూడా రాస్తున్నాం. నెల్లూరులో అవినీతిని ప్రశ్నిస్తున్న వారి పార్టీ ఎమ్మెల్యేలనే ఈ ప్రభుత్వం బంధిస్తోంది, వారి పార్టీ ఎమ్మెల్యేలే అవినీతి జరుగుతోందని చెబుతున్నారు, ఇంకేం ఆధారాలు కావాలి? స్కిల్ డెవలప్ మెంట్ లో నేను సిఐడి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను, నేను ఎక్కడికి పారిపోలేదు.  సమాజానికి జగన్ ఏంచేశారు? చంద్రబాబు సైబరాబాద్ తయారుచేశారు, కియా, టిసిఎల్, హెచ్ సిఎల్, ఫ్యాక్స్ కాన్, జోహో వంటి పరిశ్రమలు తెచ్చి లక్షలాదిమందికి ఉద్యోగాలు కల్పించారు.


Comments