జిల్లాలో సహాయ ప్రజా సంబంధాల అధికారిగా ఉత్తమ సేవలందించిన


కాకినాడ, అక్టోబర్ 10 (ప్రజా అమరావతి);గత మూడు సంవత్సరాలగా కాకినాడలోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో సహాయ ప్రజా సంబంధాల అధికారిగా పనిచేసిన కొలుపూరి రవి ఎన్టీఆర్ జిల్లా డివిజనల్ పీఆర్ఓగా పదోన్నతి పొందిన సందర్భంగా మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా


కలెక్టర్ డా.కృతికా శుక్లా.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి సత్కరించారు. జిల్లాలో సహాయ ప్రజా సంబంధాల అధికారిగా ఉత్తమ సేవలందించారని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయనను ప్రత్యేకంగా అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా సమాచార పౌర సంబంధాలు శాఖ జిల్లా ప్రజా సంబంధాల అధికారి డీ.నాగర్జున, జేఆర్ఈ సీ.బాబురావు, ఇతర సమాచారం శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments