పునాది దశ విద్యను బలోపేతం చేయాలి.

 



*పునాది దశ విద్యను బలోపేతం చేయాలి


*

సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు  గారు

‘జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికేట్ కోర్స్’ రాష్ట్ర స్థాయి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం.

రాష్ట్రంలో 8 చోట్ల శిక్షణ.


విశాఖపట్నం  (ప్రజా అమరావతి): 

రాష్ట్రంలో విద్యా స్థాయిని పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు గారు అన్నారు.  విశాఖపట్నంలోని మిలీనియం స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ లో జరిగిన ‘జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికేట్ కోర్స్’ డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ (DRP) శిక్షణ కార్యక్రమాన్ని  ప్రారంభించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 8 చోట్ల (విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, అగిరపల్లి, ఒంగోలు, కడప, తిరుపతి, అనంతపురం)జరుగుతుంది.  విశాఖపట్నంలో ప్రారంభ కార్యక్రమానికి ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఎస్పీడీ ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ)  ప్రాముఖ్యతను,  సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ (SALT) వివరిస్తూ.. రాష్ట్రంలో పునాది దశ విద్యను బలోపేతం చేయడానికి మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ సమన్వయంతో కలిసి పని చేయాలని ఉద్బోధించారు. తద్వారా పిల్లలకు మంచి భవిష్యత్తును అందిచగలమన్నారు. పిల్లల విద్యాభ్యాసంలో తల్లిదండ్రుల పాత్ర ఎంత ముఖ్యమని, వారితో సమావేశాలు ఏర్పాటు చేసి తెలియజేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదని కోరారు. 

అనంతరం సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్' (SALT) కార్యక్రమాన్ని సమగ్ర శిక్ష నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఎలిమెంటరీ, సెకండరీ విద్యలో పునాది అభ్యసనం యొక్క నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టిసారించడం జరుగుతుందన్నారు.  ప్రభుత్వం అమలు చేసే ఈ కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు నిధులను అందిస్తుందన్నారు.  ఆంధ్రప్రదేశ్ లోనీ విద్యార్థుల అభ్యసనా నాణ్యతను మెరుగుపరచడమే ఈ కార్యక్రమ దీర్ఘకాల లక్ష్యమని పేర్కొన్నారు.  SALT కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయుల -విద్యార్థుల మధ్య పరస్పర సంబంధాలు, నాణ్యతను మెరుగుపరచడం ద్వారా ప్రాథమిక ఫలితాలను నిలపడమే కాకుండా ప్రస్తుతం ఉన్న అభ్యసనా లోపాన్ని పరిష్కరించవచ్చన్నారు. 

రాష్ట్ర స్థాయి, పాఠశాల స్థాయిలో చేసే అంచనాల ఆధారంగా పిల్లల్లో విద్యానైపుణ్యాలు పెంపొందించడానికి అవసరమైన బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఉపాధ్యాయులకు తగిన అవకాశాలు కల్పించడం ద్వారా ఆశించిన ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 3 నుండి 8 సంవత్సరాల పిల్లల్లో  (అంగన్వాడీలు, 1,2 తరగతులు) ప్రాథమిక విద్యను మెరుగుపరచే విద్యాకార్యక్రమాలు, ఆవిష్కణలు చేసేందుకు సమగ్ర శిక్షకు ‘ప్రథమ్’ సాంకేతిక సహకారం అందిస్తుందన్నారు. పూర్వప్రాథమిక విద్య, అంగన్వాడీ కార్యకర్తలు, 1, 2 తరగతుల ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంపొందించడం, రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో మోడల్ అంగన్వాడీ కేంద్రాలను, ప్రాథమిక పాఠశాలలను అభివృద్ధి చేయడం కార్యక్రమంలో భాగమని అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఆర్జేడీ జ్యోతికుమారి, మహిళా శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వరి, జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ, సమగ్ర శిక్ష ఏపీసీ శ్రీనివాసరావు, డైట్ ప్రిన్సిపల్ సుధాకర్, ప్రథమ్ ప్రతినిధి కె.సురేష్, ప్రొగ్రాం కో ఆర్డినేటర్ మహేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments