జనసేన-టిడిపి ప్రభుత్వమే వైసిపి అరాచకానికి విరుగుడు.



*జనసేన-టిడిపి ప్రభుత్వమే వైసిపి అరాచకానికి విరుగుడు*


*ఉమ్మడి ప్రణాళికపైనే జెఎసి సమావేశంలో ప్రధాన దృష్టి*

*వైసిపి అరాచకం, దారుణాలు, దోపిడీ విధానాలకే వ్యతిరేకం*

*ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనీయం*

*చంద్రబాబుకు నైతిక మద్దతు, ప్రజలకు భరోసా కోసమే భేటీ*

*వారం, పదిరోజుల్లో ఉమ్మడి కార్యాచరణతో ప్రజలముందుకు*

*జెఎసి సమావేశం అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్*

రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): ఉమ్మడి కార్యాచరణలో భాగంగా తొలివిడత జనసేన-తెలుగుదేశం కార్యకర్తలు ఉమ్మడిగా కార్యక్రమాలు చేస్తాం, జెఎసి సమావేశంలో ఉమ్మడిప్రణాళికపై దృష్టిసారించాం, రాష్ట్రభవిష్యత్తుపైనే నిర్ణయం తీసుకున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజమండ్రిలో జరిగిన జెఎసి సమావేశం అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ప్రజలకు ముందు కావాల్సింది భద్రత, సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్రంలో సుస్థిరమైన పాలన అందించడంపైనే చర్చలుజరిపాం, పదవులు విషయం తర్వాత మాట్లాడతాం. మేం కొట్టుకోం, మా మధ్య గొడవలు రావు, రానీయం. వైసిపి వాళ్లు కొట్టుకుంటారు. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ఖరారయ్యాక వారం, 10రోజుల్లో ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఎపిలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. జనసేన ప్రయారిటీ ఎపి ప్రజలు, బిజెపి నాయకత్వం ఇక్కడి పరిస్థితులు అర్థం చేసుకుంది, మాతో కలసిరావడానికకి వారు కూడా సానుకూలంగా ఉన్నారు.

*జనసేన-టిడిపి ప్రభుత్వమే అరాచకానికి విరుగుడు*

రాష్ట్రానికి వైసిపి అనే తెగులు పట్టుకుంది. జనసేన-టిడిపి కలయికే ఈ తెగులుకు సరైన మందు. ఆంధ్రప్రదేశ్ భవితకోసం చారిత్రాత్మక సమావేశం నిర్వహించుకున్నాం. రాజమండ్రి సెంట్రల్ జైలులో అక్రమంగా, అరాచకంగా 70ఏళ్లపైబడిన సీనియర్ నేతను నిర్బంధించి, టెక్నికల్ ఇష్యూతో బెయిల్ రాకుండా చేయడం బాధాకరం. రేపల్లెలో అత్యంత దారుణంగా 14ఏళ్లకుర్రాడిని చంపిన వ్యక్తికి కూడా బెయిల్ వచ్చింది, చంద్రబాబు బెయిల్ ను మాత్రం రాష్ట్రప్రభుత్వం సాంకేతిక కారణాలతో అడ్డుకుంటోంది. రాష్ట్రంలో అరాచకానికి అడ్డుకట్ట వేయాలంటే జనసేన- టిడిపి ప్రభుత్వం రావడమే విరుగుడు. అన్యాయంగా జైలులో ఉంచిన చంద్రబాబుక నైతిక మద్దతు కోసం, వారికి ధైర్యమిచ్చేలా, రాష్ట్రప్రజలకు భరోసా ఇవ్వడానికి రాజమండ్రిలో సమావేశం నిర్వహించాం.

*రాష్ట్రంలో అరాచక విధానాలు కొనసాగుతున్నాయి*

 రాష్ట్రంలో ప్రజలను బెదిరింపులకు గురిచేసే అరాచకవిధానాలు కొనసాగుతున్నాయి. సిపిఎం,సిపిఐ, బిజెపిలతో సహా అందరిపై దాడిచేశారు. ప్రతిపక్షనేత చంద్రబాబునుంచి అచ్చెన్నాయుడు వరకు అరాచకం కొనసాగుతున్న నేపథ్యంలో అస్థిరతకు గురైన ఎపికి సుస్థిరత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వకూడదన్నదే మా లక్ష్యం. దాదాపు 44రోజుల క్రితం మాజీ సిఎం, ప్రతిపక్షనేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం, నన్ను ఎపిలో అడుగుపెట్టనీయకుండా అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే.  దేశసమగ్రత, ఎపి అభివృద్ధి మాకు ముఖ్యం, 2014లో అనుభవం ఉన్న నాయకుడు ఉండాలని భావించి టిడిపికి మద్దతు ఇచ్చాం. మేం వైసిపి అరాచకం, దోపిడీ, దారుణాలకు వ్యతిరేకం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. నాసిరకం మందును ఏరులై పారించి 30వేలకోట్లు దోచుకున్నారు. ఇసుక, మినరల్స్, ఖనిజదోపిడీకి పాల్పడుతున్నారు. ఉద్యోగులను సిపిఎస్ విషయంలో మోసగించారు. 

*ఉమ్మడి ప్రణాళికకోసం లోతైన చర్చలు*

 టిడిపి- జనసేన ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై ఉమ్మడి ప్రణాళిక కోసం సమావేశమయ్యాం. ఉమ్మడి మ్యానిఫెస్టోపై దాదాపు 3గంటలసేపు చర్చించాం, ఎలా కలసి పనిచేయాలనే విషయమై సీనియర్ నేతలు యనమల, మనోహర్ వంటివారితో లోతైన చర్చలు జరిపాం. భవిష్యత్ ఎన్నికల్లో ఎలా కలసి వెళ్లాలి, సుస్థిర పాలనను ఎలా అందించాలి, ఎపి యువత, ఉద్యోగులు, రైతులకు ఎటువంటి పథకాలు ఉంటే బాగుంటుంది అనే అంశాలపై టిడిపి విధానాలు, ఆలోచనలను లోకేష చెప్పారు, జనసేన కూడా తమ ఆలోచనను తెలియజేసింది. రాబోయే వందరోజుల్లో ఉమ్మడి ప్రణాళికను ఎలా తీసుకెళ్లాలనే అంశంపైనే చర్చించాం. 2024లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత రాజమండ్రిలో విజయోత్సవ సభ జరగాలన్నదే నా ఆకాంక్ష.

Comments