103 కాదు 361మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి.

      తెనాలి (ప్రజా అమరావతి);

103 కాదు 361మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి. జగన్మోహనరెడ్డి ప్రభుత్వానికి రైతు శ్రేయస్సుపై ఏమత్రం అవగాహన లేదని రాష్ట్రంలోపంటలకు నీరందించలేక పంటలు  ఎండిపోవటంతో కరువ విలయతాండవం చేస్తుంటే  కరువేలేదని  బుకాయిస్తూ రహస్యంగా  క్షేత్రస్ధాయిలో వాస్తవాలు తెలుసు కోకుండా 103 కరువు మండలాలుగా రహస్యంగా ప్రకటీంచారని జనసేన PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  అన్నారు. 


బుథవారం హాఫ్ పేట కొలకలూరు ప్రాంతంలోని రైతుల పంటపొలాలను ఆయన అచ్చటి రైతులతో  పరిశీలించారు. సరైన ముందస్తు ప్రణాళిక లేకపోవటంతో,కాలువ నీరు  పారక పోవటంతో ఆయిల్ ఇంజన్లతో తడిపితే ఎకరాకు 4 వేలు ఖర్చఅవుతందని రైతులు ఆయనకు మొరపెట్టుకొన్నారు, తాము తెలగుదేశం వారితో కలసి రైతు శ్రేయస్సుపై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను క్షేత్రస్ధాయిలో  వాస్తవముల అనసరించి రూపొందిస్తున్నామని రైతుల  శ్రేయస్సే అతమ లక్ష్యమన్నారు.Comments